ముందుమాట
భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్
మిత్రమా.... "The First Lesson" లో ప్రశ్నించడం ముందు నేర్చుకోమని చెప్పడం జరిగింది. ఆ నేపధ్యంలో How కి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆపై మిగతా interrogaative words అయిన when, where. which మొదలగు పదాలతో ప్రశ్నించడం చూడాలి. కానీ అలా వరుసగా ఇస్తూ పోతే మీకు బోర్ కొట్టే ప్రమాదం వుంది. అంతేకాకుండా అవన్నీ బయట దొరికే spoken English books లో చాలా దొరుకుతాయి. information సమీకరించుకోవడం కోసం మీరు ఎన్ని పుస్తకాలైనా చదవవచ్చు. దేనినీ తక్కువగా చూడలేము. వెంకటేశ్వరరావు గారు (చెన్నై) వ్రాసిన KVR బుక్స్ కూడా బాగుంటాయి. అలాటి ప్రశ్నలు వాటిలో 1000 దాకావున్నాయి. వాటిని మరోసారి చూద్దాము.
ప్రస్తుత lesson లో పై table లో ఒక verb ని తీసుకుని I అనే subject తో 12 వాక్యాలు వ్రాయడం జరిగింది. ఆ table క్రింద draw, eat, drink, hide, అనే మరో 4 verbs వాటి conjugation ఇవ్వడం జరిగింది. వీటితో మీరు 4x12=48 వాక్యాలు వ్రాసి నాకు మైల్ చేయండి. లేదా కామెంట్ గా పెట్టండి. tense పట్ల అవగాహన కలగడానికి ఇది ఎంతో దోహదకారి అవుతుంది. ఈ tables ని నేను మా దత్తు సార్ గారి దగ్గర practice చేశాను. మరి మీరు కూడా చేస్తారుగా. రేపు మరో 5 verbs ఇస్తాను. మీరు వాటిని We సబ్జెక్టు గా వ్రాయవలసి వుంటుంది. ఇలా 7 subjects తో 35 verbs కి 35x12=420 వాక్యాలు వస్తాయి. టెన్స్ పట్ల అవగాహన ఖచ్చితంగా వస్తుంది. ఆపై మీరు ఓరల్ ప్రాక్టీస్ చేస్తే మాటలాడటం వస్తుంది. దీనికి ముందు ఇదే బ్లాగులో వున్న Tense chapter చూడండి. దానిలో ప్రాధమిక అంశాలు, టెన్స్ కి సంభందించిన నియమాలు వుంటాయి. రేపు మరలా కలుద్దాము. నమస్తే
Popular Posts
-
ENGLISH SENTENCES వాక్యములు ప్రధానంగా నాలుగు రకాలని చెప్పవచ్చు. 1)ASSERTIVE--------------...
-
ORDER OF WORDS తెలుగులో కర్త-కర్మ-క్రియ వరుసగా వస్తాయి......S+O+V ఇంగ్లీష్ లో కర్త-క్రియ-కర్మ వరుసగా వస్తాయి......S+V+O రాముడు రావణున...
-
మనం మన భావాలను Active Voice లో చెప్పాలా/Passive Voice లో చెప్పాలా/ మీకు AV వచ్చు ..అలాగే PV వచ్చు... మీరు ఎందులో చెప్పినా తప్ప...
-
THE HOUND OF THE BASKERVILLES SUPPLEMENTARY READER-1 - S.S.C - ENGLISH (EM) (ఈ పోస్ట్ HTML కోడ్ లో ఉన్నందున ఇక్కడ pri...
-
మిత్రులారా... మాటలాడే సమయంలో తప్పులు దొర్లుతాయేమో అనే భావన మరిన్ని తప్పులు చేయడానికి కారణము అవుతుంది తప్ప దానివల్ల వేరే ప్రయోజనం లేదు.ఈ రోజ...
-
***Sung By Smt.Abigail, Z.P.High School,Pedapalakaluru, Guntur District (A.P)***{For S.S.C (TM) Students} Bangle sel...
-
10 వ తరగతి విద్యార్థులకు సూచనలు. 26-3-12 ప్రారంభమయ్యే 10 వ తరగతి విద్యార్ధుల కోసం. ప్రతి రోజు రాత్రిపూట 10 గంటల దాక చదవండి. తెల్లవారు ఝ...
-
కొంతమంది మిత్రులు మెయిల్ పంపారు. ఏమనంటే -" సర్ ఈరోజే మీ బ్లాగ్ చూడటం జరిగింది. కానీ అందులో lessons చాలానే ఉన్నట్లుగా ఉన్న...
-
-
0 comments:
Post a Comment