ప్రియ విధ్యార్ధులారా.. చాలా రోజుల తరువాత మనము ఇలా క్రొత్త lesson లో కలవడం చాలా సంతోషం. ఈ రోజు మనము ప్రశ్నించడం గురించి తెలుసుకుందాం. సాదారణంగా మనము నిద్ర లేచింది మొదలు నిద్రించేవరకు చాలా మందిని ప్రశ్నిస్తూ వుంటాము. అలాగే ఇతరుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ వుంటాము. అంటే spoken english లో ప్రశ్నించడం వస్తే మనము చాలా వరకు success అయినట్లే. కాకపోతే spoken english కోచింగ్ సెంటర్స్ వారు ప్రశ్నించడం నేర్పరు.. ప్రశ్నలు నేర్పుతారు. అదేనండీ.. ఇంస్టెంట్ కాఫీ లాగా ఇంస్టెంట్ questions నేర్పుతారు. అంటే కొన్ని ప్రశ్నల లిస్ట్ ఇచ్చి కంఠస్థం చేయమంటారు. ఇది ఎంతవరకు సమంజసము చెప్పండి. మనకు ఏ ఏ సందర్భాలు, ఎలా ఎదురౌతాయో, మనము ఎలాంటి ప్రశ్నలు అడగవలసి వస్తుందో, ఎలాంటి ప్రశ్నలకు సమాధాలు చెప్పవలసి వస్తుందో మనకు ఎలా తెలుస్తుంది? So కొన్ని ప్రశ్నల జాబితాను కంఠస్థం చేయడం కాదు. మనమే ప్రశ్నలను తయారుచేయడం నేర్చుకుని సందర్భాన్ని బట్టి మనమే ప్రశ్నిచడం మొదలు పెట్టాలి. ఈరోజు మనము నేర్చుకునేది ... అదే/////// ఓకే.. మరి రెడీ గా వున్నారా!
Wh-Question .. frame చేయడానికి ఉపయోగించే పదాలు .. వాటి అర్ధాలు.
- What...................
ఏమిటి
- What
type............. ఏ రకం
- What
kind............. ఏ రకం
- Who.....................ఎవరు
- When..................
ఎప్పుడు
- Why....................ఎందుకు
- Where.................
ఎక్కడ
- Which..................ఏది
- How....................ఎలా
- How
long.............ఎంత సేపు
- How
much...........ఎంత
- How
many...........ఎన్ని
- By
whom............ ఎవరి చేత
- At
what time........ ఏ సమయాన
- How
for...............ఎంత దూరం
- How
often............ఎంత తరచుగా
Yes or No Type
question తయారుచేయడం చాలా సులభం. వాక్యంలో వున్న helping verb ని subject ముందు వ్రాసి, వాక్యం చివర Question Mark వుంచితే సరిపోతుంది.
వాక్యం లో helping verb లేకుంటే verb ని బట్టి, subject ని బట్టి do,doese,did ఉపయోగించాలి.
FOR EX
I SPEAK ENGLISH (దీనిని yes/no ప్రశ్నగా మారుద్దాం.)
ఇక్కడ helping verb లేదు గాబట్టి,,,, verb present tense లో ఉన్నది గాబట్టి DO I SPEAK ENGLISH? ఇది బాగోదనుకుంటే DO YOU SPEAK ENGLISH?
I AM SPEAKING ENGLISH.. ఇక్కడ helping verb am ఉన్నది గాబట్టి am ని subject ముందుకు తీసుకు వెళ్ళి AM I SPEAKING ENGLISH? అనవచ్చు.
అలాగే I HAVE NOT SPOKEN
ENGLISH..దీనికి HAVE I NOT SPOKEN
ENGLISH? అనవచ్చు.. లేదా HAVEN'T I SPOKEN
ENGLISH? అనవచ్చు.
( సహజంగా yes/no టైప్ questions తేలిక గాబట్టి వీటిని ఇంతటితో ఆపేద్దామ్.. దీనిలో మీకు సందేహాలు కలిగితే మెయిల్ చేయండి)
Wh-
Questions తయారుచేయడం
Yes/No టైప్ question ముందు , సందర్భాన్ని బట్టి Wh word వ్రాస్తే wh- question ఏర్పడుతుంది. వాస్తవం ఏమంటే ఒక వాక్యంలో వ్రాయబడిన ప్రతి Parts of speech ని ఆధారం చేసుకుని ఒక question ని తయారుచేయవచ్చు. ఉదాహరణగా ఒక వాక్యం చూద్దాం.
I speak English
ఈ వాక్యంలో I
- SUBJECT
SPEAK - VERB
ENGLISH - OBJECT
ఇప్పుడు Subject ఆధారంగా ప్రశ్న తయారుచేద్దాం. Who speak English?
అంటే దీనికి సమాధానం subject అయిన I వస్తుంది. గమనించారుగా
ఇప్పుడు Verb ఆధారంగా ప్రశ్న తయారుచేద్దాం. What do you do? ( వాక్యంలో I వస్తే Question లో you ఉపయోగించాలి) అంటే దీనికి సమాధానం Verb అయిన Speak వస్తుంది.
ఇప్పుడు Object ఆధారంగా ప్రశ్న తయారుచేద్దాం. What do you speak? అంటే దీనికి సమాధానం Object అయిన English వస్తుంది. గమనించారుగా
ఇలా వాక్యంలో ప్రతి Parts of speech పై question తయారుచేయవచ్చు..
మిగతా Question words తో ప్రశ్నలు
(1) How long ని ఎంతసేపు అనే అర్ధంలో వాడవచ్చు ...
How long have you been
writing for me?
I have been waiting for you
for two hours
(2) How Much ని quantity ని ఇచ్చినప్పుడు వాడవచ్చు
How much milk do you
drink every day?
I drink 250 ml of milk
everyday.
(3) How many ని Number ఇచ్చినప్పుడు వాడవచ్చు
How many boys are there in X
class?
There are 75 boys in X class
(4) By whom ను Passive Voice లో Wh question గా వాడతారు.
By whom are you taught
English?
We are taught English by
Krishna.
(5) At what time ను ఏ సమయాన అనే అర్ధంలో వాడవచ్చు
At what time were you
sleeping?
I was sleeping in our house
at 3 pm last Sunday
(6) Which ను Choice ను తెలియజేయునప్పుడు వాడవచ్చు
Which do you Study?
I study medicine or
engineering.
ఒక Sentence లో ముందుగా Subect, verb, object,
adverb of place/ time/ manner, Adjective ని గుర్తించి వాటిపైన ప్రశ్నలు తయారుచేయడం practice చేయండి. మీకు ఇంగ్లిష్ మాటలాడటం ఎందుకు రాదో చూడండి. మరి ఉంటాను.