ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Thursday, June 6, 2013

FRAMING OF A WH-QUESTION

ప్రియ విధ్యార్ధులారా.. చాలా రోజుల తరువాత మనము ఇలా క్రొత్త lesson లో కలవడం చాలా సంతోషం.   రోజు మనము ప్రశ్నించడం గురించి తెలుసుకుందాం. సాదారణంగా మనము నిద్ర లేచింది మొదలు నిద్రించేవరకు చాలా మందిని ప్రశ్నిస్తూ వుంటాము. అలాగే ఇతరుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ వుంటాము. అంటే spoken english లో ప్రశ్నించడం వస్తే మనము చాలా వరకు success అయినట్లే.  కాకపోతే spoken english కోచింగ్ సెంటర్స్ వారు ప్రశ్నించడం నేర్పరు.. ప్రశ్నలు నేర్పుతారు. అదేనండీ.. ఇంస్టెంట్ కాఫీ లాగా ఇంస్టెంట్ questions నేర్పుతారు. అంటే కొన్ని ప్రశ్నల లిస్ట్ ఇచ్చి కంఠస్థం చేయమంటారు. ఇది ఎంతవరకు సమంజసము చెప్పండి. మనకు సందర్భాలు, ఎలా ఎదురౌతాయో, మనము ఎలాంటి ప్రశ్నలు అడగవలసి వస్తుందో, ఎలాంటి ప్రశ్నలకు సమాధాలు చెప్పవలసి వస్తుందో మనకు ఎలా తెలుస్తుంది? So కొన్ని ప్రశ్నల జాబితాను కంఠస్థం చేయడం కాదు. మనమే ప్రశ్నలను తయారుచేయడం నేర్చుకుని సందర్భాన్ని బట్టి మనమే ప్రశ్నిచడం మొదలు పెట్టాలి. ఈరోజు మనము నేర్చుకునేది ... అదే///////   కే.. మరి రెడీ గా వున్నారా!

Wh-Question .. frame చేయడానికి ఉపయోగించే పదాలు .. వాటి అర్ధాలు.  

  1. What................... ఏమిటి 
  2. What type............. రకం 
  3. What kind............. రకం 
  4. Who.....................ఎవరు 
  5. When.................. ఎప్పుడు 
  6. Why....................ఎందుకు 
  7. Where................. ఎక్కడ 
  8. Which..................ఏది
  9. How....................ఎలా 
  10. How long.............ఎంత సేపు 
  11. How much...........ఎంత
  12. How many...........ఎన్ని 
  13. By whom............ ఎవరి చేత 
  14. At what time........ సమయాన 
  15. How for...............ఎంత దూరం 
  16. How often............ఎంత తరచుగా 


Yes or No  Type question తయారుచేయడం చాలా సులభం. వాక్యంలో వున్న helping verb ని subject ముందు వ్రాసి, వాక్యం చివర Question Mark వుంచితే సరిపోతుంది
వాక్యం లో helping verb లేకుంటే verb ని బట్టి, subject ని బట్టి do,doese,did ఉపయోగించాలి.
FOR EX
I SPEAK ENGLISH (దీనిని yes/no ప్రశ్నగా మారుద్దాం.)
ఇక్కడ helping verb లేదు గాబట్టి,,,, verb present tense లో ఉన్నది గాబట్టి DO I SPEAK ENGLISH? ఇది బాగోదనుకుంటే DO YOU SPEAK ENGLISH?
I AM SPEAKING ENGLISH.. ఇక్కడ helping verb am ఉన్నది గాబట్టి am ని subject ముందుకు తీసుకు వెళ్ళి AM I SPEAKING ENGLISH? అనవచ్చు.
అలాగే I HAVE NOT SPOKEN ENGLISH..దీనికి HAVE I NOT SPOKEN ENGLISH? అనవచ్చు.. లేదా HAVEN'T I SPOKEN ENGLISH? అనవచ్చు.
( సహజంగా yes/no టైప్ questions తేలిక గాబట్టి వీటిని ఇంతటితో ఆపేద్దామ్.. దీనిలో మీకు సందేహాలు కలిగితే మెయిల్ చేయండి)
Wh- Questions తయారుచేయడం 
Yes/No టైప్ question ముందు , సందర్భాన్ని బట్టి Wh word వ్రాస్తే wh- question ఏర్పడుతుంది. వాస్తవం ఏమంటే ఒక వాక్యంలో వ్రాయబడిన ప్రతి Parts of speech ని ఆధారం చేసుకుని ఒక question ని తయారుచేయవచ్చు. ఉదాహరణగా ఒక వాక్యం చూద్దాం.

I speak English
వాక్యంలో       I                 - SUBJECT
                     SPEAK       - VERB
                     ENGLISH    - OBJECT 
ఇప్పుడు Subject ఆధారంగా ప్రశ్న తయారుచేద్దాం.  Who speak English?  అంటే దీనికి సమాధానం subject అయిన I వస్తుంది. గమనించారుగా
ఇప్పుడు Verb ఆధారంగా ప్రశ్న తయారుచేద్దాం.  What do you do? ( వాక్యంలో I వస్తే Question లో you ఉపయోగించాలి) అంటే దీనికి సమాధానం Verb అయిన Speak వస్తుంది.
ఇప్పుడు Object  ఆధారంగా ప్రశ్న తయారుచేద్దాం. What do you speak? అంటే దీనికి సమాధానం Object  అయిన English వస్తుంది. గమనించారుగా
ఇలా వాక్యంలో ప్రతి Parts of speech పై question తయారుచేయవచ్చు.. 

మిగతా Question words తో ప్రశ్నలు 
(1) How long ని ఎంతసేపు అనే అర్ధంలో వాడవచ్చు ...
     How long have you been writing for me?
    I have been waiting for you for two hours
(2) How Much ని quantity ని ఇచ్చినప్పుడు వాడవచ్చు 
     How much milk do you drink every day?
     I drink 250 ml of milk everyday.
(3) How many ని Number ఇచ్చినప్పుడు వాడవచ్చు 
    How many boys are there in X class?
   There are 75 boys in X class
(4) By whom ను Passive Voice లో Wh question గా వాడతారు.
    By whom are you taught English?
    We are taught English by Krishna.
(5) At what time ను సమయాన అనే అర్ధంలో వాడవచ్చు
    At what time were you sleeping?
    I was sleeping in our house at 3 pm last Sunday  
(6) Which ను Choice ను తెలియజేయునప్పుడు వాడవచ్చు 
     Which do you Study?
     I study medicine or engineering.

      ఒక Sentence లో ముందుగా Subect, verb, object, adverb of place/ time/ manner, Adjective ని గుర్తించి వాటిపైన ప్రశ్నలు తయారుచేయడం practice చేయండి. మీకు ఇంగ్లిష్ మాటలాడటం ఎందుకు రాదో చూడండి. మరి ఉంటాను.




0 comments:

Post a Comment

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates