మనము మాటలాడటం ప్రారంభిస్తే నా గురించి (I) లేదా మనగురించి (WE) అతనికి (He) లేదా ఆమెకు (She) చెబుతాం. అంతేనా చిన్న చిన్న వస్తువులు, ప్రాణులు (It) గురించి వారితో (That) చర్చిస్తాము. లేకుంటే నీ గురించి (You), మీ గురించి (You) ప్రశ్నలు అడుగుతాం. లేదా కిరణ్, సీత మొదలగు వారిగురించి గుసగుసలాడతాం. అంటే ప్రపంచంలో ఎవరు మాట్లాడినా ఈ 7 లేదా 8 subjects గురించే కదా. కనుక ఈ Subjects తో చిన్న చిన్న వాక్యాలు తయారుచేసి వాటిని ఇంటిలో, లేదా friends తో ఉపయోగంలో పెడదాం. చదివి వదిలేస్తే ఉపయోగం లేదు. వాటిని మనము నిత్య జీవితంలో ఉపయోగించాలి
Main Subjects:
I..........................................నేను
WE......................................మేము,మనము
YOU....................................నీవు
YOU....................................మీరు
HE.......................................అతడు
SHE.....................................ఆమె
IT.........................................అది/ఇది
THEY..................................వారు
RAMA.................................రాముడు
KRISHNA...........................కృష్ణుడు
SITA....................................సీత
I AM A DOCTOR
WE ARE DOCTORS
YOU ARE A DOCTOR
YOU ARE DOCTORS
HE IS A DOCTOR
SHE IS A DOCTOR
IT IS A TABLE
IT IS AN ANT
THEY ARE DOCTORS
RAMA IS A DOCTOR
KRISHNA IS AN ENGINEER
SITA IS A NURSE
ఇవన్నీ సాధారణ విషయాలు గనుక simple present లో వ్రాయబడ్డాయి. గమనించారుగా subject singular అయితే (verb) is వస్తుంది. అదే subject plural అయితే (verb) are వస్తుంది. సబ్జెక్టు గనుక I వుంటే verb ఎప్పుడూ am వస్తుంది. అలాగే నేను ఒక డాక్టర్ ని అని తెలుగులో అనం. నేను డాక్టర్ ని అని మాత్రమే అంటాము. కానీ ఇంగ్లిష్ సాంప్రదాయంలో ఏ countable noun కి ఐనా సరే article (A. An) ఏదో ఒకటి వస్తుంది. అచ్చు శబ్దం ముందు అయితే an హల్లు శబ్దం ముందు అయితే a వస్తుంది.
ఇప్పుడు వివిధ రకాల professions, occupations ని ఇంగ్లిష్ లో తెలిసికొని వాటిని పై వాక్యాలలో మార్చి, మార్చి ఉపయోగించి ముగ్గురు friends కూర్చుని action తో సహా మాటలాడండి. ఇక్కడ body language ఎంతో ముఖ్యం.
0 comments:
Post a Comment