ఇది lesson-3 కి కొనసాగింపు-
ఒక వాక్యంలో కర్త,క్రియ కర్మ- కాక అదనంగా కొన్ని మాటలు అవసరాన్ని బట్టి పెరుగుతుంటాయి. కర్త,క్రియ,కర్మ వరుసగా వస్తూ అదనంగా వచ్చే పదాలను వాక్యం లో ఎలా చేర్చాలి? ఈ విషయం తెలుసుకోవడానికి ముందు మనము కొన్ని ప్రాధమిక అంశాలను నేర్చుకోవాల్సి ఉంటుంది.
చిన్న వాక్యం పెద్దగా మారాలంటే వాక్యము లోని చిన్న విషయాన్ని మన మట్టుకు మనమే ప్రశ్నించు కుంటూ పొతే అర్ధవంతంగా వాక్యం పెరుగుతుంది.
అలా ఎందుకు? ఏదైనా పెద్ద వాక్యం తీసుకుని మనము ఇంగ్లిష్ లోకి మార్చటానికి ప్రయత్నించ వచ్చుకదా? అని అడగాలని ఉన్నదా?
అలా చేస్తే మనకు కాన్సెప్ట్ సరిగా అర్థం కాదు మిత్రమా-
నీ వాక్యానికి నీవే సృష్టి కర్తవు ఐతే నీ మస్తిష్కంలో అది సుస్తిరమై నిలుస్తుంది.
సరే
నేను వెళ్ళాను...... అనే వాక్యం ఎలా పెద్దది గా చేయవచ్చో చూద్దామా?!
- ఎక్కడకు వెళ్లావు?
- ఎప్పుడు వెళ్లావు?
- ఎలా వెళ్లావు?
- ఎందుకు వెళ్లావు?
- ఎవరితో వెళ్లావు?
" నేను సైన్సు ఎగ్జిబిషన్ చూడడానికి నిన్న సాయంత్రం ఐదు గంటలకు బస్సులో నా నేస్తం తో కలసి గుంటూరు వెళ్ళాను."
దీనిని ఇంగ్లిష్ లోకి మార్చాలి. ముందే మీకు చెప్పాను- -(నాగురించి చదివారా?) నాకూ ఇంగ్లిష్ రాదు. కలసి నేర్చుకుందాం . . అని-
కొన్ని ప్రాధమిక అంశాలు నేర్చుకున్న తరువాత దానిని మీరే మార్చి నాకు చెబుదురుగాని. సరేనా?! ----