TENSE
ఒక పని
జరిగిందా,జరుగుచున్నదా, జరగబోవుచున్నదా లేక ఏ పరిస్తితిలో వున్నది తెలియ జేయు verb
యొక్క రూపాన్ని TENSE అంటారు. Tense అనే పదము లాటిన్ లోని tempus(time) నుండి
పుట్టినది.
ఇంగ్లిష్ లో ముఖ్యముగా 3
Tenses వున్నాయి.
v (1) Present Tense (2) Past Tense (3) Future
Tense మరియు ప్రతి ఒకటి కూడా నాలుగేసి రూపాలను కలిగి ఉన్నది... i) Simple ( or
Indefinite)...... ii) Continuous (or Progressive)......... iii)
Perfect...... ...iv)Perfect
Continuous
v Wrote అనే verb ను ఉదాహరణగా తీసుకొని Voice ని
కూడా ఉదహరిస్తూ పట్టికలో వివరించడం జరిగింది. పట్టిక కోసం ------పేజీ ని చూడండి.
Tense ల వివిధ రూపాలు, ఉపయోగాలు
PRESENT TENSEJ
i)Simple Present: (a)
అలవాటుగా చేయు పనులు లేదా తిరిగి తిరిగి చేయు పనులను తెలియజేయడానికి
Ex: He never wastes his time, I go for a walk every morning,
She wears Khadi sarees
(b) సామాన్య సత్యాలు,నిత్య సత్యాలు, సామెతలు
చెప్పడానికి
Ex: The Sun rises in the East, All that glitters is
not gold, Every river flows into the sea
(c) ఒక పరిస్తితిని,
నమ్మికను తెలియజేయడానికి.
Ex: India is the largest democratic
state in the world, We believe in democracy
(d) ఒక
నిర్ణీత పధకము ప్రకారము సమీప భవిష్యత్తులో జరగబోవు పనులకు
Ex: We go to the
cinema tonight, The bus arrives at ten O’clock, When does she come?
ii)
Present Continuous Tense: (a) ఖచ్చితముగా మనము మాటలాడుతూ ఉన్న,లేదా
వ్రాస్తూవున్న సమయములో
జరుగుతూ ఉన్న పనులను తెలియ
జేయడానికి
Ex: It is getting
dark now, I am giving you a lesson in grammar, You are reading this example.
(b) సమీప భవిష్యత్తులో
జరగబోవు పనులను తెలియ జేయడానికి
Ex: I am visiting
the exhibition tonight, He is arriving here tomorrow
iii)
Present Perfect Tense: (a) ఇప్పుడే అంటే మనం మాటలాడుతున్న సమయానికి
ముందే పూర్తి ఐన పనులను
తెలియజేయడానికి, Ex: He has just
gone out, He has given me the book now.
iv) Present Perfect Continuous Tense: గతంలో ఎప్పుడో ప్రారంభమై,ఇంకా
కొనసాగుతూవున్న పనులకు
Ex: She has been
waiting for the bus for two hours,He has been working here since 1990
PAST TENSEJ
(i)simple
past: గతంలో జరిగిన ఒక పనిని తెలియ జేయడానికి- సాధారణంగా ఇది
గతకాలాన్ని,సూచించే adverbs,
adverb phrases తో ఉపయోగించ
బడుతుంది...... Ex: I saw him yesterday, I learnt Tamil in Tirupati.
(ii)Past
Continuous: గతంలో ఒకానొక సమయంలో జరుగుతూ వున్న పనిని
తెలియజేయడానికి ఉపయోగపడుతుంది.
Ex: We were
watching the TV all evening yesterday,… The wind was rising then.
(iii)Past
perfect Tense: గతంలో ఒకదాని వెంట ఒకటిగా జరిగిన రెండు పనులను
తెలియజేయునప్పుడు ముందుగా
జరిగిన పనిని సూచించడానికి దీనిని
ఉపయోగిస్తాము. తరువాత జరిగిన పనిని Simple Past లో తెలుపుతాము.
Ex: When I had finished my work, I went home,* I had written the letter before he arrived
(iv)Past
Perfect Continuous Tense: గతంలో
ఒకానొక సమయానికి ముందే ఎప్పుడో ఒక పని ప్రారంభమై ఆ సమయం
వరకు ఇంకా జరుగుతూనే వుంది అని
చెప్పడానికి ..అలాగే గతంలో ఒక పని జరిగిన సమయానికి ముందే మరొక పని పని ప్రారంభమై అంతవరకూ కొనసాగుతూ వుంది అని
చెప్పడానికి కూడా ఈ Tense ఉపయోగిస్తుంది.
Ex: At 8 O’clock last night I had been reading for 2 hours
When I saw him, he had been waiting for
his friend over half an hour.
FUTURE TENSEJ
(i)
Simple Future: భవిష్యత్తులో జరగబోవు పనులను,భవిష్యత్తు గురించి ఊహలు, సందేహాలు వ్యక్తం
చేయడానికి దీనికి ఉపయోగిస్తాము. Ex: I shall see you tomorrow, He will be
thirty next year, Perhaps she will come
(ii)
Future Continuous: ఎలాంటి ముందు నిర్ణయం, పధకం లేకుండానే భవిష్యత్తులో
ఒకానొక సమయానికి ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఈ Tense ఉపయోగ పడుతుంది..దీనికీ
Present Continuous కీ కొంత పోలిక ఉన్నప్పటికి భేదం కూడా ఉన్నది..........I am
seeing Mohan tomorrow అన్నప్పుడు మాట్లాడే వ్యక్తి, మోహన్ మరునాడు
కలిసేందుకు ముందుగానే ఏర్పాటు చేసుకున్నారన్నమాట.
I shall be seeing Mohan tomorrow అన్నప్పుడు వీరి సమావేశానికి ముందు నిర్ణయం
ఏర్పాటు ఏదీ లేదు.
(iii)
Future Perfect: భవిష్యత్తులో ఒకానొక సమయానికి ముందు ఒక పని
పూర్తి అయివుంటుంది అని చెప్పడానికి
( Furure Time కి ముందు By అనే Preposition సాధారణంగా
వస్తుంది) Ex: I shall have
completed my work by the end of next week., He will have been six years at the
school by next summer
(iv)
Future Perfect Continuous: భవిష్యత్తులో ఒక చెప్పబడిన సమయానికి లేదా ఒక పని
ప్రారంభం కావడానికి కొంతకాలం ముందే వేరొక పని ప్రారంభమై అంతవరకు కూడా జరుగుతూనే
ఉంటుంది అని చెప్పడానికి ఉపయోగపడుతుంది.........Ex.. By next July we shall
have been living here for four years.
0 comments:
Post a Comment