Students వీటిని కంఠస్థం చేయడం ద్వారా Examinations లో Story Writing పార్ట్ లో Morals క్రింద Use చేసుకోవచ్చు.Spoken English Point Of View లో వీటిని ఉపయోగించడం ద్వారా భాషలో సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
- A cold hand and a warm heart..మనసు మాత్రం వెన్న..పెట్టు పోతలు మాత్రం సున్న
- A father loves his children in hating their faults... తండ్రి పిల్లల దోషాల్ని ఏవగించుకోవడం ద్వారానే వాళ్ళని ప్రేమిస్త్రాడు.
- A friend in need is a friend indeed...ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు.
- A good deed is never lost...మంచి పని ఎన్నటికీ మరుగున పడదు.
- Look before you leap...దూకడానికి ముందే లోతు తెలుసుకో
- Cowards die many times before their death..పిరికివాళ్ళు తాము చావడానికి ముందే చాలా సారులు ఛస్తారు.
- Eat to live not live to eat..తినడానికి బ్రతకవద్దు, బ్రతకడానికి తిను
- A friend without faults will never be found..ఏ లోపం లేని మిత్రుడు ఎక్కడా వుండడు
- A good example is the best sermon...పది నీతులు కంటే ఒక చేత మేలు.
- A good beginning is half the work...నవ్వుతూ మొదలైతే సగం పని అయినట్లే
- Failures are stepping stones to success..అపజయాలు విజయానికి సోపానాలు
- A living dog is better than a dead lion..దొరకని గొప్ప అవకాశం కంటే దొరికిన చిన్న అవకాశం మేలు
- No pains no gains...శ్రమ లేనిదే ఫలితము లేదు
- Experience is a great teacher..అనుభవం గొప్ప అధ్యాపకుడు
- Practice makes a man perfect...అభ్యాసము మనిషిని పరిపూర్ణుడిని చేస్తుంది.
- Speech is Silver, Silence is Gold...అతి గా మాటలాడటం కంటే మితం గా మాటలాడటం మేలు
- Where there is a will there is a way..మనసుంటే మార్గం వుంటుంది.
- All that glitters is not gold..మెరిసేదంతా బంగారం కాదు.
- An idle brain is the devil's workshop..సోమరిగా వుండే వాడి మెదడు దయ్యాల ఇల్లు లాంటిది.
- Life is not bed of roses...జీవితం పూల పాన్పు కాదు.
- Prevention is better than cure...వైధ్యం కంటే అసలు వ్యాధి రాకుండా చూసుకోవడం మేలు
- Pen is mightier than the sword..కలము, కత్తి కన్నా గొప్పది.
- Envy is the admission of inferiority..అసూయ పడటం చేతకాని తనానికి చిహ్నం
- Bad news travels fast..చెడు వార్తా త్వరగా వ్యాపిస్తుంది.
- God could not be every where, therefore he made mothers... దేవుడు అన్నిచోట్లా వుండలేడు. కనుక తల్లుల్ని సృష్టించాడు.
1 comments:
Follower గా join అయిన కిరణ్ ఇండియన్ గారికి కృతజ్ఞతలు
Post a Comment