ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Friday, April 8, 2011

కధను మీ చెవులారా వినండి.

ఇంగ్లిష్ లో కధ వింటూ -బొమ్మలు చూస్తూవుంటే ఎంత బాగుంటుందో 
కదా- అంతేనా? దీనివల్ల ఉపయోగాలేమిటో చూద్దాం.

  • ఇంగ్లిష్ ఉచ్చారణ తెలుస్తుంది.
  • పదజాలం (vocabulary) పెరుగుతుంది.
  • వాక్య నిర్మాణం తెలుస్తుంది.
  • కధను ఎంజాయ్ చేయవచ్చు.
  • అసలు ఇంగ్లిష్ మాట్లాడటం మెల్ల మెల్ల గా అలవాటు అవుతుంది.
 మరి storytimeforme వారికి కృతఙ్ఞతలు చెబుతూ ప్రక్క slider లోని 2 వ  లింక్ ని క్లిక్ చేయండి.

               
   ఇంతకీ మీరు వినబోయే కధ పేరేంటో తెలుసా?  "JOE TAKES A STAND" మరి ప్రతి వారం ఒక ప్రత్యేకమైన కధా పరిచయాన్ని   పబ్లిష్ చేయమంటార? లేదా మీరే 'STORYTIME' SITE లోకి వెళ్లి కధలన్నీ వినేస్తారా?  మీ ఇష్టమండి. ఈ పోటి ప్రపంచంలో ఇంగ్లిష్ అనే ఆయుధం చే బూని ముందుకు సాగిపోవడమే నాకు కావలసింది.-

                   మనలో మాట- మీ సమయం లో 2 1/2 (రెండున్నర్ర) సెకనులు కేటాయించి ఒక చిన్న కామెంట్ వ్రాయవచ్చు కదా- అప్పుడే కదా మేము పబ్లిష్ చేసేదానిలో చెత్త ఉన్నదో, సత్తా ఉన్నదో  తెలిసేది.

                   ఇంకో మాట (కోపం వద్దు) అలా చదివేసి వెల్లిపోతారేంటి? ఫాలోయర్ గా REGISTER అవ్వవచ్చు కదా-
దానివల్ల మీ కెలాంటి ప్రాబ్లం రాదండి బాబూ.....మా బ్లాగర్లకు చిన్న సంతోషం తప్ప. 

                   త్వరలో LESSON-5 పబ్లిష్ చేయగలనని మాట ఇస్తూ - ప్రస్తుతానికి శలవు.

1 comments:

Unknown said...

continue i am following

Post a Comment

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates