మిత్రులారా
ఈ ప్రశ్న మీ హృదయంతరాలలో నిరంతరం రగులుతూనే ఉండాలి.తగు సమాధానం దొరికేంత వరకూ మీరు శోదిస్తూనే ఉండాలి.దొరికిన సమాధానం మీకు తృప్తిని కలిగిస్తే ఇకపై దాని అమలుకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలి.. ఆ ప్రణాళిక ఎలా ఉండాలంటే మీ సాధ్యసాధ్యలకు లోబడి ఉండాలి....
ఒక్కసారి కమిట్ ఐతే మీ మాట మీరే విననంతటి స్థాయిలో ఉండాలి.మీ లక్ష్యాలను చిన్న చిన్న గా విభజించు కుంటూ పెద్ద స్థాయికి వెళ్ళాలి..
*మీ ప్రణాళిక ఒక Time Table లా ఉండకూడదు. అదే నండి.. 6.00 am To 7.00 am ఇంగ్లిష్ పేపర్ చదవాలి, 7.00 am To 8.00 am - ఇంగ్లిష్ గ్రామర్ చదవాలి..ఇలా వద్దండి..ఇది కేవలం స్కూల్స్ కి కాలేజస్ కి మాత్రమే పరిమితం..ఇలా ఎందుకు చెబుతున్నానంటే ..ఒకరోజు మీ ఇంటికి భందువులు వచ్చారనుకుందాం..వారితో పాటుగా ఉదయం 6-7 బయటకు వెళ్ళవలసి రావచ్చు..లేదా 7-8 మీకు స్పెషల్ క్లాసు ఉండవచ్చు..అలాంటప్పుడు ఏం జరుగు తుంది? ఆటోమాటిక్ గా ఈ రోజూ చేయవలసిన పని రేపటి 6-7 కి 7-8 కి వాయిదా వేయబడుతుంది... మిత్రులారా..ఇప్పటివరకు మనం సమయాన్ని వృధా చేసింది ఇలాగేగా..పైగా నా తప్పేమి ఉందని మన మనసుకు మనం సర్ది చెప్పుకుంటాం..
మీరు వినలేదా? PROCRASTINATION IS THE THIEF OF TIME...
*మరి మీ ప్రణాళిక ఎలా ఉండాలి..
మనకున్న 24 గంటలలో తప్పక చేయ వలసిన పనులకు కేటాయించవలసిన సమయాన్ని తీసి వేసి మిగిలిన సమయం ఆధారంగా ప్రణాళిక సిద్దం చేసుకోవాలి.
For Example
కళాశాల లేదా ఆఫీస్ లో గడపవలసిన సమయం(ఇది తప్పదు)........ 8 గంటలు
నిద్రకు కేటాయించ వలసిన సమయం (ఇది తప్పదు)...................... 8 గంటలు
రెడీ అవటానికి పట్టే సమయం (దీనిని మీరు తగ్గించుకోవచ్చు)........... 1 గంట
ఇతరములు (దీనిని మీరు తగ్గించుకోవచ్చు).............. .................... 1 గంట
ఆఫీస్ పని లేదా అకడమిక్ సబ్జెక్ట్స్ చదువుట(దీనిని పెంచుకోవచ్చు). 3 గంటలు
TV/Computer................... .............................. .................... 1 గంట
---------------
మొత్తం ....... 22 గంటలు
--------------
24-22 = 02 కాబట్టి ఒక రోజులో రెండు గంటలు ఇంగ్లిష్ కి కేటాయించవచ్చు...ఆదివారాలు.. శలవు దినాలలో ఈ 2 కి 8 గంటలు Add అవుతాయి..అప్పుడు మొత్తం 10 గంటలు..ఖంగారు వద్దు..ఈ 10 గంటలలో మీ ఇష్టానికి 4 గంటలు ఉపయోగించుకొని మిగిలిన 6 గంటలు ఇంగ్లిష్ కి కేటాయించండి..ఇలా మీరు working days లో 2 గంటలు (రోజులో మీకు ఎప్పుడు వీలయితే అప్పుడు) Holidays లో 6 గంటలు..(మీ అవకాశాన్ని బట్టి సమయం విభజించుకోండి) నేను 3 వ పార్టు లో చెప్పినట్లుగా సాధన చేయండి.... అప్పుడు మీకు ఇంగ్లిష్ మాత్రమే కాదు.... ఏదైనా సుసాధ్యమే..
క్షమించాలి..సమయం కుదరక మీకు పూర్తి LESSON ని అందించలేక పోతున్నాను..మీకు నిజంగా ఉపయోగ పడేది PART-3.. మాత్రమే..........
పార్ట్-3 ని త్వరలో మీముందుకు తీసుకు రాగలను....అప్పటివరకు క్షంతవ్యుడను....
విజయీభవ.......మీ....ప్రతాప్
0 comments:
Post a Comment