ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Thursday, May 26, 2011

ముఖ్యమైన సూత్రం -Lesson-3(Cont.)

ఇది lesson-3 కి కొనసాగింపు-


     ఒక వాక్యంలో కర్త,క్రియ కర్మ- కాక అదనంగా కొన్ని మాటలు అవసరాన్ని బట్టి పెరుగుతుంటాయి. కర్త,క్రియ,కర్మ  వరుసగా వస్తూ అదనంగా వచ్చే పదాలను వాక్యం లో ఎలా చేర్చాలి? ఈ విషయం తెలుసుకోవడానికి ముందు మనము కొన్ని ప్రాధమిక అంశాలను నేర్చుకోవాల్సి ఉంటుంది.

     చిన్న వాక్యం పెద్దగా మారాలంటే వాక్యము లోని చిన్న విషయాన్ని మన మట్టుకు మనమే ప్రశ్నించు కుంటూ పొతే అర్ధవంతంగా వాక్యం పెరుగుతుంది.
అలా ఎందుకు? ఏదైనా పెద్ద వాక్యం తీసుకుని మనము ఇంగ్లిష్ లోకి మార్చటానికి ప్రయత్నించ వచ్చుకదా? అని అడగాలని ఉన్నదా?
     అలా చేస్తే మనకు కాన్సెప్ట్ సరిగా అర్థం కాదు మిత్రమా-

     నీ వాక్యానికి నీవే సృష్టి కర్తవు ఐతే నీ మస్తిష్కంలో అది సుస్తిరమై నిలుస్తుంది.

     సరే
            నేను వెళ్ళాను...... అనే వాక్యం ఎలా పెద్దది గా చేయవచ్చో చూద్దామా?!

  •              ఎక్కడకు వెళ్లావు?
  •              ఎప్పుడు వెళ్లావు?
  •              ఎలా వెళ్లావు?
  •              ఎందుకు వెళ్లావు?
  •              ఎవరితో వెళ్లావు?
                                      సమాధానం చూద్దాం----

                        " నేను  సైన్సు ఎగ్జిబిషన్ చూడడానికి నిన్న సాయంత్రం ఐదు గంటలకు బస్సులో నా నేస్తం తో కలసి  గుంటూరు వెళ్ళాను."

                 దీనిని ఇంగ్లిష్ లోకి మార్చాలి. ముందే మీకు చెప్పాను- -(నాగురించి చదివారా?) నాకూ ఇంగ్లిష్ రాదు. కలసి నేర్చుకుందాం . . అని-
కొన్ని ప్రాధమిక అంశాలు నేర్చుకున్న తరువాత దానిని మీరే మార్చి నాకు చెబుదురుగాని. సరేనా?! ----

TRY (పదజాలం ఇలా నేర్చు కొండి )


Wednesday, May 25, 2011

RISE (పదజాలం ఇలా నేర్చు కొండి )


పదజాలం లేకుండా ఏ భాష రాదు.TAMILCUBE.COM వారి సహకారం తో ఇచ్చే క్రిందవాటిని ఫాలో అవటం ద్వార
మీరు మీ పదజాలాన్ని అభివృద్ధి చేసుకోండి.







Tuesday, May 24, 2011

సి.ఫై.బ్రౌన్ అకాడమి




C.P,Brown Academy వారు తమ సైట్ లో చక్కటి పిల్లల కధలను అటు ఇంగ్లీష్ వెర్షన్ ఇటు తెలుగు వెర్షన్ లో ఇచ్చారు.వీటిని మార్చి,మార్చి చదవడం వలన మనము వొకాబులరీ ని వృద్ది చేసుకోవచ్చు.వీటి లింక్ లెఫ్ట్ స్లైడర్ లో గమనించండి. అసలు ఇలాంటి లింక్స్ మన సైట్ లో-మన మరో సైట్ ఐన grammar games లో చాలానే ఉన్నాయి.వేసవి శలవల్లో మీ పిల్లలకు మన బ్లాగ్ పరిచయం చేయండి.ఇంగ్లీష్ లెర్నింగ్ లో ఖచ్చితం గా ముందుకు వెళతారు.నమస్తే  

Friday, May 20, 2011

సహాయక క్రియలు


AUXILIARY VERBS

Normal క్రియలు అసంఖ్యకాలైనప్పటికి Helping verbs మాత్రము 24 మాత్రమే

రూట్ verb- - - - - - - --  -Derivatives

Be...........................is,am,are,was,were  (5)

Do..........................do,does,did (3)

Have.......................have,has,had (3)

{(ఈ 11 principle auxiliary verbs (ప్రధాన సహాయక క్రియలు) ఇవి భాషలో తరచుగా అడుగడునా వస్తాయి.be,been,done సంగతి ప్రత్యేకం)}

shall........................shall,should (2)
will...........................will,would (2)
can...........................can,could (2)
may.........................may,might (2)
must........................must (1)
ought.......................ought(1)
{(ఈ పది కేవలం  సహాయక క్రియలుగానే పనిచేస్తాయి)}

used..........................used (1)
need..........................need(1)
dare...........................dare(1)
{ఈ  మూడు ఒకొక్క సారి helping verbs గాను, మరో సారి NORMAL VERBS గాను పని చేస్తాయి.ఎలా పనిచేస్తే ఆ క్రియ లక్షణాలు వస్తాయి.} 

{పైన తెలిపిన  11 Principle auxiliary కాకుండా మిగిలిన (10+3=13) ని Modal Auxiliaries అంటారు.... గమనించండి......Model కాదు .. Modal}

            Modal= విధానము   . . . . Model= నమూనా



Thursday, May 12, 2011

"THERE" కధ


--------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------
"There is no hope"  అనే వాక్యంలో మొదటిలో ఉన్న There  కి అర్థం పలకదు(లేదు). 
"The accident happened there" అనే వాక్యంలో చివరిలో ఉన్న There కి అర్ధం ఉన్నది.

English సంప్రదాయంలో వొక భావాన్ని గాని, పదాన్ని గాని చెప్పేటప్పుడు వాక్యరుపంలో చెప్పడమే ఆచారం గా మనం చెప్పుకోవాలి.

* There is no hope- - - అంటే ఆశ లేదు అని అర్థం. అంతే గాని ,,,, అక్కడ ఆశ లేదు ... అని కాదు.
*There is no body in the house..... ఇంటిలో ఎవరు లేరు...(అక్కడ ఇంటిలో ఎవరూ లేరని అర్ధం కాదు.)
*There is a boy in the ground.... .. ground లో పిల్లవాడు ఉన్నాడు.
*There is a picture on the wall ..... 
*There is some good news for you.... 

అలాగే . . . . . . . . . 

    * He came "there" yesterday.... అంటే అతను నిన్న అక్కడకు వచ్చాడు అని అర్థం.
                                                         ( ఇక్కడ there కి అర్థం ఉన్నదది కదా)
    *The College Bus Stop There.... college బస్సు అక్కడ ఆగుతుంది.
    *Stand there......
    *The school books are available there..........
--------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------

Monday, May 2, 2011

వాక్యములు-రకములు



                                         ENGLISH SENTENCES

వాక్యములు ప్రధానంగా నాలుగు రకాలని చెప్పవచ్చు.

1)ASSERTIVE--------------> Statements

2)INTERROGATIVE------->Questions

3)IMPERATIVE------------->Requests,Orders,Commands

4)EXCLAMATORY-------->Expressions of Joy/sorrow 

Assertive ని రెండు కోణాలలో చూడాలి.

1) Affirmative(positive)---- వీటినే నిర్ధారణ వాక్యాలంటారు.అంటే మనము యౌనని చెప్పినప్పుడన్నమాట

2) Nagative----- పై డానికి వ్యతిరేకం...అంటే ...కాదని చెప్పినప్పుడు.
( No, Not, Never, Neither-Nor, Nothing, Nobody, None,Without మొదలైన పదాలలో ఏదో ఒకటి వస్తుంది.)

INTERROGATIVE ని కూడా రెండు కోణాల్లో చూడాలి.

1) Yes or No type (Can you drive a car?)  ఈ ప్రశ్నలకు మనము యౌనని గాని కాదని గాని సమాధానం చెబుతాము.

2) Wh..Questions (What is your Name?) వీటిలో మరలా Negative, Positive ఉంటాయి.

IMPERATIVE ని గమనించి నట్లయితే ఇవి NEGATIVE లు గా మారతాయి గాని ప్రశ్నలుగా మారవు. దీనిలో SUBJECT ... Imperative గా ఉంటుంది. అంటే దాగి ఉంటుంది. ఉదాహరణకి  Stop There అంటే ....  You Stop There  అని అర్థం.

ఓకే... దిగువునగల వాక్యాలు గమనించండి.
  1.  Stop there (command)
  2. Have mercy on me (Entreaty= వేడికోలు)
  3. Please give me your pen (Request)
  4. Oh..God! Save me from Sin (Prayer)
  5. Meet the Doctor (Advice) 
SOME OTHER IMPERATIVE SENTENCES

  •  March on
  • Stand at the gate
  • Turn to the right
  • Kindly help me in this matter
  • Please lend me your book for two days
  • Almighty God! Save me from this danger
  • Please explain this passage once again
  • Go and deliver this massage at once.
ఇక Exclamatory Sentences కి వస్తే . . . . ఇవి statements కావు. అలాగే Questions కూడా కాదు. మాట్లాడే వ్యక్తికి sudden గా కలిగే భావాల్ని వ్యక్త పరచే వాక్యాలు. కొన్నింటిని దిగువన చూద్దాం.

  1.   How beautiful the garden is!
  2. What a fool you are!
  3. Alas, the pretty dog is dead.
  4. Hurray, the school team has scored a goal 
  5. Oh! that I had wings!
=================================================

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates