ఈ బ్లాగు సినిమా సంబంధమైనది కాకున్నా ప్రస్తావిస్తున్నందుకు క్షంతవ్యుడను. మిమ్మల్ని ఒక్కమారు అడుగుతున్నా .. ఒక్కసారి ఈ సినిమా చూడమని.
"కొబ్బరి చెట్టు నీడ, ఆరుబయటి భోజనం, కళకళ లాడే లోగిలి, అమ్మ కమ్మదనం, కులమతాలు లేని ఆత్మీయ వరుస పలకరింపులు" ఈ అద్భుతమైన అనుభూతుల్ని మరలా గుర్తు చేసి ఆద్యంతం నా కళ్ళు చెమ్మగిలేలా చేసిన సినిమా " ఓనమాలు". మీరూ ఒక్కసారి చూసి మీ,మీ జ్ఞాపకాల్ని ఏరుకోండి.
చెడుని ఖండించక పోవడం ఎంత తప్పో మంచిని ప్రోత్సహించక పోవడం అంతే తప్పు. మీరందరూ చూసి ఓ మంచి సినిమాని ఆదరించండి. పిల్లలూ బాగున్నారా అనే పాటలో 'పల్లె' బాధని కవి ఎంత చక్కగా వివరించారో వినండి. నిజంగా నేను కవిని అయితే ఈ సినిమాగురించి గొప్పగా వ్రాసి వుండేవాడిని. కానీ ఆ భావ జ్ఞానం లేక ఆ సినిమా మొత్తం యూనిట్ ని అభినందిస్తూ ముగిస్తున్నా. మీ ప్రతాప్. నమస్తే

0 comments:
Post a Comment