10 వ తరగతి విద్యార్థులకు సూచనలు.
26-3-12 ప్రారంభమయ్యే 10 వ తరగతి విద్యార్ధుల కోసం.
- ప్రతి రోజు రాత్రిపూట 10 గంటల దాక చదవండి.
- తెల్లవారు ఝామున 4.30 లకు నిద్రలేవండి.
- మనసులో ఆందోళన లేక ప్రశాంతం గా వుండండి.
- ఎట్టి పరిస్థితులలోను రాత్రి పూట నిద్రాభంగం కానివ్వకండి.
- ఉదయం 4.30 to 6.30 వరకూ చదవండి.
- ఒక అరగంట విశ్రాంతి తీసుకోండి.
- అరగంట కాల కృత్యాలకు, స్నానానికి కేటాయించండి.
- తర్వాత పుస్తకం (main poits) తిరగెయ్యండి
- పౌష్టికాహారం లైట్ గా తీసుకోండి.
- ఉదయం 8.30 కల్లా దూరం వారు, 8.45 కల్లా దగ్గర వారు పరీక్షకు బయలుదేరండి.
- 8.50 కల్లా school లో ఉండండి.
- ప్రశాంతం గా పరీక్ష హాలు లోకి వెళ్ళండి.
- ఉపాద్యాయులు చెప్పే సూచనలు గమనించండి.
- జవాబు పత్రం ఇవ్వగానే దానికి మార్జిన్లు కొట్టండి.
- ప్రశ్నాపత్రం క్షుణ్ణంగా చదవండి.
- బాగా వచ్చిన ప్రశ్నలు ముందుగా వ్రాయండి.
- తప్పులు,కొట్టివేతలు లేకుండా వ్రాయండి.
- రాసేటప్పుడు,ప్రశ్న నెంబరు,సెక్షన్ రాయండి.
- జవాబు అవ్వగానే గీత కొట్టండి.
- మరొక ప్రశ్నకు ఉపక్రమించండి.
- ముందు అన్ని తెలిసిన ప్రశ్నలు తప్పులు లేకుండా వ్రాయండి.
- చివరకు,తెలియని ప్రశ్నలు , ఛాయస్ ట్రై చేయండి.
- గుర్తు రాకపోతే తలని ఎడమ వైపు త్రిప్పి ఆలోచించండి.
- చివరి 15 నిముషాలు వ్రాసిన పేపర్ ని ఒకసారి పరిశీలించండి.
- తప్పులు,ప్రశ్న నెంబర్లు సరి చూడండి.
- బిట్ పేపర్ ఇవ్వగానే దారం తో కట్టండి.
- ముందు తెలిసినవి వ్రాసి, చివరగా ఆలోచించి అసలు ఏది వదలకుండా పూర్తి చేయండి.
- వార్నింగ్ బెల్ కొట్టినా లేవకండి. అన్ని పరిశీలించాక తృప్తి గా బయటకు రండి.
- జరిగిన పరీక్షలలో పొరబాటున ఏదైనా తప్పు రాస్తే దానినే పట్టుకుని వేళ్ళాడకండి..
- నేరు గా ఇంటికి వెళ్లి లంచ్ చేసి,ఒక గంట నిద్రించండి.
- తరువాత రెండు గంటల వ్యవధిలో మధ్య మధ్య లో 15 నిముషాలు గ్యాప్ ఇస్తూ చదవండి.
- బొమ్మలు,మ్యాప్ , గ్రాఫ్ పేపర్ మీద పెన్ ఉపయోగించకండి.
- బుద్దిమంతులుగా మసలండి.కాపీ అనే ఆలోచన మనసులోకి రానీయకండి.
- చక్కని విజయాన్ని అందుకుని - అమ్మ,నాన్న,మీ టీచర్స్ ని సంతోష పెట్టండి.
- ఆల్ ది బెస్ట్.
--(తిరిగి publish చేయబడింది)
0 comments:
Post a Comment