ఈరోజు ఒక నమూనా (వీటినే Stentence Patterns లేదా Structures అంటారు.) ద్వారా ఇంగ్లిష్ ఎలా నేర్చుకోవచ్చో చూద్దాం.
Structure: This/These/That/Those+Be+Noun
ఇలా structures ద్వారా ఇంగ్లిష్ నేర్చుకోవడం ఒక పద్దతి. ఇవి షుమారుగా 275 వున్నాయి. కాకపోతే ఈ Pattern లో 10 వాక్యాలు వ్రాసుకుని కంఠస్థం చేసినంత మాత్రాన ఇంగ్లిష్ రాకపోవచ్చు. అలాగని గ్రామర్ మొత్తం ముందుగా నేర్చుకుని ఆ పై ఇలాంటి structures పై ఆధార పడదామంటే అదీ సరైన పద్దతి కాదేమో.. ఎందుకంటే అకడమిక్ గా ఇంగ్లిష్ లో 90 శాతం మార్కులు వచ్చినవారు.. ఎం. ..ఏ లు, ఎం.కామ్.లు పాసైన వారు కూడా (నేను కూడా)ఇంగ్లీష్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు.so గ్రామర్ వచ్చినంత మాత్రాన ఇంగ్లిష్ రాదు. కాకపోతే ఎంత అవసరమో అంతవరకు గ్రామర్ నేర్చుకోవాలే తప్ప కేవలం దానికోసమే సమయం వెచ్చించ కూడదు. అసలు spoken english వేరు written english వేరు .. మన విద్యావిధానం written english కే ఎక్కువ importance ఇస్తున్నట్లుంటుంది. ఇది కధలు,కావ్యాలు వ్రాయడానికి ఉపయోగపడుతుందే గాని మాటలడటానికి కాదు(ఇది నా అభిప్రాయం మాత్రమే) మాటలాడటం అనేది మాటలాడితేనే వస్తుందనేది నా అనుభవం. సరే అసలు విషయానికి వద్దాం. పై structure చూద్దాం. దానిప్రకారం కొన్ని వాక్యాలు చూద్దాం.
This + is + a pen
That + is + an umbrella
These + are + pens
Those + are + pens
ఇప్పుడు మనము (అసలు ఇప్పటి వరకు మనకు గ్రామర్ ఏమీ రాదనుకుందాం) ఈ ఒక్క structure కి సంబంధించినతవరకు మాత్రమే గ్రామర్ నేర్చుకుంటామ్. మరో structure లేదా మరో వాక్య నిర్మాణంలో మొదటి structure పరంగా నేర్చుకున్న గ్రామర్ కాక అదనంగా ఒకటి,రెండు అంశాలకు సంభంధించిన గ్రామర్ మాత్రమే తెలుసుకోవలసి వస్తుంది. ఇలా మనము చిన్న చిన్న గా .. practical గా అవసరమైనంత మాత్రమే నేర్చుకుంటూ , నేర్చుకున్న దానిని ఉపయోగించడం ద్వారా మనసులో నిక్షిప్తం చేసుకుంటూ ముందుకు వెళదాం.
మిగిలిన పార్ట్ కోసం 'Read More' క్లిక్ చేయండి. లేదా మన మరో బ్లాగ్
http://englishmadeeasy.webnode.com/lesson-07/ లోనికి ప్రవేశించండి . నమస్తే
http://englishmadeeasy.webnode.com/lesson-07/ లోనికి ప్రవేశించండి . నమస్తే
0 comments:
Post a Comment