మిత్రులారా.... ఎలాఉన్నారు? చాలా రోజులతరువాత మరలా మిమ్మలను కలుస్తున్నాను. ఇప్పటివరకూ చాలా lessons చదివారు.. చాలామంది విద్యార్ధులు చాలా ప్రశ్నలు సంధించారు.. వాటిని అనుసరించి ఈరోజునుండి మరో కోణంలో భాష నేర్చుకునే ప్రయత్నం చేద్దాము.
భాష నేర్చుకోవడానికి ఈత నేర్చుకోవడానికి ఏమాత్రం తేడాలేదు. మేము ఒడ్డునే వుంటాము. మీకు 10 వేల రూపాయలు ఇస్తాము ... ఈత నేర్పండి... అంటే ఎవరూ మనకు ఈతనేర్పలేరు. మనము నీటిలో దిగితేనే ఈత వస్తుంది. అలాగే మనము మాటలాడితేనే మాటలాడటం వస్తుంది తప్ప... మీరు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని బ్లాగులు తిలకించినా భాష రాదనేది నా ఉద్దేశ్యము.. so.. మనము ఆ కోణంలో ఈరోజునుండి ప్రయత్నిద్దాము..
మనము ఏ భాష నేర్చుకున్నా దాని వుద్దేశ్యము ఎదుటివ్యక్తితో సంభాషించడమే.. ఏ సంభాషణ అయినా ప్రశ్నలతోనే ప్ర్రారంభమవుతుంది.. కాబట్టి మనము ప్రశ్నిచడము, ఎదుటివ్యక్తి ప్రశ్నలకు సమాధానము చెప్పడము నేర్చుకుందాము.
కానీ ఒకటి.. వీటిని సైతము మీరు కంఠతా పడితే భాష వచ్చేస్తుందని మీరు అనుకోవద్దు. మీరు నేర్చుకున్నదానిని ప్రాక్టికల్ గా apply చేయాలి. అప్పుడే అవి మనకు గుర్తు వుంటాయి.
మీరు ఒక ఐదుగురు పిల్లలకు ఉచితముగా tuition చెప్పండి. వారితోనే సంభాషణ మొదలు పెట్టండి. వారినికూడా మిమ్మల్ని ప్రశ్నించమనండి. ఇది ఇంగ్లిష్ నేర్చుకోవడం లో ఒక భాగమని చెప్పండి. లేదా ఇద్దరు friends కూర్చుని ప్రయత్నించండి.
మనము ఎవరు కనిపించినా How are you అంటాము. వారు ఇంగ్లీష్ పెద్దగా రాకపోయినా fine అంటారు. (వారు how do you do? అంటే మనము how do you do అని మాత్రమే అనాలి ..ఇంగ్లిష్ సంప్రదాయములో how అనేది ప్రశ్నగా మాత్రమే కాకుండా సమాధానము గా కూడా ఉపయోగపడుతుంది. ఇలా మనము english ని english గానే చూడాలి తప్ప తెలుగుకి దానిని అన్వయించకూడదు. ఎవరి మాతృ భాష వారికే స్వంతం.. వాటిని మనము నేర్చుకోవాలంటే అలాగే నేర్చుకోవాలి తప్ప మరోలా కాకూడదు.) మనము మిగతా ప్రశ్నలు కూడా ఇంత అలవోకగా, shy ఫీల్ కాకుండా, ఏదో పాఠం అప్పగిస్తున్నట్లుగా కాకుండా ... అతి సహజముగా అడగగలిగితే ... ఇతరులు అడిగినప్పుడు చెప్పగలిగితే మనము కొంత ఇంగ్లిష్ సంభాషణకు అలవాటు పడినట్లే.... కనుక ఆ దిశగా ప్రయత్నించండి....
How do you do? .. మీరు ఎలా ఉన్నారు?
How do you do. .. నేను బాగున్నాను.
- How is your health? (It is better)
- How old are you? ( I am 22 years old)
- How is your father? (He is fine)
- How do you get the award? (...by presenting the project)
- How do you go to school? (..by bus)
- How is she coming here? (.. by train)
- How do you go to the temple?( I go to the temple on foot)
- How is your study? (It's good)
- How is your business? (It runs smoothly)
- How is the movie? (.. is fine)
- How much is the price? (the price is less)
- How do you come to know that? నీకు ఎలా తెలిసింది? (I know it through my friend.
- How do you prepare the food? (... myself)
- How do you feel about this? (... happy)
- How do you help him? (I help him in his studies)
- How do you save your money? (.. in the bank)
- How do you meet him? (.. in the temple)
- How do we treat him ( ... as friend)
- How do you was the journey? ( It was very good)
- How much does it cost? (...Rs 100/-)
(మరలా రేపు కలుద్దాము.)
0 comments:
Post a Comment