ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Sunday, August 24, 2014

Tense(Practice)


(1) It rained heavily while they ------------ home
A.     Are returning B. Returning C. Were returning D. Returned                      Ans: C


ఒక సమయంలో ఒక పని జరుగుతున్నప్పుడు ఒక పని జరిగింది అని చెప్పేటప్పుడు జరిగిన పనిని simple past లో ఆ time లో జరుగుతూవున్న పనిని past continuous లో వ్రాయాలి.  .ఇలా simple past- past continuous కాంబినేషన్ని Exams లో ఇస్తాడని  అని చెప్పాలి.
Clues: (when, while, the moment, as, before వాక్యంలో ఈ పదాలు ఉన్నప్పుడు మీరు ఇలా ఆలోచించండి)
Examples:
  • When he came home, she was cooking
  • I found this letter, while I was cooking
  • He came, when I was listening to the radio
  • The old man met with an accident, as he was walking
  • They were quarreling, the moment their father came 
2) When the doctor touched the patient, he ----------
    A     Had already died B. Already died C. Already dead D has already did 
                               Ans: A
    గతంలో అనగా గడచిన కాలంలో రెండు పనులు జరిగినప్పుడు మొదట జరిగిన పనిని Past perfect లోనూ, తరువాత జరిగిని పనిని simple past లోనూ వ్రాయాలి.  ఇక్కడ డాక్టర్ టచ్ చేయడమనేది తరువాత జరిగినపని. so ఇది simple past లో ఉన్నది. ముందు జరిగిన పని చనిపోవడం కాబట్టి దానిని మనం past perfect లో వ్రాయాలి. కనుక జవాబు .... had already died.
Clues: ( before, after, already when)
Examples:
  •    After Raju had left, I reached his house.
  •    I went to his house after he had already gone out.
  •    He reached the cinema after the film had started
  •    When he reached the railway station, the train had already left.
(3)  ----------- he attend classes last week?
        A. has    B. Did   C. Wasn’t    D. Had 
                   ANS:   B
ఇది  ఒక Interrogative Sentence ... ఇది Simple past లో వున్నది. అసలు దీనికి Assertive Sentence ఏమిటో చూద్దాము. He attended classes last week.  simple past లో ప్రశ్నా వాక్యం ఇలా ఏర్పడుతుంది.. Did(Helping Verb) + subject+ V1+object... So.... Did he attend classes last week?
(సశేషం)




0 comments:

Post a Comment

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates