ముందుమాట
భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్
మిత్రులారా!
మనము spoken english పరంగా ఉపయోగించే వాయిస్ గురించి చర్చించాలంటే మనము చదువుకునే సమయం లో నేర్చుకున్న ప్రాధమిక అంశాలను గుర్తుకు తెచ్చుకోవలసిందే..OK.. ఆ ప్రయత్నం చేద్దాం.
###########################################
ఒక కర్త (subject) వాక్యంలో పనిని చేయుచున్నదా..? లేక ఆ పనియొక్క ఫలితాన్ని పొందుతున్నదా..? అనే విషయాన్ని తెలిపే రూపమును voice అంటారు. voice రెండు రకములు.
1) Active Voice
2) Passive Voice
* Rama kicked the ball (AV)
* The ball was kicked by Rama (PV)
Note:- Intransitive verb కు Passive Voice ఉండదు.
Objects గల క్రియలను transitive verbs అని.. Objects లేని క్రియలను Intransitive verbs అని అంటారు.
INTRANSITIVE VERBS
1) Sita came
2) The horse runs.
ఈ పై వాక్యాలకు 'కర్మ'లేదు. అనగా came,runs అను క్రియలయోక్క ఫలితమును అనుభవించు వారు ఎవ్వరు లేరు.
క్రియ ముందు whom, what అని వుంచి ప్రశ్నించిన వచ్చు సమాధానము Object కదా..( గతం లోనే చెప్పుకున్నాం)
పై వాక్యాలను అనుసరించి దేనిని వచ్చెను, వేనిని వచ్చెను,... దేనిని పరిగెత్తేను, వేనిని పరిగెత్తేను? అని ప్రశ్నించిన సమాధానము రాలేదు కదా..ఇవి ...కర్మ లేని వాక్యాలు.
(Intransitive verbs) ... వీటికి passive voice వుండదు.
ACTIVE VOICE నుండి PASSIVE VOICE లోనికి ఎలా మార్చాలో నేర్చుకోవడం పరీక్షలకు సంభందిన్చినదే గాని..SPOKEN ENGLISH లో పనికి రాదు.
ఇంతకీ మనము ACTIVE VOICE మాట్లాడాలా? లేక PASSIVE VOICE మాట్లాడాలా..?
మరి రేపటివరకు వేచి వుండండి...ప్రస్తుతానికి శలవు...మీ ప్రతాప్...
Popular Posts
-
ENGLISH SENTENCES వాక్యములు ప్రధానంగా నాలుగు రకాలని చెప్పవచ్చు. 1)ASSERTIVE--------------...
-
ORDER OF WORDS తెలుగులో కర్త-కర్మ-క్రియ వరుసగా వస్తాయి......S+O+V ఇంగ్లీష్ లో కర్త-క్రియ-కర్మ వరుసగా వస్తాయి......S+V+O రాముడు రావణున...
-
ఈరోజు మనము classroom నిర్వహణ గురించి తెలుసుకుందాం .
-
PARTS OF SPEECH The words which we use are divided into various classes according to their...
-
మనం మన భావాలను Active Voice లో చెప్పాలా/Passive Voice లో చెప్పాలా/ మీకు AV వచ్చు ..అలాగే PV వచ్చు... మీరు ఎందులో చెప్పినా తప్ప...
-
మిత్రులారా... మాటలాడే సమయంలో తప్పులు దొర్లుతాయేమో అనే భావన మరిన్ని తప్పులు చేయడానికి కారణము అవుతుంది తప్ప దానివల్ల వేరే ప్రయోజనం లేదు.ఈ రోజ...
-
***Sung By Smt.Abigail, Z.P.High School,Pedapalakaluru, Guntur District (A.P)***{For S.S.C (TM) Students} Bangle sel...
-
కొంతమంది మిత్రులు మెయిల్ పంపారు. ఏమనంటే -" సర్ ఈరోజే మీ బ్లాగ్ చూడటం జరిగింది. కానీ అందులో lessons చాలానే ఉన్నట్లుగా ఉన్న...
-
THE HOUND OF THE BASKERVILLES SUPPLEMENTARY READER-1 - S.S.C - ENGLISH (EM) (ఈ పోస్ట్ HTML కోడ్ లో ఉన్నందున ఇక్కడ pri...
-
0 comments:
Post a Comment