ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Wednesday, January 23, 2013

1000 Essential Vocabulary

మనము ఈ Lesson లో Essential Vocabulary క్రింద అత్యంత ముఖ్యమైన 1000 పదాలు నేర్చుకుందాం.వీటిని మీరు అలా చూసి ఇలా వదలటం కాదు..మీకు గుర్తు వుండే వరకు By heart చేయవలసిందే...వీటిని 50 చొప్పున విడి విడి Folders గా వుంచాను ... ఎందుకు, ఎలా అనుకోకుండా కంఠస్థం చేయండి. ఆ లిస్ట్ కోసం READ MORE      
క్లిక్ చేయండి. 

Thursday, January 17, 2013

స్పెల్లింగ్స్ తో సమస్య - 2

Daily....................ప్రతి రోజు
Dally....................సమయాన్ని వృదా చేయడం
Dairy...................పాల డిపో/పాల ఉత్పత్తులు అమ్మే దుకాణం
Diary...................దైనందిన వ్యవహారాలు వ్రాసే పుస్తకము
Decease................మరణము
Disease.................వ్యాధి
Desert..................ఒక ప్రదేశాన్ని వదిలి వెళ్ళడం
Dessert................ఎడారి
Discus..................ఆటలో ఉపయోగించే ఒక వస్తువు
Discuss................చర్చ
Edict...................ఆజ్ఞ/శాసనం
Addict................మత్తుమందులకు బానిసగా మారడం
Ego...................అహం
Ago...................గతంలో
Exercise.............కసరత్తు/విషయ పరిజ్ఞానం కోసం చేసేది
Exorcise.............క్షుద్రపూజ
Expand...............విస్తరించడం
Expend...............ఉపయోగించు
Far....................దూరము.
Fur................... జంతువుల శరీరముపైఉండే మెత్తని వెంట్రుకలు/ఉన్ని
Farther................ఎక్కువ దూరం
Further............... దీనికి మించి
Feast..................విందు భోజనము
Fist..................... పిడికిలి
Feat....................విన్యాసము
Feet................... అడుగులు
Floor..................గది ఉపరితలము
Flour..................పిండి
Gaol.................. జైలు
Goal..................లక్ష్యం
Gap................... ఖాళీ ప్రాంతం
Gape................నోరు తెరచి(ఆశ్చర్యం)చూచుట
hair...................జుట్టు
hare................కుందేలు
heir..................వారసుడు
haven.............సురక్షిత ప్రదేశం
heaven............స్వర్గం
heroin.............నల్లమందు/మత్తు పదార్ధం
heroine............సినీ నాయకి
hobby...............అలవాటు
hubby...............భర్త
human.............మానవ లక్షణం
humane............దయ
itch..................దురద
each................ప్రతి ఒక్కటి
loan.................అప్పు
lone.................ఒంటరిగా వుండటం
madden...........పిచ్చివానిగా మారు
maiden............అవివాహిత
mane................సింహం జూలు
main................ముఖ్యమైన
minor..............చట్టప్రకారం తగిన వయసు రాని బాలుడు/బాలిక
miner..............గనికార్మికుడు
none................ఎవరూ లేకుండా
nun.................అవివాహిత
noose..............ఉరితాడు
nose................ముక్కు
night................రాత్రి
knight..............యోధుడు
object..............వస్తువు
abject.............దయనీయమైన
opposite..........ఎదురెదురు
apposite...........తగిన
pal...................మిత్రుడు
pall.................శవపేటికపై కప్పే గుడ్డ
peace.............శాంతి
piece...............ముక్క
pet................పెంపుడుజంతువు
pat................మెచ్చుకోలుగా భుజం తట్టుట
roe..................ఓ రకమైన జింక
row.................వరుస
tonne……………….1000 కిలోలు
tone......................స్వరం
urgent...................త్వరగా
argent...................వెండి
wait......................వేచియుండు
weight..................బరువు


Sunday, January 13, 2013

సంక్రాంతి శుభాకాంక్షలు


(భాస్కర్ గారికి కృతజ్ఞతలతో)

Friday, January 11, 2013

స్పెల్లింగ్స్ తో సమస్య

మనము ఒక తెలుగు వాక్యాన్ని ఇంగ్లిష్ లోనికి మార్చాలనుకున్నాము. అదేమంటే.. వారు ఒక చిన్నారిని దత్తత తీసుకుందామనుకున్నారు... They wanted to అడాప్ట్ a child.  వాక్యనిర్మాణము కరక్టే. కానీ 'ఆడాప్ట్' స్పెల్లింగ్ ఏమిటి? మనకు ఎక్కడో చదివిన గుర్తు.... ADAPT, ADEPT, ADOPT ఈ‌3 33మూడు spellings లో ఏది రాద్దాం అనే సమస్య వస్తుంది. మాటలాడే సమయంలో ఫర్లేదు గాని వ్రాసినప్పుడు మనకు సమస్య. ఎందుకంటే ఈ మూడింటికి వేరు వేరు అర్దాలు వున్నాయి. ఇంగ్లీష్ తో మనకు ఇదే సమస్య. అలా అర్ధాలు వేరువేరు గా లేకపోతే ఏదో ఒకటి వ్రాసేవారము.. అక్షర దోషమని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఒకదాని బదులు మరోటి వ్రాస్తే అర్ధదోషం వస్తుంది. so .. మనము ఈ విషయంలో జాగ్రత్తగా వుండాలి.ఇలా మనల్ని ఇబ్బంది పెట్టేవి ఇంగ్లిష్ లో చాలానే వున్నాయి. వాటిలో కొన్ని చూద్దాము.  

Adapt................. తగిన విధముగా మార్చడము.
Adopt..................దత్తత తీసుకొను
Adept.................. నైపుణ్యము,నేర్పరితనము..
Adivise................(సలహా) క్రియా పదంగా ఉపయోగించాలి
Adivice................(సలహా) వ్యాకరణ పరంగా నామవాచకం అవుతుంది.
Altar.................... ప్రార్ధనా స్థలంలో వుండే దైవ పీఠం.
Alter.................... మార్పు 
All ready............... సర్వ సన్నద్దంగా ఉండటం.
Already................. అప్పటికల్లా 
Antic....................ఇతరులకు నవ్వు తెప్పెంచే విధంగా ప్రవర్తించడం.
Antique................పురాతన వస్తువు.
Artist.................... ఏదైనా కళలో నైపుణ్యం వున్న వ్యక్తి.
Artiste...................ఏదైనా కళను ఇతరులకు అందించి money తీసుకునే వ్యక్తి 
Baby.....................పిల్లవాడు/పాప 
Bobby...................అవివేకి 
Bald......................బట్టతల
Bold......................ధైర్యము
Ball.......................బంతి 
Bawl.....................అరుపు 
Bass......................lowest male voice
Boss.................... అధికారి 
Bowdy.................అమర్యాదగా ప్రవర్తించు 
Body..................మనిషి/జంతు శరీరము 
Bellow................గర్జించు 
Below..................తక్కువ స్థాయి, దిగువ
Beside................. ప్రక్క ప్రక్కనే
Besides................అందనంగా
Boarder............... వేరేయింట్లో ఉండి చదువుకునేవాడు.
Border................. సరిహద్దు 
Boon....................వరము
Bone.....................ఎముక 
Bough....................చెట్టు కొమ్మ 
Bow......................విల్లు
Brake...................వాహనమును ఆపు సాధనము 
Break................... ముక్కలుచేయు, అధిగమించు 
Site.......................స్థలము
Sight....................దృశ్యము 
College.................కళాశాల 
Collage.................కొన్ని వస్తువుల సమూహము 
Complement..........ఒక దానితో సరిపడేది 
Compliment............ఇతరులను మెచ్చుకోవడం 
Confirm................ ఒక విషయము నిజమేనని దృవీకరించడం 
Conform................నియమావళికి అనుగుణంగా నడచుకోవడం  

READ MORE
(సశేషం)

Wednesday, January 9, 2013

X English(EM) Half Yearly

పై ఇమేజ్ క్లిక్ చేయండి 

Friday, January 4, 2013

DIFFERENT FORMS OF A TENSE(80 Sentences)

   ఒక tense లో చెప్పబడిన ప్రతివాక్యానికి Passive Voice ఉంటే 8 రూపాలుంటాయి. లేనట్లైతే 4 రూపాలుంటాయి.
  1. A.V. POSITIVE
  2. A.V. NEGATIVE
  3. A.V. INTERROGATIVE
  4. A.V. NEGATIVE INTERROGATIVE
  5. P.V. POSITIVE
  6. P.V. NEGATIVE
  7. P.V. INTERROGATIVE
  8. P.V. NEGATIVE INTERROGATIVE
  • Simple Present Tense            = 8
  • Present Continuous               = 8
  • present perfect                     =  8
  • Present Perfect Continuous   = 4 (there is no PV)
  • Simple Past                          = 8
  • Past Continuous                   = 8
  • Past Perfect                         = 8
  • Past Perfect Continuous       = 4 (No PV)
  • Simple Future                       = 8
  • Future Continuous                = 4 (No PV)
  • Future Perfect                      = 8
  • Future Perfect Continuous    = 4 (No PV)
         TOTAL  ............................    80 Sentence
ఇలా మనము ఒక verb తీసుకుని దానితో 80 రకాల వాక్య నిర్మాణము చేయగలిగితే మనకు 75 శాతము ఇంగ్లిష్ వచ్చినట్లే ..advise అనే verb తీసుకుని నేను ఒక Exel ఫైల్ తయారుచేశాను. దాని డౌన్లోడ్ లింక్ ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని print తీసుకుని పెద్దగా చదవడం ప్రాక్టీసు చేయండి.

పట్టిక గురించి 2 మాటలు  

  1. AV= ACTIVE VOICE
  2. PV= PASSIVE VOICE
  3. M  = MODE
  4. A = ASSERTIVE SENTENCE
  5. N = NEGATIVE
  6. I = INTERROGATIVE
  7. NI = NEGATIVE INTERROGATIVE
అలాగే ..I speak english అనే Active voice ని English is spoken by me అని నేను మార్చలేదు. ఇక్కడ అర్ధం విభేదించదు. నిజ జీవితం లో ఎవరూ AV ఇచ్చి PV కి మార్చమని అనరు. అవసరాన్ని బట్టి దేనికదే ప్రత్యేకం గా  మాటలాడతారు. ఉదాహరణకు I advise అంటే నేను సలహా ఇస్తాను.. ఇది active voice...  I am advised అంటే నాకు సలహా ఇస్తారు.. ఇది passive voice.. ఇక్కడ అర్ధం విభేదించింది కదా. కనుక  I advise కి ఇది passive కాదు. దేనికదే ప్రత్యేకం. spoken english point of view లో మనకు పనికొచ్చేది ఇదే. మరి గమనిస్తారుగా...

మరింత వివరం కోసం  , డౌన్లోడ్ లింక్ కోసం READ MORE  ని క్లిక్ చేయండి. లేదా మన మరో బ్లాగు
http://englishmadeeasy.webnode.com//  లో  Lesson 8 చూడండి.                          

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates