ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Friday, January 4, 2013

DIFFERENT FORMS OF A TENSE(80 Sentences)

   ఒక tense లో చెప్పబడిన ప్రతివాక్యానికి Passive Voice ఉంటే 8 రూపాలుంటాయి. లేనట్లైతే 4 రూపాలుంటాయి.
  1. A.V. POSITIVE
  2. A.V. NEGATIVE
  3. A.V. INTERROGATIVE
  4. A.V. NEGATIVE INTERROGATIVE
  5. P.V. POSITIVE
  6. P.V. NEGATIVE
  7. P.V. INTERROGATIVE
  8. P.V. NEGATIVE INTERROGATIVE
  • Simple Present Tense            = 8
  • Present Continuous               = 8
  • present perfect                     =  8
  • Present Perfect Continuous   = 4 (there is no PV)
  • Simple Past                          = 8
  • Past Continuous                   = 8
  • Past Perfect                         = 8
  • Past Perfect Continuous       = 4 (No PV)
  • Simple Future                       = 8
  • Future Continuous                = 4 (No PV)
  • Future Perfect                      = 8
  • Future Perfect Continuous    = 4 (No PV)
         TOTAL  ............................    80 Sentence
ఇలా మనము ఒక verb తీసుకుని దానితో 80 రకాల వాక్య నిర్మాణము చేయగలిగితే మనకు 75 శాతము ఇంగ్లిష్ వచ్చినట్లే ..advise అనే verb తీసుకుని నేను ఒక Exel ఫైల్ తయారుచేశాను. దాని డౌన్లోడ్ లింక్ ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని print తీసుకుని పెద్దగా చదవడం ప్రాక్టీసు చేయండి.

పట్టిక గురించి 2 మాటలు  

  1. AV= ACTIVE VOICE
  2. PV= PASSIVE VOICE
  3. M  = MODE
  4. A = ASSERTIVE SENTENCE
  5. N = NEGATIVE
  6. I = INTERROGATIVE
  7. NI = NEGATIVE INTERROGATIVE
అలాగే ..I speak english అనే Active voice ని English is spoken by me అని నేను మార్చలేదు. ఇక్కడ అర్ధం విభేదించదు. నిజ జీవితం లో ఎవరూ AV ఇచ్చి PV కి మార్చమని అనరు. అవసరాన్ని బట్టి దేనికదే ప్రత్యేకం గా  మాటలాడతారు. ఉదాహరణకు I advise అంటే నేను సలహా ఇస్తాను.. ఇది active voice...  I am advised అంటే నాకు సలహా ఇస్తారు.. ఇది passive voice.. ఇక్కడ అర్ధం విభేదించింది కదా. కనుక  I advise కి ఇది passive కాదు. దేనికదే ప్రత్యేకం. spoken english point of view లో మనకు పనికొచ్చేది ఇదే. మరి గమనిస్తారుగా...

మరింత వివరం కోసం  , డౌన్లోడ్ లింక్ కోసం READ MORE  ని క్లిక్ చేయండి. లేదా మన మరో బ్లాగు
http://englishmadeeasy.webnode.com//  లో  Lesson 8 చూడండి.                          

0 comments:

Post a Comment

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates