ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Thursday, March 31, 2011

ముఖ్యమైన సూత్రం -Lesson-3(Cont.)


 ఇది lesson-3 కి కొనసాగింపు-

     ఒక వాక్యంలో కర్త,క్రియ కర్మ- కాక అదనంగా కొన్ని మాటలు అవసరాన్ని బట్టి పెరుగుతుంటాయి. కర్త,క్రియ,కర్మ  వరుసగా వస్తూ అదనంగా వచ్చే పదాలను వాక్యం లో ఎలా చేర్చాలి? ఈ విషయం తెలుసుకోవడానికి ముందు మనము కొన్ని ప్రాధమిక అంశాలను నేర్చుకోవాల్సి ఉంటుంది.

     చిన్న వాక్యం పెద్దగా మారాలంటే వాక్యము లోని చిన్న విషయాన్ని మన మట్టుకు మనమే ప్రశ్నించు కుంటూ పొతే అర్ధవంతంగా వాక్యం పెరుగుతుంది.
అలా ఎందుకు? ఏదైనా పెద్ద వాక్యం తీసుకుని మనము ఇంగ్లిష్ లోకి మార్చటానికి ప్రయత్నించ వచ్చుకదా? అని అడగాలని ఉన్నదా?
     అలా చేస్తే మనకు కాన్సెప్ట్ సరిగా అర్థం కాదు మిత్రమా-

     నీ వాక్యానికి నీవే సృష్టి కర్తవు ఐతే నీ మస్తిష్కంలో అది సుస్తిరమై నిలుస్తుంది.

     సరే
            నేను వెళ్ళాను...... అనే వాక్యం ఎలా పెద్దది గా చేయవచ్చో చూద్దామా?!

  •              ఎక్కడకు వెళ్లావు?
  •              ఎప్పుడు వెళ్లావు?
  •              ఎలా వెళ్లావు?
  •              ఎందుకు వెళ్లావు?
  •              ఎవరితో వెళ్లావు?
                                      సమాధానం చూద్దాం----

                        " నేను  సైన్సు ఎగ్జిబిషన్ చూడడానికి నిన్న సాయంత్రం ఐదు గంటలకు బస్సులో నా నేస్తం తో కలసి  గుంటూరు వెళ్ళాను."

                 దీనిని ఇంగ్లిష్ లోకి మార్చాలి. ముందే మీకు చెప్పాను- -(నాగురించి చదివారా?) నాకూ ఇంగ్లిష్ రాదు. కలసి నేర్చుకుందాం . . అని-
కొన్ని ప్రాధమిక అంశాలు నేర్చుకున్న తరువాత దానిని మీరే మార్చి నాకు చెబుదురుగాని. సరేనా?! ---- (lesson-3 సమాప్తం)

Tuesday, March 29, 2011

కర్త-కర్మ-క్రియ -Lesson-3


ORDER OF WORDS

తెలుగులో  కర్త-కర్మ-క్రియ వరుసగా వస్తాయి......S+O+V
ఇంగ్లీష్ లో  కర్త-క్రియ-కర్మ వరుసగా వస్తాయి......S+V+O

రాముడు   రావణుని   చంపెను.
   S      +    O      +    V

RAMA     KILLED    RAVANA
   S      +       V     +      O

S=SUBJECT, V=VERB, O=OBJECT

వాక్యములో కర్త,కర్మ,క్రియ ... గుర్తించే విధానము.
      
          1. ముందుగా క్రియను గుర్తించాలి. (పనిని తెలిపేది క్రియ (VERB))
           
          2. క్రియకు ఎవరు? ఏది? అని చేర్చి ప్రశ్నిస్తే వచ్చే సమాధానము SUBJECT.
                       ఎవడు,ఎవరు, (WHO) ...మనుష్యులకు..
                       ఏది (WHAT,WHICH)....జంతువులకు,వస్తువులకు..

          3. క్రియకు ఎవరిని? దేనిని? అని చేర్చి ప్రశ్నిస్తే వచ్చే సమాధానము OBJECT
                        ఎవరిని  (WHOM)...మనుష్యులకు
                        వేనిని,దేనిని (WHAT)...జంతువులకు,వస్తువులకు..

*** SUBJECT లేని వాక్యం ఉండవచ్చు
      OBJECT లేని వాక్యము ఉండవచ్చు
      కానీ VERB లేని వాక్యము ఉండదు.
      (ఇక్కడ వితండ వాదం వద్దు. నీవు కంటితో రమ్మని సైగ చేసినా దానిలో అంతర్లీనంగా
            VERB ఉన్నది) 

                                                                         (మిత్రమా మళ్లీ కలుద్దాం)

Monday, March 28, 2011

ముఖ్యమైన పది సూత్రాలు-



  1. ధృడమైన నిర్ణయం తీసుకో-
  2. పదజాలం (vocabulary) ని రోజు రోజుకి  డెవలప్ చేసుకో--
  3. ఈత గురించి basics నేర్చుకున్నంత మాత్రాన ఈత రాదు.నీళ్ళలో ధైర్యం గా దూకి ఈదులాడితేనే ఈత వస్తుంది.ఇంగ్లిష్ అయినా అంతే-
  4. ఇంగ్లిష్ వార్తా పత్రికలు చదవడం- ఇంగ్లిష్ న్యూస్ వినడం-ఇంగ్లిష్ సినిమాలు చూడడం చేయాలి.
  5. భయము-బిడియము లేకుండా ఫ్రెండ్స్ తో తప్పు అయినా,ఒప్పు అయినా -ఇంగ్లిష్ లోనే మాట్లాడాలి.
  6. మనము చేసిన తప్పులను గమనించి మరలా ఆ తప్పులు చేయకుండా చూసుకోవాలి.
  7. ముఖ్యమైన phrases, idioms అర్థం చేసుకుని కంటస్థం చేయాలి.
  8. ప్రాధమిక అంశాలు నేర్చుకోకుండా ఇంగ్లిష్ నేర్చుకోవలనుకోవడం అవివేకం.
  9. నేర్చుకున్న ప్రతి అంశాన్ని ఉపయోగించాలి.
  10. ఇంగ్లిష్ తప్పక నేర్చుకోవాలనే positive thinking లోనే ఎప్పుడూ ఉండాలి. 

Sunday, March 27, 2011

రేపు అనగా 28-3-11 న జరగా బోయే 10 వ తరగతి paper-1 కి ముఖ్యమైన comprehension

రేపు అనగా 28-3-11 న జరగా బోయే 10 వ తరగతి paper-1 కి ముఖ్యమైన comprehension

10 వ తరగతి ముఖ్యమైన Prepositions ని విని నేర్చుకోండి.

(ఇప్పుడు మీరు వినబోయే 10 వ తరగతి ఇంగ్లీష్ మెటి రియల్ గుంటూరు జిల్లా DEO గారు గౌరవనీయులు 
శ్రీమతి పి.పార్వతి గారి పర్య వేక్షణలో మా టీచర్స్ చే రూపొందించబడినవి)

పదవ తరగతి - వ్యతిరేక పదాలు విని నేర్చుకోండి.

opposites

ప్రపంచం లో ఇంగ్లిష్ యొక్క ప్రాధాన్యత (షుమారుగా)



  • 350 కోట్ల ప్రజలు ఇంగ్లిష్ లో మాట్లాడగలరు.
  • 263 కోట్ల ప్రజల మాతృభాష ఇంగ్లిష్.
  • 14% ప్రజలకు ఇంగ్లిష్ వచ్చు.
  • 55% వార్తా పత్రికలు ఇంగ్లిష్ లో ఉన్నాయి.
  • 63% రేడియో , టి.వి.స్టేషన్లు ఇంగ్లిష్ లో ప్రసారం చేస్తున్నాయి.
  • 76% ఉత్తర ప్రత్యుత్తరాలు ఇంగ్లిష్ లో జరుగుచున్నాయి.
  • ఇంగ్లిష్ మన దేశం లో లైబ్రరీ భాషగా ఉన్నది.
  • ఇంగ్లిష్ అంతర్జీతీయ భాష.(link language)
  • జవహర్ లాల్ నెహ్రు - 1961 లో అన్నట్లు "శాస్త్ర సాంకేతిక , మానవ-సామజిక శాస్త్రాలకు సంభందించిన అపారమైన విజ్ఞాన ధనగారాలను తెరచుటకు ఇంగ్లిష్ ఒక తాళం చెవి"
{అలాగని తెలుగు ని తక్కువ చేయడం కాదు.తెలుగు మనకు అమ్మ. ఇంగ్లిష్ మన నేస్తం.-- ఎవరి గొప్పతనం వారిదే కదా-}

Friday, March 25, 2011

THE కథ




THE ని ------" ది" గా  పలకాలా?
                   "ద"  గా పలకాల?
                    రెండూ కాకుండా "దీ" గా పలకాలా?

3 సందర్భాలలో మూడూ రైటే........

                    అచ్చు ధ్వని ముందు "ది"
                                                         The Auto...... ది ఆటో 

                    హల్లు ధ్వని ముందు  "ద" 
                                                         The King.... ద కింగ్ 

 ఫలానా అని అర్ధం వస్తే  "దీ"
                                        This is the boy.... దిస్ ఈజ్ దీ బాయ్ 

{ ఐనా మీరు వీటిని అంతగా పట్టించు కోవలసిన అవసరం లేదు. కానీ subject ని ఎంజాయ్ చేయండి. తెలుసుకునే కొద్దీ బాగుంటుంది కదా}

Thursday, March 24, 2011

ఒత్తులున్న అక్షరాలు


మిత్రులారా
                      { నెట్ బ్రౌస్ చేసేవారు 99% ఇంగ్లిష్ చదవడం - వ్రాయడం ధారాళంగా వచ్చిన వారె ఐవుంటారు.
ప్రత్యక్ష భోధనలో ఎవరికి ఏమి వచ్చో దానిని వదిలివేసి రానిదానిని ప్రస్తావిస్తాం.కానీ ఇలా పరోక్షం గా ఐతే మనం ఆ 1% విద్యార్దులను కూడా దృష్టిలో ఉంచు కోవాలి గదండి. దయచేసి మీరు బోర్ ఫీల్ ఐతే అసలు lessons కోసం కొద్దిరోజులు వేచి వుండండి. please.......
         నేను ముఖ్యం గా తెలుగు టైపు చేయడానికి కాస్త ఇబ్బందే పడుతున్నాను. ఐనా మన తమ్ముళ్ళ కోసం 
చెల్లాయిల కోసం ఒక సమగ్రమైన వివరణ ఇవ్వాలనేది నా ఉద్దేశ్యం.మన బ్లాగ్ ని ఎక్కువ మందే చూస్తున్నారు. కానీ తక్కువ మంది followers  గా వున్నారు. చూసారుగా..నిజానికి sign in  అవ్వక పోయిన మన బ్లాగ్ ఓపెన్ అవుతుంది. కానీ మీరు sign in ఐతే  క్రొత్త పోస్ట్ పబ్లిష్ ఐనప్పుడు మీకు మెయిల్ ద్వారా తెలియజేయ డానికి వీలు ఔతుంది. మిత్రులారా నేను మీ ప్రోత్సాహాన్ని కోరుకుంటున్నాను. మరి ఇస్తారుగా-----}
                                                                
                                                          **********************
                  ఎలా వ్రాయాలో తెలిస్తే ---ఎలా పలకాలో కూడా తెలుస్తుంది...........
                                                                     ............................................


  1. ల్ల     = ల్ +ల్+అ      = lla
  2. బ్న   = బ్+న్=అ       = bna 
  3. త్స్న  = త్+స్+న్ +అ  =thsna 
  4. రావు  = ర్+ఆ +ఓ      = rao 
  5. కుమార్ -------------- = kumar 
  6. యాదవ్ -------------- = yadav 
  7. రెడ్డి = ర్+ఎ +డ్+డ్+ఇ  = reddy
  8. య్య ----------------   = iah/yya
  9. మ్మ= మ్+మ్+అ        = mma 
  10. నిండుసున్న కథ  
                    మున్నంగి = munna mgi
                    గుంటూరు = guntur

                   సున్నా పలికేటప్పుడు పెదవులు మూసుకుపోతే "M" ని 
                                                పెదవులు మూసుకోనక పోతే  "N" ని   వ్రాయాలి.
             EX:- went, remember

                                                         (సశేషం)




Wednesday, March 23, 2011

10 వ తరగతి విద్యార్థులకు సూచనలు.

రేపు అనగా 24-3-11 ప్రారంభమయ్యే 10 వ తరగతి విద్యార్ధుల కోసం.

  1. ప్రతి రోజు రాత్రిపూట 10 గంటల దాక చదవండి.
  2. తెల్లవారు ఝామున  4.30 లకు నిద్రలేవండి.
  3. మనసులో ఆందోళన లేక ప్రశాంతం గా వుండండి.
  4. ఎట్టి పరిస్థితులలోను రాత్రి పూట నిద్రాభంగం కానివ్వకండి.
  5. ఉదయం 4.30 to 6.30 వరకూ చదవండి.
  6. ఒక అరగంట విశ్రాంతి తీసుకోండి.
  7. అరగంట కాల కృత్యాలకు, స్నానానికి కేటాయించండి.
  8. తర్వాత పుస్తకం (main poits) తిరగెయ్యండి
  9. పౌష్టికాహారం లైట్ గా తీసుకోండి.
  10. ఉదయం 8.30 కల్లా దూరం వారు, 8.45 కల్లా దగ్గర వారు పరీక్షకు బయలుదేరండి.
  11. 8.50 కల్లా school లో ఉండండి.
  12. ప్రశాంతం గా పరీక్ష హాలు లోకి వెళ్ళండి.
  13. ఉపాద్యాయులు చెప్పే సూచనలు గమనించండి.
  14. జవాబు పత్రం ఇవ్వగానే దానికి మార్జిన్లు కొట్టండి.
  15. ప్రశ్నాపత్రం క్షుణ్ణంగా చదవండి.
  16. బాగా వచ్చిన ప్రశ్నలు ముందుగా వ్రాయండి.
  17. తప్పులు,కొట్టివేతలు లేకుండా వ్రాయండి.
  18. రాసేటప్పుడు,ప్రశ్న నెంబరు,సెక్షన్ రాయండి.
  19. జవాబు అవ్వగానే గీత కొట్టండి.
  20. మరొక ప్రశ్నకు ఉపక్రమించండి.
  21. ముందు అన్ని తెలిసిన ప్రశ్నలు తప్పులు లేకుండా వ్రాయండి.
  22. చివరకు,తెలియని ప్రశ్నలు , ఛాయస్  ట్రై చేయండి.
  23. గుర్తు రాకపోతే తలని ఎడమ వైపు త్రిప్పి ఆలోచించండి.
  24. చివరి 15 నిముషాలు వ్రాసిన పేపర్ ని ఒకసారి పరిశీలించండి.
  25. తప్పులు,ప్రశ్న నెంబర్లు సరి చూడండి.
  26. బిట్ పేపర్ ఇవ్వగానే దారం తో కట్టండి.
  27. ముందు తెలిసినవి వ్రాసి, చివరగా ఆలోచించి అసలు ఏది వదలకుండా పూర్తి చేయండి.
  28. వార్నింగ్ బెల్ కొట్టినా లేవకండి. అన్ని పరిశీలించాక తృప్తి గా బయటకు రండి.
  29. జరిగిన పరీక్షలలో పొరబాటున ఏదైనా తప్పు రాస్తే దానినే పట్టుకుని వేళ్ళాడకండి..
  30. నేరు గా ఇంటికి వెళ్లి లంచ్ చేసి,ఒక గంట నిద్రించండి.
  31. తరువాత రెండు గంటల వ్యవధిలో మధ్య మధ్య లో 15 నిముషాలు గ్యాప్ ఇస్తూ చదవండి.
  32. బొమ్మలు,మ్యాప్ , గ్రాఫ్ పేపర్ మీద పెన్ ఉపయోగించకండి.
  33. బుద్దిమంతులుగా మసలండి.కాపీ అనే ఆలోచన మనసులోకి రానీయకండి.
  34. చక్కని విజయాన్ని అందుకుని - అమ్మ,నాన్న,మీ టీచర్స్ ని సంతోష పెట్టండి.
  35. ఆల్ ది బెస్ట్.
                                                          -- - - - - -     శ్రీ  పి.టి.అవధాని
                                                                               Z.P.H.S-PEDARAVURU
                                             
http://www.PaisaLive.com/register.asp?1910637-2657777 

Monday, March 21, 2011

అక్షరాలు-శబ్దాలు(LESSON-2)


మిత్రులారా- ఇది Lesson-1 కి కొనసాగిపు 
lesson-1 ఒక సారి చదివి ఇది చదవండి.
(అలాగే ముందుమాటని అప్పుడప్పుడు చదువుతుందండి.)

C కి 'క' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
        'C' కి ముందుగాని,వెనుక గాని "A,O,U,R" వచ్చినప్పుడు.
                  EX.......... CAP, COT, CUT, FACT, LUCK

C కి 'స' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
        'C' కి ముందుగాని,వెనుక గాని "E, I, Y"   వచ్చినప్పుడు.
                 EX...........CENT, CITY

C కి 'ష' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
         'C' కి ముందుగాని,వెనుక గాని "ea. ia" వచ్చినప్పుడు
                 EX..........OCEAN, SOCIAL

(వీటిలోను కొన్ని మినహా ఇంపులు వుంటాయి.మీరు మరీ అంత లోతు గ విశ్లేషణ చేయవద్దు)
                                                    

'G' కి 'జ ' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
        'G' కి ముందుగాని,వెనుక గాని "E, Y"  వచ్చినప్పుడు.
                  EX.......... GENTLE, GYMNASTICS

'G' కి 'గ ' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
        'G' కి ముందుగాని,వెనుక గాని "A,I,O,U,L,N,R" వచ్చినప్పుడు.
                 EX...........GATE, GIFT, GOLD, GUARD, GLORY, MAGNET, GREAT

                                                        

' T ' కి 'చ  ' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
        ' T ' కి ముందుగాని,వెనుక గాని "U"   వచ్చినప్పుడు.
                  EX.......... NATURE, FUTURE
' T ' కి 'ష  ' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
        ' T ' కి ముందుగాని,వెనుక గాని "IA,IO" వచ్చినప్పుడు.
                 EX...........INERTIA, NATION

                                                       

' S ' కి 'ష   ' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
        'S ' కి ముందుగాని,వెనుక గాని "U"   వచ్చినప్పుడు.
                  EX.......... SURE, ASSURANCE 
' S ' కి 'జ ' (క్షమించండి ఇక్కడఉచ్చారణ 'జ' కాదు.దానికి సరైన అక్షరం అందుబాటులో లేదు) ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
        ' S ' కి ముందుగాని,వెనుక గాని "I, Y" వచ్చినప్పుడు.
                 EX...........RISE, WISE, WAYS, LAWS

Friday, March 18, 2011

10 వ తరగతి ఇంగ్లిష్ ముఖ్యమైన ప్రశ్నలు


ఈనెల 24 న ప్రారంభం కాబోయే 10 వ తరగతి తెలుగు మీడియం విద్యార్ధులకు- ఇంగ్లిష్ పేపర్-1 ముఖ్యమైన ప్రశ్నలు 

IMPORTANT QUESTION LIST FOR PAPER-1

1) How did the god punish the king? How as it appropriate for the king?
    దేవుడు ఆ రాజును ఏవిధముగా శిక్షించాడు ? ఆ శిక్ష ఆ రాజు కు తగిన శిక్ష ఎందువలన?

2) What did the king learn in the forest?
     అడవి లో రాజు ఏమి నేర్చుకున్నాడు.(ఎలాంటి మార్పు వచ్చింది)?

3) What made Polya want to read and write?
    పోల్య ని చదువుకు దగ్గర చేసిన అంశమేది?

4) What is the moral of the lesson "Polya"?
     పోల్య lesson లోనే నీతి ఏమి?

5) Why did Polya burst into tears after reading the suspicious letter?
    అనుమానాస్పద ఉత్తరాన్ని చదివిన తరువాత పోల్య ఎందుకు ఏడ్చింది?

6) What does the Chipko movement teach the people?
    చిప్కో ఉద్యమం ప్రజలకు ఏమి నేర్పుతున్నది?

7) What are the three answers shown by Bahuguna to avoid deforestation?
    అడవుల  నరికివేతను నిలిపి వేయడానికి బహుగుణ సూచించిన మూడు పరిష్కారాలు ఏవి?

8) Why did the manager think that the narrator worked for Pinkerton's detective agency?
     pikerton agency కి, మన కధకుడికి సంబంధం వున్నదని manager ఎందుకు భావించాడు?

9) What was the last mistake committed by the narrator before leaving the bank?
     బ్యాంకు నుండి బయటకు వెళ్ళడానికి ముందు మన కధకుడు చేసిన చివరి తప్పు ఏమిటి?

10) How were Blandford and Hollis Meynell going to recognise each other?
      ఇద్దరు ఒకరిని ఒకరు ఎలా గుర్తించ బోతున్నారు?

11) In the lesson 'A test of true love' who was being tested? How did he pass the test?
      ఈ lesson లో ఎవరు పరీక్షింప బడ్డారు? అతను ఆ పరీక్షలో ఏ విధంగా నెగ్గాడు?

12) Why was there so much excitement when Tutenkhamen's tomb was discovered?
       సమాధి ని కనుగొన్నప్పుడు ఎందుకు ఎంతో ఉత్సుకతతో కూడిన ఉద్వేగ వాతావరణము ఏర్పడింది?

13) What was the curse of Tutenkhamen?
      Tutenkhamen శాపం ఏది?

14) What is the message of Sudha Chandran to the people?
       ప్రజలకు సుధా ఇస్తున్న సందేశం ఏమిటి?

15) What was the uncrushable spirit Sudha had shown in winning over her fate and dancing again?
      విధిని గెలిచి, మళ్లీ నాట్యం చేయడానికి సుధాచంద్రన్ చూపిన ఆ అపజయమేరుగని స్పూర్తి ఏమిటి?

16) What is the similarity between Helen Keller and Sudha Chandran?
       సుధాచంద్రన్ కు,హేల్లెన్ కెల్లెర్ కి మధ్య ఉన్న పోలిక ఏమిటి?

17) In what way was the narrator's Christmas Meeting similar to Francis Randel's?
       వీరిద్దరి క్రిస్మస్ మీటింగుల మధ్య గల సరుప్యామేమిటి?

18) What is the moral of the lesson 'Dog is man's best friend'?
      ఈ lesson లోని నీతి ఏమిటి?

19) Who were Abha and Manu? Why did Gandhiji call them 'My walking-sticks'?
      అభ మరియు మను ఎవరు? వారిని గాంధీజీ 'తన ఉతకర్రలు' అని ఎందుకు అన్నారు?

20) What did Gandhiji's last meal consist of?
       గాంధీ గారి చివరి భోజనంలో ఆహార పదార్ధాలు ఏవి?

Wednesday, March 16, 2011

అక్షరాలు-శబ్దాలు--LESSON-1

నమస్కారములు-
            
 ఇప్పటి వరకు మనం రెండు అంశాలను స్పృశి యించాము.
                              
                               1......ముదుమాట
                               2......నాలుగు నైపుణ్యాలు.

ఈరోజు నాలుగు నైపుణ్యాలు లో ఒకటైన్ READING గురించి తెలుసుకుందాం.
మీకు అక్షరాలు రావని కాదు. మనదగ్గర ఒక COMPLETE NOTES వుంటే .. మీ పిల్లలకు,తమ్ముళ్ళకు, చెల్లాయిలకు 
ఉపయోయపడుతుంది కదా...


అక్షరాలు(Alphabet).........................26 ....ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
అచ్చులు(Vowels)...........................05.....A E I O U
హల్లులు(Consonants).....................21..B C D F G H J K L M N P Q R S T V W X Y Z
ఉభాయక్షరాలు(Semi-Vowels)...........02 ....W Y
     

                             ఇంగ్లిష్ చదవడం ఈ సరికే నీవు నేర్చుకొని ఉంటావు. కాని కొన్ని విషయాలు గమనినించు.

@     అచ్చు లేకుండా హల్లు ఏర్పడదు.

@     అచ్చు గానీ- అచ్చు శబ్దం గానీ లేకుండా పదమే వుండదు.
                                                    
                                                              

                                                             అచ్చు శబ్దాలు (షుమారుగా)

                          
                                                         A ------------------------>   అ,  ఆ 
                                                         E ------------------------>   ఎ, ఏ, ఈ 
                                                         I  ------------------------->  ఇ, ఈ
                                                         O ------------------------>   ఒ, ఓ, ఔ 
                                                         U  ------------------------>  ఉ, ఊ 

హల్లు  శబ్దాలు (షుమారుగా)

యివన్నీ 'అ' కారాలు ....అదే  B=బ్,   J=జ్,   L=ల్

                                   కాని కొన్ని మినహాయిపులున్నాయి....
                                  
                    C,G,T,S అక్షరాల  రూటే వేరు... (వీటికి 2,3 శబ్దాలు వుంటాయి)
                                       వీటిని తదుపరి LESSON లో చూద్దాం
                                                                                
                                                                                   (సశేషం)


Tuesday, March 15, 2011

నాలుగు నైపుణ్యాలు-

4 నైపుణ్యాలు( 4 skills )

ఇంగ్లీష్ 
          చదవడం  ద్వారా 
          వ్రాయడం ద్వారా
          వినడం ద్వారా
          మాట్లాడం (ద్వారా) నేర్చుకో......ఇవే  4 స్కిల్స్.
          
          రీడింగ్,రైటింగ్,లిషనింగ్,స్పీకింగ్ (Reading,Writing,Listening,Speaking)
        
        (దయచేసి తేదీల ఆధారం గా చదవండి)
-----------------------------------------------------------------------


Monday, March 14, 2011

ముందు మాట

డియర్ ఫ్రెండ్స్


ఎక్కువ మాటలు అనవసరం.చెప్పాల్సింది సింపుల్ గా మనసుకు హత్తుకునేలా చెప్తూ 'ENGLISH' లోని అసలు మర్మాలు చెప్పడమే ఈ బ్లాగ్ ఉద్దేశ్యం.

ముందు ఇది తెలుసుకోండి, ఇంగ్లీష్ గ్రామర్ వచ్చినంతనే ENGLISH లో మాట్లాడలేరు. ENGLISH మాట్లాడే వారందరికి గ్రామర్ వచ్చని అర్ధం కాదు.
అసలు నీకు TELUGU గ్రామర్ ఎంత వచ్చని నీవు తెలుగు అంత అనర్ఘళంగా మాట్లాడుతున్నావు? నీవు చిన్నప్పుడు మాట్లాడుతూ చేసే తప్పులను 
సరి చేసి అమ్మ,నాన్న,ఇరుగు-పొరుగు, నీకు తెలియకుండానే 'తెలుగు' బేసిక్స్ చెప్తున్నారన్నమాట.

ఆపై నీకు నువ్వే నీ పరిసరాలనుండి, నీ అవసరాల నుండి ఎన్నోన్నో పదాలను- ఆపై వాక్యాలను నేర్చి ఈ దశకు వచ్చావు. అందుకే ముందుగా నేను చెప్పే ప్రాధమిక అంశాలను మనసు పెట్టి తెలుసుకో.{ ఇవి అన్ని నీవు  గ్రామర్ పుస్తకాలలో చదివినవే కావచ్చు-చదవని వారూ ఉండవచ్చు కదా. అదీ గాక 'బేసిక్స్' ఎప్పుడూ ముక్కున పెట్టుకుని వదిలేవి కావు. బేసిక్స్ లో PERFECTION లేనప్పుడు ఒక భాష నే కాదు, మరేమీ సాధించలేము.} ఆపై "కృషితో నాస్తి దుర్భిక్షం" అన్న ఆర్యోక్తి ని నమ్మి పట్టుదలతో ముందుకు సాగిపో-

ఎందుకు? ఏమిటి? ఎలా? అని బాబు మోహన్ లా ప్రశ్నించకుండా ముందుగా నేను తెలియ జేయబోయే మినిమం కాన్సెప్ట్స్ ని  అవగాహన చేసుకుంటూ, అవసరమైనవాటిని  కంటస్థం చేస్తూ - ప్రతి రోజు 10 పదాలైన నేర్చుకుంటూ ముందుకు సాగిపో.......ALL THE BEST



Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates