ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Friday, September 9, 2011

ఇంగ్లిష్ మాటలాడటం ఎలా నేర్చుకుందాం?



  • మనము ఇంగ్లిష్ లో వాక్యాలు వ్రాయడం వేరు..మాటలాడటం వేరు. వ్రాసేటప్పుడు గ్రామర్ గుర్తుకు తెచ్చుకునే అవకాశం ఉంటుంది గాని మాట్లాడేటప్పుడు గ్రామర్ రూల్స్ మనం పాటిస్తున్నమా లేదా..ఒకవేళ తప్పు మాట్లాడుతున్నమేమో అని అలోచిన్చినంతకాలం..మనకు ఇంగ్లిష్ రాదు.తప్పు అయినా ఒప్పు అయినా మనము మాట్లాడాలి..అంతే..ఇందుకోసం మనము ఇంగ్లిష్ వాక్యాలను కంటస్థం చేసి వాటిని ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చుని బాగా ప్రాక్టీసు చేయాలి..ఇందుకోసం మీకు శ్రీ ఎర్రా సత్యనారాయణ గారు వ్రాసిన స్పోకెన్ ఇంగ్లిష్ పుస్తకాలూ బాగా ఉపయోగ పడతాయి..ఇప్పుడు మనం వారి బుక్స్ నుండే కొన్ని  వాక్యాలను చూద్దాం..వాటిని మీరు కంటస్థం చేసి ముందు ప్రయోగించండి...మీకు నచ్చితే వారి బుక్స్ కొనుగోలు చేయండి..నోరు విప్పకుండా ఇంగ్లిష్ భాష రావటమనేది వంద శాతము కుదరదు.

  • Be a man........మనిషి వలె ఉండు 
  • Be an angel.....దేవత వలె ఉండు
  • Be alert......అప్రమత్తంగా ఉండు 
  • Be at my house today...ఈరోజు మా ఇంటివద్ద ఉండు
  • Be at peace...శాంతంగా యుండు 
  • Be attentive....శ్రద్దగా ఉండు
  • Be back by 6 o'clock.....ఆరు గంటలకల్లా తిరిగిరా 
  • Be brave...ధ్యైర్యం గా ఉండు
  • Be calm..... నిశ్శబ్దంగా యుండు 
  • Be careful in future....భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండు
  • Be careful what you say...నీవు ఏమి చెబుతున్నవో జాగ్రత్త.
  • Be careful when you are crossing the road...వీధి దాటుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండు.
  • Be careful with it...దానితో జాగ్రత్తగా ఉండు.
  • Be cheerful...ఉల్లాసం గా ఉండు
  • Be gentle when you brush the baby's hair...పాప జుట్టు దువ్వు/రుద్దు తున్నప్పుడు సున్నితంగా ఉండు.
  • Be here at 4 o'clock without fail..నాలుగు గంటలకు తప్పక ఇక్కడ ఉండు.
  • Be in your limits... నీ హద్దులలో నీవు వుండు.
  • Be polite with elders... పెద్దలతో మర్యాదగా ఉండు.
  • Be proud being an Indian...భారతీయుదవైనందుకు గర్వించు.
  • Be ready by that time... ఆ సమయానికి సిద్దంగా ఉండు.
  • Be strict with my children.....మా పిల్లల విషయంలో కటినంగా వుండు.
  • Be waiting for him when he returns.... అతడు వచ్చేవరకు వేచి ఉండు.
  • Be wise.... తెలివిగా వుండు.
  • Be prepare for anything.....దేనికైనా సంసిద్దంగా వుండు..
  • TAKE CARE AND HAVE A NICE DAY...BYE...PRATAP

3 comments:

Ravi said...

మంచి ప్రయత్నం చేస్తున్నారు. అభినందనలు.

Anonymous said...

Just change "alret" to "alert"

cinemanews said...

www.tollywoodpolitics.com

www.bollywoodindiaboxoffice.com

Post a Comment

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates