ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Friday, April 27, 2012

Bangle Sellers Poem by Sarojini Naidu-Sung By Smt.Abigail

***Sung By Smt.Abigail,  Z.P.High School,Pedapalakaluru, Guntur District (A.P)***{For S.S.C (TM) Students}

Bangle sellers are we who bear

Our shining loads to the temple fair...

Who will buy these delicate, bright

Rainbow-tinted circles of light?

Lustrous tokens of radiant lives,

For happy daughters and happy wives.

Some are meet for a maiden's wrist,

Silver and blue as the mountain mist,

Some are flushed like the buds that dream

On the tranquil brow of a woodland stream,

Some are aglow wth the bloom that cleaves

To the limpid glory of new born leaves

Some are like fields of sunlit corn,

Meet for a bride on her bridal morn,

Some, like the flame of her marriage fire,

Or, rich with the hue of her heart's desire,

Tinkling, luminous, tender, and clear,

Like her bridal laughter and bridal tear.

Some are purple and gold flecked grey

For she who has journeyed through life midway,

Whose hands have cherished, whose love has blest

And cradled fair sons on her faithful breast,

And serves her household in fruitful pride,

And worships the gods at her husband's side.

మేము గాజులు అమ్మే వాళ్ళం!
మెరిసే మా గాజులను తిరునాళ్ళకు తీసుకుని వెళ్ళి అమ్ముతుంటాము.
సున్నితంగా, ప్రకాశవంతంగా, ఇంద్రధనుస్సును అద్దిన
ఈ కాంతి వలయాలను (గాజులను) ఎవరు కొంటారు?
ఇవి ఆనందంగా గడిపే కూతుళ్ళు,భార్యల(ముత్తైదువుల) సంతోషకరమైన
జీవితాలకు ప్రకాశవంతమైన గుర్తులు.

వీటిలో కొన్ని పెళ్లికాని యువతులకు సరిపోతాయి.
నీలమూ, వెండి రంగు కలిసిన పర్వతపుపైని నీలిమేఘాలలా,
కొన్ని అడవులలోని చిన్ని చిన్ని ప్రవాహాల ప్రకాశవంతమైన అంచుల్లో కలలుగనే మొగ్గలలా
ఎరుపెక్కినవి కొన్ని, నునులేత చిగుళ్ళ పారదర్శకమైన అందాన్ని 
ఆంటీ పెట్టుకున్న పువ్వుల శోభ కలిగినవి కొన్ని.

కొన్ని సూర్యకాంతికి మెరిసే పైరు రంగు కలవి 
పెళ్లిరోజు వధువుకి సరిపోతాయి.
కొన్ని ఆమె పెళ్లి నాటి అగ్ని కాంతిలా 
లేదా ఆమె హృదయపు కోరికలలా రంగులు నిండి వుంటాయి.
గలగలలతో, ప్రకాశిస్తూ, నాజూకుగా, స్పష్టంగా
పడతి వివాహసమయపు నవ్వులా, అప్పగింతలప్పటి ఏడుపులా మరికొన్ని వుంటాయి.

కొన్ని ముదురు కెంపు రంగులో బంగారు రంగు అద్దిన బూడిద వర్ణం లోనివి.
ఇవి పిల్లల్ని ప్రేమించే తల్లికి, భర్తకు గర్వాన్ని కలుగజేసే గృహిణికి,
భర్త క్షేమం కోసం భగవంతుడిని పూజించే మధ్య వయస్సు గృహిణికి సరిపోతాయి.

0 comments:

Post a Comment

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates