ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Monday 13 October 2014

నిజజీవితంలో వాయిస్ (ఆఖరి భాగము)


                       
Active voice- Passive తేడ..I sent a letter (AV)...నేను లెటర్ పంపాను.
A letter was sent by me(PV)....నాచేత లెటర్ పంపబడింది.

పైన మనం AV ని PV గా మార్చాం. అర్ధ భేదం లేదు..నిజ జీవితం లో కూడా మనం ఇలాగె మాట్లాడితే అక్కడ కూడా అర్ధ భేదం ఉండదు.కాని మనము active voice ని passive voice గా మార్చో...లేక passive voice ని active voice గా మార్చో ఇంగ్లిష్ మాట్లాడం.అక్కడ సందర్భాన్ని బట్టి దేనికదే విడి విడిగా ఏది బాగుంటదని అనుకుంటామో అదే మాట్లాడతాము.ఇక్కడ Be+V3 =Passive voice గా మనము గుర్తు పెట్టుకోవాలన్తే.చదువుకొనే రోజులలోని గ్రామర్ ని మనసులో పెట్టుకొనే అర్ధభేధం వుదడనే భావననుండి మనము బయట పడాలి.అక్కడ వరకూ అది రైటే.కాని మనము మాట్లాడే విధానము వేరు.ఇక్కడ దేనికదే విడివిడి గా భావించాలి.
I sent = నేను పంపాను
I was sent = నన్ను పంపారు. (ఇక్కడ అర్ధం విభేదించింది కదా)

కాని పై వాక్యాలు ఈ వాక్యాలు ఒక్కటి కాదు. పై వాక్యాలు AV నుండి PV కి మార్చాము.ఇక్కడ మాత్రం దేనికదే విడి విడి గా వున్నది.AV నుండి PV కి మార్పు కాదని గమనించండి.

MORE EXAMPLES
  1. He liked: అతను ఇష్టపడ్డాడు...He was liked: అతనిని ఇష్ట పడ్డారు.
  2. He arrested: అతను అరెస్ట్ చేసాడు..He was arrested..అతనిని అరెస్ట్ చేసారు.
  3. He selected..అతను సెలక్ట్ చేసాడు..He was selected ..అతనిని సెలక్ట్ చేసారు.
  4. I told.. నేను చెప్పను.....I was told..నాకు చెప్పారు
  5. Rama saw..రాముడు చూసాడు..Rama was seen..రాముడ్ని చూసారు.

Friday 10 October 2014

నిజజీవితంలో VOICE పార్ట్ -4


అనేక క్రియలు అసలు ఏమేమి చెబుతాయి?

చర్యలను బట్టి క్రియ వాక్యంలో ఏమిచేబుతుందో గమనించండి.

1) వస్తువు గాని,వ్యక్తీ గాని ఏమిచేయునో తెలుపుతుంది.
    (come,take,act,play,eat..ఇలా అనేక రకాలు)


      *Chiranjeevi acted in many films
      * She sings a song

2) వస్తువుకు గాని,వ్యక్తికీ గాని ఏమి జరిగిందో తెలుపుతుంది. (Be+V3)
Be= is,am,are,was,were,be,been,being


ఇదే passive Voice

*He was arrested
*Letters were posted
*Shop was closed

3) వస్తువుకు గాని,వ్యక్తికీ గాని 'కలిగియుండి ' అనే భావనని తెలుపుతుంది.
(Have,Has,Had)


          *She has knowledge
          *They had Rs.15 lakhs
          *I have a computer


4) ఒక వస్తువు,వ్యక్తీ యొక్క స్తితి ని గాని, గుణాన్ని గాని, చెబుతుంది.అలాగే చేసే పనిని కూడా చెబుతుంది. (నిజానికి ఇది ఒకటవ రూలుకు సామీప్యం)


(is,am,are,was,were,will be, shall be)


                                                           *The kids are on the bed
     *Chiranjeevi is a popular hero
     *Rama is a good boy
     *Sita is reading  


 (సశేషం)
         

Followers

కృతజ్ఞతలు


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

Age calculator

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *

నా జ్ఞాపకాలు

My Students Slideshow: RAMA’s trip to Kollūru (near Vijayawada), Andhra Pradesh, India was created by TripAdvisor. See another Vijayawada slideshow. Create your own stunning free slideshow from your travel photos.

పెద్దబాలశిక్ష

 
Blogger Templates