ముందు మాట
డియర్ ఫ్రెండ్స్
ఎక్కువ మాటలు అనవసరం.చెప్పాల్సింది సింపుల్ గా మనసుకు హత్తుకునేలా చెప్తూ 'ENGLISH' లోని అసలు మర్మాలు చెప్పడమే ఈ బ్లాగ్ ఉద్దేశ్యం.
ముందు ఇది తెలుసుకోండి, ఇంగ్లీష్ గ్రామర్ వచ్చినంతనే ENGLISH లో మాట్లాడలేరు. ENGLISH మాట్లాడే వారందరికి గ్రామర్ వచ్చని అర్ధం కాదు.
అసలు నీకు TELUGU గ్రామర్ ఎంత వచ్చని నీవు తెలుగు అంత అనర్ఘళంగా మాట్లాడుతున్నావు? నీవు చిన్నప్పుడు మాట్లాడుతూ చేసే తప్పులను
సరి చేసి అమ్మ,నాన్న,ఇరుగు-పొరుగు, నీకు తెలియకుండానే 'తెలుగు' బేసిక్స్ చెప్తున్నారన్నమాట.
ఆపై నీకు నువ్వే నీ పరిసరాలనుండి, నీ అవసరాల నుండి ఎన్నోన్నో పదాలను- ఆపై వాక్యాలను నేర్చి ఈ దశకు వచ్చావు. అందుకే ముందుగా నేను చెప్పే ప్రాధమిక అంశాలను మనసు పెట్టి తెలుసుకో.{ ఇవి అన్ని నీవు గ్రామర్ పుస్తకాలలో చదివినవే కావచ్చు-చదవని వారూ ఉండవచ్చు కదా. అదీ గాక 'బేసిక్స్' ఎప్పుడూ ముక్కున పెట్టుకుని వదిలేవి కావు. బేసిక్స్ లో PERFECTION లేనప్పుడు ఒక భాష నే కాదు, మరేమీ సాధించలేము.} ఆపై "కృషితో నాస్తి దుర్భిక్షం" అన్న ఆర్యోక్తి ని నమ్మి పట్టుదలతో ముందుకు సాగిపో-
ఎందుకు? ఏమిటి? ఎలా? అని బాబు మోహన్ లా ప్రశ్నించకుండా ముందుగా నేను తెలియ జేయబోయే మినిమం కాన్సెప్ట్స్ ని అవగాహన చేసుకుంటూ, అవసరమైనవాటిని కంటస్థం చేస్తూ - ప్రతి రోజు 10 పదాలైన నేర్చుకుంటూ ముందుకు సాగిపో.......ALL THE BEST
--------------------------------------------------------------------------------------------------
నమస్కారములు
{ ఇది పూర్తిగా స్వగతమే- చదవలేకపోతే వెనక్కివెల్లిపోవచ్చు.}
1)ఈ బ్లాగ్ ముఖ్యముగా గ్రామీణ ప్రాంతాలలో తెలుగు మీడియం లో చదివి ప్రస్తుతం ఏదో ఉద్యోగం లో స్థిరపడిన
{ అదీ మా సర్కారీ బడి పిల్లల కోసం.(ఇలాంటి పిల్లలు ఆదివారాలు వస్తే కూలికి వెళ్లి వుంటారు.బడినుండి ఇంటికి వెళ్ళాక - అమ్మ కొట్టుకు వెళ్లి పచారీ సరుకులు తెమ్మంటుంది. నాన్నపొలానికి అన్నం తెమ్మంటాడు.ఇంకా చెప్పాలంటే సమస్యలు చాలానే. ఇలా పాపం వారికి class లో చెప్పినదానిని మననం చేసుకోవడం కుదరదు." మననం లేని చదువు అరగని భోజనం లాంటిది అంటారు" ఇలా వారు ప్రాధమిక అంశాలు మిస్ అయి ఉంటారు. వారు తిరిగి వాటిని గుర్తుకుతెచ్చుకుంటారనే ఆశ.)} ఈరోజు ప్రతి school లోనూ net సౌకర్యం వుంది.కనుక ప్రస్తుతం చదివే పిల్లలైనా ఉపయోగించుకోవచ్చు...
2)ఇంగ్లిష్ క్లాసు రాగానే వెనుక బెంచీకి, మారిపోయి టీచర్ కి కనపడ కుండా నక్కి-నక్కి కూర్చునే పిల్లలకోసం.(కారణాలు ఏమైనా - వీరికి ఎందుకో ఇంగ్లిష్ అంటేనే భయం,చిరాకు-ఇంగ్లిష్ మాస్టర్ అన్నా బోల్డంత కోపం)
3) మా నేస్తం నిమ్మగడ్డ మోహన్ మాస్టారి కోసం.(ఈ కధ కూడా చదువుతారా)
తన గురించి చెప్పటం మోహన్ గారికి అస్సలు ఇష్టం ఉండదు.కానీ చెడుని ఖండించక పోవడం ఎంత తప్పో - మంచిని ప్రోత్సహించకపోవడం అంతే తప్పుకదండి...వారు, నేను.. కలసి పని చేసాము.అయన సంపాదనలో కొంత శాతం ఖచ్చితంగా పేద విద్యార్దులకు ఖర్చు పెట్టేవారు.మనం ఎవరికైనా ఏమైనా చేయాలంటే ముందు మనం నాలుగు రూపాయలు సంపాదించాలి అనే ఉద్దేశ్యంతో వ్యాపారంలో అడుగుపెట్టారు.ఎంత సంపాదించినా టీచర్ గా నేను పొందిన తృప్తి ఎప్పుడూ పొందలేదని ఎన్నో సార్లు నాతో చెప్పారనుకోండి. అది వేరే విషయం.అసలు విషయం ఏమంటే ఈ COMPUTER వారి సహకారం తోనే తీసుకున్నాను.
వారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే . . వారి మాటల్లోనే -- "ప్రతి మనిషి లోను స్వార్ధం ఉంటుంది-ఉండాలికూడా -నేను,నా కుటుబం, నా పిల్లలు--ఇలా మనము ఆలోచిస్తాము. తప్పు లేదు --కాని - మనము వందలమందికి ఉపయోగ పడక పోయినా నలుగురికైనా ఉపయోగ పడనప్పుడు ఎందుకండీ ఈ జీవితం" అంటారాయన. అసలు వారి మాటలు,చేతలు నాకు బాగా నచ్చుతాయి. వారి స్ఫూర్తి తోనే నేను ఏదైనా చేయాలనుకున్నాను.ముందుగా మనం ఒక బ్లాగ్ ని నడుపుతూ ఉంటె- ఆపై దాని ద్వారా మనము ఏదైనా చేయ ప్రయత్నించ వచ్చని ఈ ప్రయత్నం చేస్తున్నాను. ప్రోత్స హిస్తారని నమ్ముతున్నాను.
--------------------------------------------------------------------------------------------------------------------
నన్ను గుర్తుపట్టగలరేమో ప్రయత్నించండి.
"చీకటి నిండిన గర్భ గుడిలో దేవుడున్నాడో లేడో నాకు తెలియదు గానీ, 'జన్మ నిచ్చిన తల్లితండ్రుల లోను, దారిచూపిన ఉపాధ్యాయులలోను , తోడుగా నిలిచిన స్నేహితులలోను, నేను దైవత్వాన్ని చూస్తాను"
ఆ రోజులలో (నేను నిరుద్యోగిగా ఉన్న రోజులు) రోజువారీ రణరంగంలో ఉపవాసాలతో సహవాసాలు చేస్తూ, బాధలతో గాధలల్లుకుంటూ, క్షణమొక యుగంగా భావిస్తూ,'ప్రయత్నాలే అస్త్రాలుగా-ఫలితాలు శున్యాలుగా-ఓటమిని ఓర్చుకుంటూ - విజయాన్ని వరించే అవకాశం కోసం ఎదురుచూస్తూ - అలా చూస్తూ,చూస్తూ-ఒకరికి ఒకరం, ఇద్దరికీ ఇద్దరం,పదుగురుకు పదుగురం దూరం అయ్యాం- కష్టాలు,కన్నీళ్ళు పంచుకున్న ఆమిత్రులు ఇప్పుడు ఎవరెవరు ఎక్కడున్నారో?-వారిలో ఎవరైనా ఇందులో సభ్యులైతే!? -నన్ను గుర్తు పడితే!? -నాకంటి కొనలనుండి జాలువారే ఆనంద భాష్పం "ముత్యమై మెరుస్తుంది".. ............
(క్లూలు)
రేపల్లె ABR Degree college లో B.Com, గుడివాడ ANR కాలేజీ లో M.Com, Khammam,Vijayawada,Ponnur లో నేతాజీ కాన్వెంట్ supervisor, kankipadu-Boppana oils లో acountant- కొండపల్లి railway స్లీపెర్స్ కంపనీ లో Technician-( నా బ్రతుకు మజిలీలలో ఇవి కొన్ని)
well.....This is Pratap......I am very friendly.....always smiling... enjoys each and every moment......I can't descride me in 2 or 3 sentence(because...I am an innocent) ...you will come to know when you talk to me....very much intrested in knowing new things....keep smiling......ok-may I take leave of you my friends----Have a nice day...
..
------------------------------------------------------------------------------------
మనము ఎవరినో ఒకరిని రోల్ మోడల్ గా తీసుకొని ఆ స్పూర్తి తో ముందుకు వెళుతూ వుంటాము.ఇది ఆహ్వానించ దగ్గ విషయమే.అలాగే మనము చేసిన మంచి పనులనే గుర్తుకు తెచ్చుకొని మనకు మనమే రోల్ మోడల్ గా వుండవచ్చు.
మనము వయసు రీత్యానో,భాద్యతలు పెరగడం ద్వారానో, లేక పరిస్థితుల ప్రభావం వలనో..మునుపటిలా Active గా వుండలేకపోవచ్చు..మన భాద్యతలను మనము సరిగా నిర్వర్తించలేక పోవచ్చు.అలాంటప్పుడు..మీరు గతంలో సాధించిన..అవార్డులు,రివార్డులు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. వాటి సాధనలో మీరెంత కష్టపడ్డారో మననం చేసుకోండి.ఇంక అంతే...మనకు ..ఆ గతించిన ఎనర్జీ వచ్చేస్తుంది. నాకైతే నేను గతంలో నేను పనిచేసిన ఒక పాఠశాల నుండి బదిలీ పై మరో పాఠశాలకు వెళ్లినప్పుడు అక్కడి పిల్లలు కనపరచిన ఆప్యాయతా,అబిమానాలను గుర్తుకు తెచ్చుకొని అదే స్పూర్తి తో ఇప్పుడు కూడా పని చేస్తుంటాను...మీ ప్రతాప్
-భవదీయుడు
వి.వి.ప్రతాప్
PRATAPV351@జిమెయిల్.COM