ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Friday, April 27, 2012

Bangle Sellers Poem by Sarojini Naidu-Sung By Smt.Abigail

***Sung By Smt.Abigail,  Z.P.High School,Pedapalakaluru, Guntur District (A.P)***{For S.S.C (TM) Students}

Bangle sellers are we who bear

Our shining loads to the temple fair...

Who will buy these delicate, bright

Rainbow-tinted circles of light?

Lustrous tokens of radiant lives,

For happy daughters and happy wives.

Some are meet for a maiden's wrist,

Silver and blue as the mountain mist,

Some are flushed like the buds that dream

On the tranquil brow of a woodland stream,

Some are aglow wth the bloom that cleaves

To the limpid glory of new born leaves

Some are like fields of sunlit corn,

Meet for a bride on her bridal morn,

Some, like the flame of her marriage fire,

Or, rich with the hue of her heart's desire,

Tinkling, luminous, tender, and clear,

Like her bridal laughter and bridal tear.

Some are purple and gold flecked grey

For she who has journeyed through life midway,

Whose hands have cherished, whose love has blest

And cradled fair sons on her faithful breast,

And serves her household in fruitful pride,

And worships the gods at her husband's side.

మేము గాజులు అమ్మే వాళ్ళం!
మెరిసే మా గాజులను తిరునాళ్ళకు తీసుకుని వెళ్ళి అమ్ముతుంటాము.
సున్నితంగా, ప్రకాశవంతంగా, ఇంద్రధనుస్సును అద్దిన
ఈ కాంతి వలయాలను (గాజులను) ఎవరు కొంటారు?
ఇవి ఆనందంగా గడిపే కూతుళ్ళు,భార్యల(ముత్తైదువుల) సంతోషకరమైన
జీవితాలకు ప్రకాశవంతమైన గుర్తులు.

వీటిలో కొన్ని పెళ్లికాని యువతులకు సరిపోతాయి.
నీలమూ, వెండి రంగు కలిసిన పర్వతపుపైని నీలిమేఘాలలా,
కొన్ని అడవులలోని చిన్ని చిన్ని ప్రవాహాల ప్రకాశవంతమైన అంచుల్లో కలలుగనే మొగ్గలలా
ఎరుపెక్కినవి కొన్ని, నునులేత చిగుళ్ళ పారదర్శకమైన అందాన్ని 
ఆంటీ పెట్టుకున్న పువ్వుల శోభ కలిగినవి కొన్ని.

కొన్ని సూర్యకాంతికి మెరిసే పైరు రంగు కలవి 
పెళ్లిరోజు వధువుకి సరిపోతాయి.
కొన్ని ఆమె పెళ్లి నాటి అగ్ని కాంతిలా 
లేదా ఆమె హృదయపు కోరికలలా రంగులు నిండి వుంటాయి.
గలగలలతో, ప్రకాశిస్తూ, నాజూకుగా, స్పష్టంగా
పడతి వివాహసమయపు నవ్వులా, అప్పగింతలప్పటి ఏడుపులా మరికొన్ని వుంటాయి.

కొన్ని ముదురు కెంపు రంగులో బంగారు రంగు అద్దిన బూడిద వర్ణం లోనివి.
ఇవి పిల్లల్ని ప్రేమించే తల్లికి, భర్తకు గర్వాన్ని కలుగజేసే గృహిణికి,
భర్త క్షేమం కోసం భగవంతుడిని పూజించే మధ్య వయస్సు గృహిణికి సరిపోతాయి.

Wednesday, April 11, 2012

FIGURES OF SPEECH (అలంకారములు)

ఒక అబిప్రాయము సరళమైన సామాన్యమైన పదములతో తెలుపుటకు బదులు కొంత చమత్కారముతో వర్ణించినచో అది  Figures of Speech (అలంకారమనబడును)


     ఉదాహరణకు 'రాధ ముఖము గుండ్రముగా   ఉన్నది' అనుటకు బదులు 'రాధముఖము చంద్ర బింబము వలె ఉన్నది' అన్నచో ఎక్కువ ఇంపుగా వుండును.


    ప్రతి భాష నందును గొప్ప కవులు అలంకారయుక్తమగు (Figurative Language) భాషతో తమ రచనలను చేయుదురు. అలంకారము అనేక విధములుగా వుండును.ఒక్కొక్క అలంకారము ఒక్కొక్క విధమైన భాషా చమత్కారము తెలుపుచుండును.


    ఒక విషయమును ఎక్కువ ఇంపుగాను, మనస్సులో నాటుకొనునట్లు వర్ణించుటయే అలంకారముయొక్క ప్రయోజనము.ఆయాభావములను కనులకు కట్టినట్లు చిత్రించుటకు అలంకారములు (Figures Of Speech) ఎక్కువగా ఉపయోగించును.


    'అతడు ఎల్లప్పుడును నిజము చెప్పును' అని చెప్పుట కంటే 'అతడు సత్య హరిచంద్రుడు' అనుటచే మనస్సులో ఆ అంశము దృఢముగా హత్తుకొనును.


   ఇంగ్లిష్ భాషలో గల  Figures Of Speech అన్నింటిని తెలుగులో సమానుయములగు  అలంకారములను చూపుట అసంభవము. ఏల అనగా ఒక్కొక్క భాష యొక్క సంప్రదాయము ఒక్కొక్క రీతిగా ఉండును.


     ఆంగ్ల సాహిత్యమునందలి కొన్ని సుప్రసిద్ధములగు (Figures Of Speech) అలంకారముల పేర్లు తెలుసుకుందాము. వీటి వివరణ ప్రస్తుతము ఇంగ్లిష్ నేర్చుకునే క్రమములో అవసరము లేదు.

  • SIMILE
  • METAPHOR
  • ALLEGORY
  • FABLE
  • PARABLE
  • PERSONIFICATION
  • APOSTROPHE
  • ANTITHESIS
  • EPIGRAM
  • IRONY
  • SARCASM
  • SATIRE
  • EUPHEMISM
  • INVERSION
  • PATHETIC FALLACY 
  • OXYMORON
  • VISION
  • CIRCUMLOCUTION
  • PUN
  • ALLITERATION
  • ONOMATOPOEIA 
  • TAUTOLOGY
  • PARADOX
  • (స్వస్తిక్ గ్రామర్ బుక్ నుండి గ్రహించడమైనది)


    

Thursday, April 5, 2012

PROVERBS-సామెతలు

Students వీటిని కంఠస్థం చేయడం ద్వారా Examinations లో Story Writing పార్ట్ లో Morals క్రింద Use చేసుకోవచ్చు.Spoken English Point Of View లో వీటిని ఉపయోగించడం ద్వారా భాషలో సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు.



  1. A cold hand and a warm heart..మనసు మాత్రం వెన్న..పెట్టు  పోతలు మాత్రం సున్న
  2. A father loves his children in hating their faults... తండ్రి పిల్లల దోషాల్ని ఏవగించుకోవడం ద్వారానే వాళ్ళని ప్రేమిస్త్రాడు.
  3. A friend in need is a friend indeed...ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు.
  4. A good deed is never lost...మంచి పని ఎన్నటికీ మరుగున పడదు.
  5. Look before you leap...దూకడానికి ముందే లోతు తెలుసుకో 
  6. Cowards die many times before their death..పిరికివాళ్ళు తాము చావడానికి ముందే చాలా సారులు ఛస్తారు.
  7. Eat to live not live to eat..తినడానికి బ్రతకవద్దు, బ్రతకడానికి తిను 
  8. A friend without faults will never be found..ఏ లోపం లేని మిత్రుడు ఎక్కడా వుండడు
  9. A good example is the best sermon...పది నీతులు కంటే ఒక చేత మేలు.
  10. A good beginning is half the work...నవ్వుతూ మొదలైతే సగం పని అయినట్లే 
  11. Failures are stepping stones to success..అపజయాలు విజయానికి సోపానాలు 
  12. A living dog is better than a dead lion..దొరకని గొప్ప అవకాశం కంటే దొరికిన చిన్న అవకాశం మేలు 
  13. No pains no gains...శ్రమ లేనిదే ఫలితము లేదు 
  14. Experience is a great teacher..అనుభవం గొప్ప అధ్యాపకుడు
  15. Practice makes a man perfect...అభ్యాసము మనిషిని పరిపూర్ణుడిని చేస్తుంది.
  16. Speech is Silver, Silence is Gold...అతి గా మాటలాడటం కంటే మితం గా మాటలాడటం మేలు 
  17. Where there is a will there is a way..మనసుంటే మార్గం వుంటుంది.
  18. All that glitters is not gold..మెరిసేదంతా బంగారం కాదు.
  19. An idle brain is the devil's workshop..సోమరిగా వుండే వాడి మెదడు దయ్యాల ఇల్లు లాంటిది.
  20. Life is not bed of roses...జీవితం పూల పాన్పు కాదు.
  21. Prevention is better than cure...వైధ్యం కంటే అసలు వ్యాధి రాకుండా చూసుకోవడం మేలు 
  22. Pen is mightier than the sword..కలము, కత్తి కన్నా గొప్పది.
  23. Envy is the admission of inferiority..అసూయ పడటం చేతకాని తనానికి చిహ్నం 
  24. Bad news travels fast..చెడు వార్తా త్వరగా వ్యాపిస్తుంది.
  25. God could not be every where, therefore he made mothers... దేవుడు అన్నిచోట్లా వుండలేడు. కనుక తల్లుల్ని  సృష్టించాడు.


Tuesday, April 3, 2012

COMPARISONS

  • as blind as a bat
  • as busy as a bee
  • as cheap as dirt
  • as clear as crystal 
  • as cunning as a fox
  • as dead as mutton
  • as deaf as post
  • as deep as a well
  • as dry as dust
  • as good as gold
  • as green as grass 
  • as hard as rock
  • as heavy as lead
  • as fat as a pig
  • as fit as a fiddle
  • as sharp as a needle
  • as sober as a judge
  • as sweet as honey
  • as thick as thieves
  • as timid as a mouse
  • as tough as leather
  • as vain as a peacock
  • as warm as toast
  • as weak as water
  • as flat as a board
  • as free as air
  • as fresh as rose
  • as gay as lark
  • as pale as death
  • as patient as job 

Monday, April 2, 2012

Will వాడదామా? Shall వాడదామా?

వర్తమాన కాలములో వుండే ప్రాధమిక క్రియ భూతకాలములోనికి వచ్చినపుడు సాధారణముగా కొంత మార్పును పొందును. ఉదాహరణకు write ... wrote అవుతుందిగదా (కొన్ని verb ల లో తప్ప) కానీ భవిష్యత్ కాలములో ఎటువంటి మార్పూ పొందదు. అందువలన shall,will ల తరువాత Root verb ని వుంచడం ద్వారా Future Tense ని తెలియ పరుస్తాము.


సాధారణముగా First Persons అయిన  I.We ల ముందు Shall మిగతా persons ముందు Will ఉపయోగిస్తారు. (మనము అటు,ఇటు,మారిస్తే అర్ధములో తప్పనిసరి,అని నిశ్చ్హయము అని తీసుకోవచ్చు) ప్రస్తుతానికి ఆ తేడా లేకుండా అది ఏ పర్సన్ అయినా 'Will' వాడటమే వాడుకగా మారింది.కానీ ప్రశ్నా వాక్యముగా మార్చినప్పుడు First Persons లో Shall మాత్రమే వాడటం గమనార్హం. Ex..Shall I go? (will I go? అనకూడదని కాదు)


Sunday, April 1, 2012

"శ్రీరామ నవమి" శుభాకాంక్షలు


రామాయణ గ్రంధం  ఆమూలాగ్రమే అక్కరలేదు..ఏ కొంత భాగం చదివినా ఎలా బ్రతకాలో, ఎలా బ్రతక కూడదో చెబుతుంది..ఎలా మాట్లాడాలో, ఎలా మాటలాడకూడదో చెబుతుంది..ఈరోజు మనము చర్చించుకునే "కమ్యూనికేషన్ స్కిల్స్" పర్సనాలిటీ డెవలప్మెంట్" అసలు ఇందులో దొరకనిది ఏది? రాముడు దేవుడో  కాదో  ప్రక్కన పెట్టి వారిని మనము ఆదర్శ పురుషునిగా అంగీకరించవలసిందే. వారి మహోన్నత వ్యక్తిత్వానికి చెయ్యెత్తి నమస్కరించ వలసిందే..తెలుగు కుటుంబాలకు  వినమ్రంగా "శ్రీ రామ నవమి" శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. నమస్తే-

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates