ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Friday, April 1, 2011

ఎలా చదవాలి?


           కొంతమంది మిత్రులు మెయిల్ పంపారు. ఏమనంటే -" సర్ ఈరోజే మీ బ్లాగ్ చూడటం జరిగింది. కానీ అందులో lessons చాలానే ఉన్నట్లుగా  ఉన్నాయి,మరి మేము ఎలా చదివితే బాగుంటుంది".అని 
       మిత్రమా- ఇందులో Lessons తో పాటుగా ఇంగ్లిష్ కి, చదువుకు సంభందిచిన మరికొన్ని విషయాలను పోస్టులు గా పబ్లిష్ చేయడం జరుగుతుంది.
         అవన్నీ చదువుకోవడం మంచిదే. కానీ గ్రామర్ పట్ల సరైన అవగాహన కలగాలంటే LESSON-1, LESSON-2, LESSON-3  ఇలా వరుసగా చదివితే బాగుంటుంది. ఇవన్ని మీకు బ్లాగ్ ఆర్చివ్ లో (కుడిప్రక్క) కనిపిస్తాయి. కానీ ఇంకా తేలిక పద్దతి ఏమంటే - (ఇది అందరికి తెలిసిందే)
మన బ్లాగ్ HEADING పైన (Top left corner) 'భాగస్వామ్యం చేయి' అనే మాట ప్రక్కన -search box ని గమనించారా?  దానిలో Lesson-2 అని టైపు చేసి ఎంటర్ కొడితే మీకు ఎంచక్కా lesson-2 కనిపిస్తుంది. అలా అవి వరుసగా చదువుకోవచ్చు. మరల home click చేసి వెనక్కు వెళ్ళవచ్చు.
        ఇలాగే మీ సందేహాలు వ్రాయండి. శలవ్-    

0 comments:

Post a Comment

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates