SO-THAT (ADJECTIVE/ADVERB)
ఒక వాక్యములో ఒక adjective కి / adverb కి ముందు ఒక adverb వుండి రెండవ వాక్యములో ఆ adjective/adverb యొక్క తీవ్రతను చెప్పే వాక్యం వుంటుంది. మొదటి వాక్యం లోని adjective కి ముందున్న adverb కి బదులుగా So పెట్టి ఆ తరువాత వాక్యానికి ముందు that పెడితే ఒకే వాక్యం అవుతుంది.
Eg: He is very poor. He can’t pay his school fee.
He is so poor that he can’t pay his school fee.
TOO-TO
పై వాక్యములవలేనే మొదటి వాక్యములోని adjective/adverb కి ముందున్న adverb ని తొలగించి too వ్రాసి ఆ వాక్యం తరువాత to వ్రాసి రెండవ వాక్యములోని infinitive నుండి చివరి వరకు వ్రాయవలెను.
Eg: He is very follish. He can’t understand it.
He is too foolish to understand it.
మొదటి వాక్యములోని subject, రెండవ వాక్యములోని subject వేరు వేరుగా వుంటే, మొదటి వాక్యము పూర్తి అయినతరువాత that కు ముందు for మరియు ఆ రెండవ వాక్యములోని subject యొక్క object ను వ్రాసి మిగిలిన భాగాన్ని కలిపి వ్రాయాలి.
Eg: The tea is very hot. I can’t drink it.
The tea is too hot for me to drink it.
మిత్రులారా.. గ్రామర్ అంటే మరేమీ కాదు.వాక్యము అర్ధ వంతము గా నీవు వ్రాయగలిగితే నీకు గ్రామరు
వచ్చినట్లే. ఇక్కడ చూడండి. for me అని వ్రాయకపోతే ఏమి అవుతుంది? టీ తాగలేనంత వేడిగా వున్నది
అని. అవునా. మరి కొంతమంది వేడి పట్టలేని వారు వుంటారు. నేను పట్టలేక పోవచ్చు. నీవు ఆ వేడి త్రాగ
గలవేమో కదా. అందుకే మొదటి వాక్యము లో I can’t dirnk it. అని వున్నది. మరి రెండు వాక్యాలను కలిపినప్పుడు అర్ధములో తేడా రాకూడదు కాబట్టి టీ నేను తాగలేనంత వేడిగా వున్నది “ అని వ్రాయవలసి వచ్చింది. అలా మీరు అవగాహన చేసుకుంటూ నేర్చుకుంటే గ్రామర్ కష్టం కాదు ఇష్టం అవుతుంది.
మరి రేపు కలుద్దాం.ఆశీస్సులు-
0 comments:
Post a Comment