ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Saturday, April 9, 2011

GENDER- స్త్రీ -పురుష భేదము


SITA,SHE,GIRL,COW- - - - - - - - ->Feminine Gender (స్త్రీ లింగం) 

RAVI,HE,BOY,BULL- - - - - - -- - ->Masculine Gender (పుంలింగం)

BOOK,TABLE,RIVER,TREE- - - > Neuter Gender (నపుంసక లింగం) 

     Child,Person, Servant,Student,Teacher,People ఇవి స్త్రీ పురుషులిద్దరికీ సంభంధించే మాటలు.ఇవి స్త్రీ ఐనా కావచ్చు,పురుషుడైనా కావచ్చు.వీటిని common gender అంటారు. I,WE,THEY కూడా COMMON GENDER.

    ఇంగ్లీష్ లో వీటిని మూడు రకాలుగా గమనించ వచ్చు.

                1) రెంటికి సంభంధం లేనివి
                               boy-girl
                               son-daughter
                               father-mother
                               bull-cow
                               cock-hen
                               husband-wife
                               king-queen
                               brother-sister

                2) పుంలింగం మాటకి ess చేరి. . చేరి స్త్రీ లింగం మాట ఏర్పడుతుంది.

                               lion-lioness
                               poet-poetess
                               god-godess
                               
                3) స్త్రీ- పురుష భేదాలను తెలిపే మాటలు అదనంగా చేరడం ద్వారా ఆతేడా
                    ఏర్పడుతుంది.

                                he goat-she goat
                                cock sparrow-hen sparrow
                                land lord-land lady
                                male servant-maid servant 
        
         (మరింత విశ్లేషణ కోసం 'రంగనాయకమ్మ గారి' ఇంగ్లిష్ గ్రామర్ బుక్ చదవండి)

0 comments:

Post a Comment

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates