ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Tuesday, September 17, 2013

RUNNING RACE OF A DOG

రష్యన్ ఆంగ్ల వ్యాకరణ వేత్త శ్రీ M.I.డుబ్రొవిన్'ఒక కుక్క యొక్క పరుగు పందెము' ను వర్ణించుటలో 20 prepositions ని వుపయోగించారు. దానిని మీరు గమనించండి.

A dog starts (1) in front of a school (2) with its front legs (3) on the line. It runs (4) through a gate (5) across a road. It runs (6) round a tree. It climbs (7) up a wall and jumps (8) from the wall (9) into the garden. Now it rests (10) inside the garden (11) for a while. It crossed (12) over a bridge in the (13) middle of the garden and runs (14) out of the garden. (15) Outside the garden it runs (16) between the trees and (17) behind a wall. It runs (18) under a bridge and runs (19) towards its kennel.  It reaches the destination and finally rests (20) near the kennel. 

 1. in front of... ముందు భాగమున 
 2. with............ తో 
 3. on.............. మీద 
 4. through.............. గుండా 
 5. across..............  అడ్డముగా 
 6. round..........   చుట్టూ 
 7. up................. పైన 
 8. from.............. నుండి 
 9. into.............. లోనికి 
 10. inside.............. లోపలి భాగమున 
 11. for............కొరకు/సేపు 
 12. over........ మీద 
 13. in the middle of........ మధ్య భాగమున 
 14. out of...........లోనుండి 
 15. out side.............. బయటి భాగమున 
 16. between.................. రెండింటి మధ్య 
 17. behind................ వెనుక 
 18. under........... క్రింద 
 19. towards.......... వైపు 
 20. near..............దగ్గర 
(ఆలమూరి వారి book నుండి సేకరణ)

Saturday, September 14, 2013

WHERE THE MIND IS WITHOUT FEAR

Where the mind is without fear and the head is held high
Where knowledge is free
Where the world has not been broken up into
            fragments by narrow domestic walls
Where words come out from the depth of truth
Where tireless striving stretches its arms towards 
            perfection
Where the clear stream of reason has not lost its
           way into the dreary desert sand of dead habit
Where the mind is led forward by thee into ever widening
           thought and action
Into that heaven of freedom, my Father, let my country 
           awake..
                                       (Rabindranath Tagore)
                                #################
ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో..
ఎక్కడ మనిషి తల ఎత్తుకొని తిరగ గలడో..
ఎక్కడ జ్ఞానం స్వేచ్చగా లభిస్తుందో..
ఎక్కడ సంకుచితమైన గోడలతో ప్రపంచం చిన్న చిన్న ముక్కలుగా విడిపోదో..
ఎక్కడ మాటలు సత్య సంధతా లోతులనుండి బయటకు వస్తాయో ..
ఎక్కడ అలసట లేని ప్రయత్నం తన చేతులను నిరంతరం పరిపూర్ణత వైపు చాస్తుందో..
ఎక్కడ స్వచ్చమైన హేతు ప్రవాహం..అనాగరిక ఆచారపు ఎండుటెడారుల్లో ఇంకిపోదో..
ఎక్కడ మనసు విశాలమైన ఆలోచన,కర్మలవైపు నీ చేత ముందుకు నడిపించబడుతుందో..
అటువంటి స్వేచ్చాధామమైన ప్రపంచంలోకి ..నా తండ్రీ నా దేశాన్ని నడిపించు..

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates