ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Sunday, September 25, 2011

సర్, మాకు ఇంగ్లిష్ రాదా..(పార్ట్- 3)

మిత్రులారా...

మాటలాడే సమయంలో తప్పులు దొర్లుతాయేమో అనే భావన మరిన్ని తప్పులు చేయడానికి కారణము అవుతుంది తప్ప దానివల్ల వేరే ప్రయోజనం లేదు.ఈ రోజూ సమాజంలో జరిగే అత్యంత ఘోరాలే నేరాలుగా రుజువుగాక మన ప్రజా స్వామ్యం తగలబడి పోతుంటే ..మనం ఒక భాష నేర్చుకునే క్రమంలో తప్పులు మాటలాడితే తప్పా....my dear friends..నిర్భయంగా తప్పో వొప్పో ముందు మాటలాడటం ప్రారంభించండి.

  • ఇదే బ్లాగ్ లో ఉన్న "ముందుమాట" చదవండి.
  • అక్షర మాల నేర్వకుండానే మీరు తెలుగు అనర్ఘలంగా మాటలాడటం వెనుక ఉన్న అసలు రహస్యం గ్రహించండి.
  • Reading,writing, Listening and speaking ..ఇవన్ని language skills..  వీటిలో నీవు Reading,Writing  ఈ సరికే  నేర్చుకొని వుంటారు..ఇంక మిగిలింది..Listening .. Speaking..విని అనుకరించడం ద్వారానే నీవు తెలుగు మాటలాడ గలిగావనేది నీవు ఎందుకు మరచి పోతున్నావ్.ఇప్పుడు కూడా ఇంగ్లిష్ ఎక్కువగా వినడం ద్వార..అనుకరిస్తూ మాటలాడటానికి ప్రయత్నిచడం ద్వార నీవు ఇంగ్లిష్ మాటలాడ గలవు..
  • అసలు గ్రామరు అక్కర లేదనేది నా ఉద్దేశ్యం కాదు..ప్రాధమిక అంశాలు తప్పక నేర్చుకోవాలి..మీరు పదవ తరగతి వరకూ నేర్చుకొన్న వ్యాకరణం చాలు..దానిలో మీకు గట్టి పట్టు వుంటే చాలు..


ఇలా ప్రయత్నించి చూడండి..

Talk to friends who are also learning English.. Go out together for coffee and only speak English each other.

@ చిన్న చిన్న ఇంగ్లిష్ కధల్ని పెద్దగ స్పష్టంగా చదవండి..If possible record yourself and play it back later..మీ గొంతు పేలవంగా వుంటే సరిచేసుకోండి.

నెట్ లో native speakers తో చాట్ చేయండి..అందుకోసం దిగువు లింక్స్ ని క్లిక్ చేయండి.....       http://www.busuu.com/   ........     http://www.livemocha.com/

మీకు చాట్ చేయడం క్రొత్తా? మీరు తప్పు వాక్యాలు టైపు చేస్తారేమో అనే భయమా?మీకు అలవాటు అయ్యేంతవరకు ఒక మెషిన్ తో చాట్ చేయండి..చాల గమ్మత్తు గా వుంటుంది. ఇది Mario చే program చేయబడిని ఒక సాఫ్ట్ వేర్..       http://www.ego4u.com/en/chill-out/chat/egon-బొట్


English movies, News చూడండి..When you are watching TV.. observe the mouth movements of the speaker..

Use .. English to English Dictionary..
@ word web dictionary ని ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.... http://wordweb.info/fre  ...

@ keep a notebook of new words you learn. Use them in sentences.Don't worry about understanding every word..ఓవరాల్ గా చదివాకా అంతా మీకే అర్థం అవుతుంది.

@ Don't translate into English from your own language.. Think in English to improve your fluency.( ప్రతి భాషకు ఒక సొంత నుడికారము వుంటుంది..దానిని మనము మార్చ కూడదు.. BUT= బట్..కనుక నేను PUT ని పట్ అంటాను అంటే కుదరదు.)

YOU CAN'T LEARN ENGLISH FROM A BOOK. lIKE DRIVING A CAR.. YOU CAN ONLY LEARN THROUGH DOING IT...


క్రియ అర్థం అయితే భాష అర్ధం అవుతుంది..మనకు సహాయక క్రియలు 24 మాత్రమే..ముందుగా వాటిని లోతుగా అర్ధం చేసుకుని ఉపయోగించడం నేర్చుకోండి..ఇక eat,learn,walk... ఇలాంటి main verbs అనంతం.. conjugation తో సహా వీటిని మీరు ఎన్ని నేర్చుకుంటే మీకు భాష పై అంత పట్టు వస్తుంది.



Find a comfortable,peaceful place for quiet study..ముందు ప్రయత్నం గా అద్దం ముందు నిలబడి speaking practice చేయండి.

మీరు అతిశయోక్తి అనుకోక పొతే Regular గా ఈ బ్లాగ్ ఫాలో అవుతూ వుండండి..

@ ఇంగ్లిష్ బయటకు ఖచ్చితంగా ఎంత ఎక్కువగా చెబుతారో..అంత త్వరగా మీరు ధారాళంగా మాటలాడటం నేర్చుకుంటారు..

@ Every lesson will be difficult when you start.. ఏది ఏమైనా సాధన చేస్తున్నప్పుడు మీకు ఖచ్చితం గా ఇంగ్లిష్ మాటలాడటం వస్తుంది...

@ మీరు ఎక్కడ ఖాళీగా వున్నా.. మీ చుట్టూ వున్నా జనం మాటలాడే మాటలను ..మీ మనసులో ఇంగ్లిష్ లోకి అనువదించే ప్రయత్నం చేయండి..

10 వ తరగతి వరకూ మీరు నేర్చుకున్న గ్రామర్ పుస్తకాలను ఒకసారి తిరగేయండి..భవంతి కి పునాది లాంటివే .. ఆ ప్రాధమిక అంశాలు..

     


 @  భందువులకు..స్నేహితులకు లెటర్స్ ఇంగ్లిష్ లోనే వ్రాయండి..


    
  • Read English Fiction Novels

  • You can change the way you speak but it won't happen overnight. Be patient. People often expect instant results and give up too soon

  • Grasp every opportunity you have to speak with people in English..

  • Talk slowly and carefully, Don't rush through.

  • When you hear a new word, try to find its usage and its antonyms, etc.,

  • Read at least one article of your choice aloud every day..అలాగే  మీ అభిప్రాయాలను ఇంగ్లిష్ లో చెప్పటానికి ప్రయత్నించండి. దీనికి  చర్చా వేదికలు నెట్ లో చాలానే ఉన్నాయి.. అందుకోసం paltalk messenger లో సభ్యులై పోండి      
స్వగతం...
డియర్ ఫ్రెండ్స్..నేను వ్రాసిన పోస్ట్స్ లో దీనికి మంచి స్పందన వచ్చింది..సంతోషం..కానీ చాలామంది ..కాల్ చేస్తున్నారు..మెయిల్ పంపుతున్నారు..ఆర్టికల్ ఎప్పుడు ముగిస్తున్నారు? అని..ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది ఏదో మిగిలే ఉన్న్నదనిపిస్తుంది.. ..భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిదని ముందే చెప్పాను..దానిని ఆపటమో.. దోసిలితో పట్టటమో మనకు సాధ్యం కాదు..ఈ ఆర్టికల్ నా అనుభవంతో వ్రాసినది..దీనిలో తప్పులు దొర్లవచ్చు..నా ఆలోచన తప్పు ఐవుండ వచ్చు..దీనిలో మీకు పనికోచ్చినదాన్నే తీసుకోండని మనవి..ఏది ఏమైనా మిమ్మల్ని 
3 వారలు ఎదురు చూసేలా చేసినందుకు..క్షంతవ్యుడను..( ఒక మిత్రుడు వ్రాసాడు..సర్.. మీరు మీ బ్లాగ్ కి ట్రాఫిక్ పెంచుకోవడం కోసం మీరిలా ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారని వ్రాసారు..అదేం..లేదు సర్..కేవలం సమయం కుదరకే వ్రాయలేక పోయానని గమనించండి..)   

విజయోస్తు.. మీ ప్రతాప్.. 

Tuesday, September 20, 2011

సర్, మాకు ఇంగ్లిష్ రాదా?...... (పార్ట్-2)

మిత్రులారా

ఈ ప్రశ్న మీ హృదయంతరాలలో నిరంతరం రగులుతూనే ఉండాలి.తగు సమాధానం దొరికేంత వరకూ మీరు శోదిస్తూనే ఉండాలి.దొరికిన సమాధానం మీకు తృప్తిని కలిగిస్తే ఇకపై దాని అమలుకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలి.. ఆ ప్రణాళిక ఎలా ఉండాలంటే మీ సాధ్యసాధ్యలకు లోబడి ఉండాలి....


ఒక్కసారి కమిట్ ఐతే మీ మాట మీరే విననంతటి స్థాయిలో  ఉండాలి.మీ లక్ష్యాలను చిన్న చిన్న గా విభజించు కుంటూ పెద్ద స్థాయికి వెళ్ళాలి..

*మీ ప్రణాళిక ఒక Time Table లా ఉండకూడదు. అదే నండి.. 6.00 am To 7.00 am ఇంగ్లిష్ పేపర్ చదవాలి, 7.00 am To 8.00 am - ఇంగ్లిష్ గ్రామర్ చదవాలి..ఇలా వద్దండి..ఇది కేవలం స్కూల్స్ కి కాలేజస్ కి మాత్రమే పరిమితం..ఇలా ఎందుకు చెబుతున్నానంటే ..ఒకరోజు మీ ఇంటికి భందువులు వచ్చారనుకుందాం..వారితో పాటుగా ఉదయం 6-7 బయటకు వెళ్ళవలసి రావచ్చు..లేదా 7-8 మీకు స్పెషల్ క్లాసు ఉండవచ్చు..అలాంటప్పుడు ఏం జరుగు తుంది? ఆటోమాటిక్ గా ఈ రోజూ చేయవలసిన పని రేపటి 6-7 కి 7-8 కి వాయిదా వేయబడుతుంది... మిత్రులారా..ఇప్పటివరకు మనం సమయాన్ని వృధా చేసింది ఇలాగేగా..పైగా నా తప్పేమి ఉందని మన మనసుకు మనం సర్ది చెప్పుకుంటాం..

మీరు వినలేదా? PROCRASTINATION IS THE THIEF OF TIME...

*మరి మీ ప్రణాళిక ఎలా ఉండాలి..

మనకున్న 24 గంటలలో తప్పక చేయ వలసిన పనులకు కేటాయించవలసిన సమయాన్ని తీసి వేసి మిగిలిన సమయం ఆధారంగా ప్రణాళిక సిద్దం చేసుకోవాలి.

For Example

కళాశాల లేదా ఆఫీస్ లో గడపవలసిన సమయం(ఇది తప్పదు)........ 8 గంటలు
నిద్రకు కేటాయించ వలసిన సమయం (ఇది తప్పదు)......................  8 గంటలు
రెడీ అవటానికి పట్టే సమయం (దీనిని మీరు తగ్గించుకోవచ్చు)........... 1 గంట 
ఇతరములు (దీనిని మీరు తగ్గించుకోవచ్చు)..................................  1 గంట 
ఆఫీస్ పని లేదా అకడమిక్ సబ్జెక్ట్స్ చదువుట(దీనిని పెంచుకోవచ్చు). 3 గంటలు
TV/Computer..................................................................... 1 గంట
                                                                                           ---------------
                                                               మొత్తం .......            22 గంటలు 
                                                                                            --------------

24-22  = 02  కాబట్టి ఒక రోజులో రెండు గంటలు ఇంగ్లిష్ కి కేటాయించవచ్చు...ఆదివారాలు..శలవు దినాలలో ఈ 2 కి 8 గంటలు Add అవుతాయి..అప్పుడు మొత్తం 10 గంటలు..ఖంగారు వద్దు..ఈ 10 గంటలలో మీ ఇష్టానికి 4 గంటలు ఉపయోగించుకొని మిగిలిన 6 గంటలు ఇంగ్లిష్ కి కేటాయించండి..ఇలా మీరు working days లో 2 గంటలు (రోజులో మీకు ఎప్పుడు వీలయితే అప్పుడు) Holidays లో 6 గంటలు..(మీ అవకాశాన్ని బట్టి సమయం విభజించుకోండి) నేను 3 వ పార్టు లో చెప్పినట్లుగా సాధన చేయండి.... అప్పుడు మీకు ఇంగ్లిష్ మాత్రమే  కాదు....  ఏదైనా సుసాధ్యమే..


                                                                                                 
క్షమించాలి..సమయం కుదరక మీకు పూర్తి  LESSON ని అందించలేక పోతున్నాను..మీకు నిజంగా ఉపయోగ పడేది PART-3.. మాత్రమే..........

పార్ట్-3 ని త్వరలో మీముందుకు తీసుకు రాగలను....అప్పటివరకు క్షంతవ్యుడను....
                                                                                     విజయీభవ.......మీ....ప్రతాప్

                                                   

Sunday, September 11, 2011

సర్ ! మాకు ఇంగ్లిష్ రాదా?...(పార్ట్- 1)



ఈ ప్రశ్న మీరు ఎవరిని అడుగుతున్నారు?

దీనికి ఒకొక్కరు ఒకొక్క రకంగా సమాధానం చెబుతారు..

ఒకరంటారు..అబ్బో అది చాల తేలిక..కేవలం మూడు  నెలలోనే నేను నేర్చుకోగలిగాను..(ఇది అబద్దమే అయినా మరి మీరు అడిగినప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా)... అంతేనా..స్పోకెన్ ఇంగ్లిష్ సి.డి లు కొనుక్కో..... రోజూ  ఇంగ్లిష్ పేపర్ చదువు..ఇంగ్లిష్ సినిమాలు చూడు..ఇలా..వుంటుంది..

మరొకరు..ఇలా చెబుతారు...

అయ్యా....ఆయనెవరో..2 నెలలోనే ఇంగ్లిష్ అని బోర్డ్ పెడితే అక్కడకు..వెళ్లి 2000 వదిలిన్చుకున్నాను..ఈయనెవరో  1 నెలలోనే "ఇంగ్లిష్ ధైర్యం గా మాటలాడండి" అని  బోర్డ్ పెడితే ఇక్కడకు వచ్చాను.. సంవత్సరం క్రితం  భయంకరంగా ఒక పుస్తకం గురించి బాగా పబ్లిసిటీ ఇస్తే "24 గంటలలో ఇంగ్లిష్ నేర్చుకోండి" అనే ఈ పుస్తకం కొని సంవత్సరం నుండి (అంటే 24 ఇంటు 360) ప్రయత్నిస్తూనే ఉన్నాను.పిచ్చెక్కి పోతుంది తమ్ముడు..నాకైతే ఇంగ్లిష్ రాలేదు..

ఇలా ఇంగ్లిష్ వచ్చినవాడిని అడిగితె...ఒక సమాధానం..
ఇంగ్లిష్ రాని వాడిని అడిగితె ఒక సమాధానం..
నా లాంటి వచ్చీ, రాని వాడిని అడిగితె..మరో సమాధానం...

ఇలా మీరు అడుగుతూ పోయినంత కాలం..వచ్చిన సమాధానాలలో ఏది ఆచరణీయం అని ఆలోచిస్తూ సమయం గడిపినంతకాలం..ఒక భాషమాత్రమే కాదు..మనకేమీ రాదు..ఒక సెమినార్ ఇవ్వలేము..స్టేజి పైకి ఎక్కి పది నిముషాలు మాటలాడలేము...ఈ సమాజానికి పనికి వచ్చే ఒక్క మంచి పనిని చేయాలని ఉన్నా..చేయగల అవకాశాలున్నా..చేయలేము......అయ్యయ్యో  ..నేనెప్పుడు..ఇంతే , ఉన్నట్టు ఉండి వేరే టాపిక్ లోకి వెళ్ళిపోతాను..... అసలు విషయం ఇంగ్లిష్ గురించి కదా..

ఇంగ్లిష్ ఎలా వస్తుందో చూద్దాం..

ఈత ఎలా వేయాలో నేను చెబుతాను...కాళ్ళు,చేతులు ఆడించాలనో, నీటిని మన రెండు చేతులతో మన ఉదర భాగం క్రిందకు నెడుతూ మనం పైకి తేలేలా  ప్రయత్నిన్చాలనో.. ..ఇలా చాలానే చెబుతాను..మీరు చక్కగా వింటారు..అయినా మీకు ఈత వస్తుందా..రాదు కదా..

మరీ ఎప్పుడు వస్తుంది?

* ముందు నీటిలోకి దిగాలి...
*లోతు లేని ప్రాంతంలో ప్రయత్నించాలి..
*ఆపై మెడలోతు నీటిలో మరో వ్యక్తిని ఆసరాగా చేసుకొని ప్రయత్నిస్తూ ఉండాలి..
అప్పుడు మాత్రమే కదా ఈత వస్తుంది...
సరే మరో విషయం చూద్దాం..

ఇప్పటికే మీరు సైకిల్ త్రోక్కడం నేర్చుకుని ఉంటారు..ఒక్కసారి ప్లాష్ బాక్ లోకి వెళ్ళండి..
అసలక్కడ థీరీ క్లాసే ఉండదు..డైరెక్ట్ గా ప్రాక్తికల్సే ..ఒక్కసారైనా పడకుండా..కనీసం ఖంగారైనా  పడ కుండా నీవు సైకిల్ నేర్చుకోగాలిగావా?.. కాకపోతే ..అక్కడ, అన్నయ్యో, అక్కయ్యో, నాన్నో..ఆసరాగా ఉండి ఉంటారు......ఇక్కడ ----- అలాంటి ఆసరా ఓ టీచర్ ద్వారా దొరుకుతుంది..ఆ ఆసరాతో మీకై మీరే ప్రయత్నించి ముందుకు వెళ్లాలే  తప్ప..కటినమైన మీ ప్రయత్నం  లేకుండా ..మీరేమి సాధించలేరు..ఇలా ఎన్నైనా చెప్పవచ్చు గానీ..అసలు విషయం మరుగున పడుతుంది.......

 ఆ అసలు విషయాలు..నా  నుండి మీకు లభించే ఆసరా (ఎలా చదివితే ఇంగ్లిష్ వస్తుంది? అనే విషయాలు)
నా తదుపరి పోస్ట్ లో చూడండి.. 2,3 రోజులలో పార్ట్-2 వ్రాయగలను.. అప్పటివరకు..సెలవు..
మీ ప్రతాప్ మాస్టర్..శుభాశీస్సులు..

Friday, September 9, 2011

ఇంగ్లిష్ మాటలాడటం ఎలా నేర్చుకుందాం?



  • మనము ఇంగ్లిష్ లో వాక్యాలు వ్రాయడం వేరు..మాటలాడటం వేరు. వ్రాసేటప్పుడు గ్రామర్ గుర్తుకు తెచ్చుకునే అవకాశం ఉంటుంది గాని మాట్లాడేటప్పుడు గ్రామర్ రూల్స్ మనం పాటిస్తున్నమా లేదా..ఒకవేళ తప్పు మాట్లాడుతున్నమేమో అని అలోచిన్చినంతకాలం..మనకు ఇంగ్లిష్ రాదు.తప్పు అయినా ఒప్పు అయినా మనము మాట్లాడాలి..అంతే..ఇందుకోసం మనము ఇంగ్లిష్ వాక్యాలను కంటస్థం చేసి వాటిని ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చుని బాగా ప్రాక్టీసు చేయాలి..ఇందుకోసం మీకు శ్రీ ఎర్రా సత్యనారాయణ గారు వ్రాసిన స్పోకెన్ ఇంగ్లిష్ పుస్తకాలూ బాగా ఉపయోగ పడతాయి..ఇప్పుడు మనం వారి బుక్స్ నుండే కొన్ని  వాక్యాలను చూద్దాం..వాటిని మీరు కంటస్థం చేసి ముందు ప్రయోగించండి...మీకు నచ్చితే వారి బుక్స్ కొనుగోలు చేయండి..నోరు విప్పకుండా ఇంగ్లిష్ భాష రావటమనేది వంద శాతము కుదరదు.

  • Be a man........మనిషి వలె ఉండు 
  • Be an angel.....దేవత వలె ఉండు
  • Be alert......అప్రమత్తంగా ఉండు 
  • Be at my house today...ఈరోజు మా ఇంటివద్ద ఉండు
  • Be at peace...శాంతంగా యుండు 
  • Be attentive....శ్రద్దగా ఉండు
  • Be back by 6 o'clock.....ఆరు గంటలకల్లా తిరిగిరా 
  • Be brave...ధ్యైర్యం గా ఉండు
  • Be calm..... నిశ్శబ్దంగా యుండు 
  • Be careful in future....భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండు
  • Be careful what you say...నీవు ఏమి చెబుతున్నవో జాగ్రత్త.
  • Be careful when you are crossing the road...వీధి దాటుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండు.
  • Be careful with it...దానితో జాగ్రత్తగా ఉండు.
  • Be cheerful...ఉల్లాసం గా ఉండు
  • Be gentle when you brush the baby's hair...పాప జుట్టు దువ్వు/రుద్దు తున్నప్పుడు సున్నితంగా ఉండు.
  • Be here at 4 o'clock without fail..నాలుగు గంటలకు తప్పక ఇక్కడ ఉండు.
  • Be in your limits... నీ హద్దులలో నీవు వుండు.
  • Be polite with elders... పెద్దలతో మర్యాదగా ఉండు.
  • Be proud being an Indian...భారతీయుదవైనందుకు గర్వించు.
  • Be ready by that time... ఆ సమయానికి సిద్దంగా ఉండు.
  • Be strict with my children.....మా పిల్లల విషయంలో కటినంగా వుండు.
  • Be waiting for him when he returns.... అతడు వచ్చేవరకు వేచి ఉండు.
  • Be wise.... తెలివిగా వుండు.
  • Be prepare for anything.....దేనికైనా సంసిద్దంగా వుండు..
  • TAKE CARE AND HAVE A NICE DAY...BYE...PRATAP

Wednesday, September 7, 2011

5 ముఖ్య విషయాలు



  1. THE DICTIONARY HABIT..... Buy a small dictionary. Always keep it by you. When you come across a word the meaning of which you do not know, look it up in the dictionary. If you are not sure about the spelling of a word, look it up in the dictionary.
  2. THE NOTE-BOOK HABIT..... Keep a little note-book in your pocket or in your bag. Put down in it the things you wish to remember, and the words you are apt to spell wrongly. Draw in it little sketches of the things you study, such as flowers, insects, or trees.
  3. THE REVISION HABIT..... Revision means re-vision, or looking again at a thing. After you have written anything, always read it through again carefully to see that there is no mistake.
  4. THE CORRECTION HABIT.....When you find anything wrong in what you have written, cross it out boldly and write above it the correct form.
  5. THE QUESTIONING HABIT....If you don't know, ask. Ask your teacher,your father,your mother, your friend, or indeed anybody who is older or wiser than yourself. Ask yourself questions too, and find out the answers for yourself if you can. If you cannot, ask somebody else.

Sunday, September 4, 2011

MYSELF



I am a TALL GIRL for my age. My hair is FAIR and my eyes are BLUE. I know my mother LIKES me because she calls me her PET. Father sometimes SCOLDS me and says I am SILLY. I have TWO brothers and THREE sisters, ALL OLDER than I. We live in a LITTLE house in THE COUNTRY.

Now write the same sort of thing about yourself. To make the description true,use some of these words instead of some of the words in CAPITALS/ROSE IN COLOUR

SHORT              BROWN         DARLING         YOUNGER
AVERAGE         RED               UNCLE             BIG
BOY                  GREY             PRAISES         ROOMS
DARK                DISLIKES       CLEVER          TOWN

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates