ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Saturday, August 10, 2013

SPOKEN ENGLISH పుస్తక రూపంలో

SPOKEN ENGLISH ఇప్పుడు పుస్తకరూపంలో

నమస్కారములు
ఇంగ్లిష్ ఒక subject గా మనము ఎన్నో సంవత్సరాలుగా చదువుతున్నాము. అంతేనా.. మిగిలిన subjects కూడా ఇంగ్లిష్ లోనే చదువుతున్నాము. కానీ ఇంగ్లిష్ మాటలాడటం ఒక సమస్య గానే ఫీల్ అవుతున్నాము. కారణం ఏమిటి. దీనికి నాకు తెలిసిన పరిష్కారం 2 సంవత్సరాలుగా నా బ్లాగులలో వివరిస్తూనే ఉన్నాను. అది పుస్తక రూపంలో వుంటే బాగుంటుందని మిత్రులు సూచిస్తున్నారు.

20 ఏళ్ల నా బోధన అనుభవాన్ని జోడించి 40 పేజీల A4 సైజ్ పుస్తకాన్ని DTP చేయించాను. ఇవన్నీ నా బ్లాగులో వివరించి నప్పటికి మరికొన్ని విషయాలను చేర్చి నాకు తెలిసినంతలో చక్కగా కూర్చాను. ఇది బజారులో దొరికే అందమైన పుస్తకాలులా మల్టీ కలర్స్ తో వుండదు. మామూలు ఫోటోస్టాట్ కాపీలతో ఉంటుంది. కానీ విషయం మాత్రం బజారు లో  దొరికే spoken english పుస్తకాలులా ఖచ్చితంగా ఉండదు. ఒకరకంగా చెప్పాలంటే ఇది మీకు ఇంగ్లిష్ నేర్పడంతో పాటుగా, ఇంగ్లిష్ మీకు ఎందుకు రావడం లేదో తెలుపడంతో పాటు అందుకు మీరు ఏమిచేయాలో తెలుపుతుంది. అసలు సమస్య ఏదో తెలిసికుంటే పరిష్కారం దానికదే దొరుకుతుంది.   

ఈ పుస్తకం ఎలా తెప్పించుకోవాలి?

మీ పూర్తి చిరునామా, ఫోన్ నెంబర్, (వీలైతే మీ email చిరునామా తో ) కార్డు వ్రాయడం గాని, లేదా మెయిల్ పంపడం గానీ, ఫోన్ చేయడం గానీ చేయాలి. అలాగే Rs 100/- MO చేయడం గాని లేక నా Bank Account కి జమ చేయడం గానీ చేయాలి. మీకు కొరియర్ లో book పంపడం జరుగు తుంది. లేదా మీ మెయిల్ కి pdf ఫార్మెట్ ఫైల్ పంపడం జరుగుతుంది. మీరు print out తీసుకుని మీరు మాత్రమే వాడుకోవాలి. ఇది పేద విధ్యార్ధులకోసం కనుక దానిని దయచేసి మరొకరికి printout ఇవ్వకూడదు. ప్లీజ్.

పేద విద్యార్ధులకు మీ సహకారం

ఈ book ద్వారా వచ్చిన మొత్తంలో కొంత శాతము పేద విద్యార్ధులకు ఖర్చుపెట్టడం జరుగుతుంది. ఇంగ్లిష్ లో మీరు మంచి గ్రిప్ సాధించడంతో పాటు పేద విద్యార్ధులకు కొంత సహాయం అందించామనే తృప్తి మీకు మిగులుతుంది.

మీరే పేద విద్యార్ధులు అయితే

మీరు 10 మంది స్నేహితులు మనిషి కి 10 రూపాయలు సేకరించి ఒక కాపీ తెప్పించుకుని వాటిని ఫోటోస్టాట్ తీసుకుని 10 మంది ఉపయోగించుకోండి.
మీరు డిగ్రీ లేదా ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్ధులైతే

మీ క్లాసు మొత్తం -  విద్యార్ధి ఒక్కింటికి వారు ఇవ్వగలిగిన మొత్తం సేకరించి  ఆ మొత్తాన్ని నాకు, MO చేయడం గాని, లేదా నా అక్కౌంట్ కి జమ చేయడం గానీ చేయండి.  మీ మిత్ర బృందం పేర్లు, మీరు పేద విద్యార్ధులకు ఎలా ఉపయోగ పడాలనుకుంటున్నారు? ( వారికి note పుస్తకాలు కొనడమా/చెప్పులు గానీ /దుస్తులు గానీ- ఇలా ) ఇత్యాది విషయాలతో మెయిల్ చేస్తే ... అవకాశం వుంటే మీరే స్వయంగా మా పాఠశాలకు వచ్చి మీ చేతుల మీదుగానే ఆ సత్కార్యం చేయవచ్చు.

మనసున్న మారాజులు/ మారాణులు

మీ బాబు/ మీ పాప పుట్టిన రోజుకు పెట్టే ఖర్చు ని మాకు పంపితే మీకు స్పోకెన్ ఇంగ్లిష్ బుక్ కాంప్లిమెంటరీ కాపీ గా పంపబడుతుంది. ఇక్కడ మీ పాప పేరుతో ఒక మంచి పనికి శ్రీకారం చుట్టబడుతుంది. మీకు అవకాశం వుంటే స్వయంగా పాల్గొనవచ్చు.

నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు మన్నించి మీ సహకారం అందిస్తారని ఆశిస్తూ.....
100 శాతము గారంటీ
పుస్తకం మీకు 100 శాతము నచ్చుతుంది. పుస్తకము మీకు సంతృప్తిని ఇవ్వకుంటే  100 శాతము Money వాపసు

MO పంపవలసిన చిరునామా

V. RAMA DEVI
W/O VENKATA PRATAP
                 (TEACHER)
5-23-32/A
JAYAPRAKASH NAGAR
TENALI- 522 201
GUNTURU DISTRICT
ANDHRA PRADESH
PHONE:  (+91) 7396090609

Email: pratapv351@gmail.com
          engpraeng@gmail.com

0 comments:

Post a Comment

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates