ముందుమాట
భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్
డియర్ స్టూడెంట్స్,
- శుభాకాంక్షలనేవి ఆనవాయితాగా చెప్పేవి కాకూడదు. నిండైన మనసుతో … మీ భావి జీవనం స్వర్గ తుల్యం కావాలని మనసా ఆకాంక్షిస్తూ,ఆశీర్వదిస్తూ 5 మంచి మాటలతో ఈ నూతన సంవత్సరాన నా శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియ జేస్తున్నాను
- మోయలేని భారాన్ని నవమాసాలు మోసి,అలవిమాలిన బాధను భరించి మనకు జన్మనిచ్చిన ఆ తల్లి మనసును ఎప్పుడూ కష్టపెట్టకండి.(కష్టపడి చదవడం ద్వారానే అది నీకు సాధ్యం)
-
- తన రక్తాన్ని రంగరించి, కండల్ని కరగించి నిరంతరం శ్రమించి తన బిడ్డలు మానవులలో మాన్యులై అసామాన్యులై వెలుగొందాలన్న పిచ్చిప్రేమతో మీకోసం ఎన్నెన్నో వేదనలను భరించే ఆ తండ్రి మనసును గాయపర్చకండి. (ఆకాశమే హద్దుగా వున్న నేటి అవకాశాలను అందిపుచ్చుకొని మీకంటూ ఓ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ద్వారానే ( JOB తెచ్చుకోవడం ద్వారా) ఇది సాధ్యం.
-
- మీపట్ల వాత్సల్యాన్ని అణువణువునా నింపుకొని మీకు విధ్యాబుద్దులు నేర్పే మీ ఉపాధ్యాయులను, సర్వదా మీ మంచికోరే మీ ఆప్తులను,నేస్తాలను, మీరు జన్మించిన ఈ జన్మభూమిని ఏనాటికి మరువకండి.
-
- ఎవరినుండి మీరు ఎంత చిన్న మేలు అందుకున్నా వారికి కృతజ్ఞతలు తెలియ జేయండి. మీకారణంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా క్షమాపణలు చెప్పడం మీ జీవన గమనంలో అలవాటుగా మార్చుకోండి.
-
- ప్రతి చిన్న బాధకూ, అతి చిన్న అపజయానికి గుండెలు పిండిచేసే బాధకు గురికాకుండా “టేకిట్ ఈజీ పాలసీ” ని అలవర్చుకొని నవ్వుతూ,నవ్విస్తూ జీవిత నందన వనంలోని ప్రతి అడుగులో నవ్వులు పండిస్తూ ముందుకు సాగి పొండి. సదా మీ క్షేమాన్ని అభివృద్దిని ఆకాంక్షిస్తూ, మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఇట్లు,
మీ ప్రతాప్ మాస్టర్
Popular Posts
-
ENGLISH SENTENCES వాక్యములు ప్రధానంగా నాలుగు రకాలని చెప్పవచ్చు. 1)ASSERTIVE--------------...
-
ఈరోజు మనము classroom నిర్వహణ గురించి తెలుసుకుందాం .
-
మనం మన భావాలను Active Voice లో చెప్పాలా/Passive Voice లో చెప్పాలా/ మీకు AV వచ్చు ..అలాగే PV వచ్చు... మీరు ఎందులో చెప్పినా తప్ప...
-
PARTS OF SPEECH The words which we use are divided into various classes according to their...
-
ORDER OF WORDS తెలుగులో కర్త-కర్మ-క్రియ వరుసగా వస్తాయి......S+O+V ఇంగ్లీష్ లో కర్త-క్రియ-కర్మ వరుసగా వస్తాయి......S+V+O రాముడు రావణున...
-
మిత్రులారా... మాటలాడే సమయంలో తప్పులు దొర్లుతాయేమో అనే భావన మరిన్ని తప్పులు చేయడానికి కారణము అవుతుంది తప్ప దానివల్ల వేరే ప్రయోజనం లేదు.ఈ రోజ...
-
THE HOUND OF THE BASKERVILLES SUPPLEMENTARY READER-1 - S.S.C - ENGLISH (EM) (ఈ పోస్ట్ HTML కోడ్ లో ఉన్నందున ఇక్కడ pri...
-
కొంతమంది మిత్రులు మెయిల్ పంపారు. ఏమనంటే -" సర్ ఈరోజే మీ బ్లాగ్ చూడటం జరిగింది. కానీ అందులో lessons చాలానే ఉన్నట్లుగా ఉన్న...
-
***Sung By Smt.Abigail, Z.P.High School,Pedapalakaluru, Guntur District (A.P)***{For S.S.C (TM) Students} Bangle sel...
-
0 comments:
Post a Comment