ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Monday, October 13, 2014

నిజజీవితంలో వాయిస్ (ఆఖరి భాగము)


                       
Active voice- Passive తేడ..



I sent a letter (AV)...నేను లెటర్ పంపాను.
A letter was sent by me(PV)....నాచేత లెటర్ పంపబడింది.

పైన మనం AV ని PV గా మార్చాం. అర్ధ భేదం లేదు..నిజ జీవితం లో కూడా మనం ఇలాగె మాట్లాడితే అక్కడ కూడా అర్ధ భేదం ఉండదు.కాని మనము active voice ని passive voice గా మార్చో...లేక passive voice ని active voice గా మార్చో ఇంగ్లిష్ మాట్లాడం.అక్కడ సందర్భాన్ని బట్టి దేనికదే విడి విడిగా ఏది బాగుంటదని అనుకుంటామో అదే మాట్లాడతాము.ఇక్కడ Be+V3 =Passive voice గా మనము గుర్తు పెట్టుకోవాలన్తే.చదువుకొనే రోజులలోని గ్రామర్ ని మనసులో పెట్టుకొనే అర్ధభేధం వుదడనే భావననుండి మనము బయట పడాలి.అక్కడ వరకూ అది రైటే.కాని మనము మాట్లాడే విధానము వేరు.ఇక్కడ దేనికదే విడివిడి గా భావించాలి.
I sent = నేను పంపాను
I was sent = నన్ను పంపారు. (ఇక్కడ అర్ధం విభేదించింది కదా)

కాని పై వాక్యాలు ఈ వాక్యాలు ఒక్కటి కాదు. పై వాక్యాలు AV నుండి PV కి మార్చాము.ఇక్కడ మాత్రం దేనికదే విడి విడి గా వున్నది.AV నుండి PV కి మార్పు కాదని గమనించండి.

MORE EXAMPLES
  1. He liked: అతను ఇష్టపడ్డాడు...He was liked: అతనిని ఇష్ట పడ్డారు.
  2. He arrested: అతను అరెస్ట్ చేసాడు..He was arrested..అతనిని అరెస్ట్ చేసారు.
  3. He selected..అతను సెలక్ట్ చేసాడు..He was selected ..అతనిని సెలక్ట్ చేసారు.
  4. I told.. నేను చెప్పను.....I was told..నాకు చెప్పారు
  5. Rama saw..రాముడు చూసాడు..Rama was seen..రాముడ్ని చూసారు.

Friday, October 10, 2014

నిజజీవితంలో VOICE పార్ట్ -4


అనేక క్రియలు అసలు ఏమేమి చెబుతాయి?





చర్యలను బట్టి క్రియ వాక్యంలో ఏమిచేబుతుందో గమనించండి.

1) వస్తువు గాని,వ్యక్తీ గాని ఏమిచేయునో తెలుపుతుంది.
    (come,take,act,play,eat..ఇలా అనేక రకాలు)


      *Chiranjeevi acted in many films
      * She sings a song

2) వస్తువుకు గాని,వ్యక్తికీ గాని ఏమి జరిగిందో తెలుపుతుంది. (Be+V3)
Be= is,am,are,was,were,be,been,being


ఇదే passive Voice

*He was arrested
*Letters were posted
*Shop was closed

3) వస్తువుకు గాని,వ్యక్తికీ గాని 'కలిగియుండి ' అనే భావనని తెలుపుతుంది.
(Have,Has,Had)


          *She has knowledge
          *They had Rs.15 lakhs
          *I have a computer


4) ఒక వస్తువు,వ్యక్తీ యొక్క స్తితి ని గాని, గుణాన్ని గాని, చెబుతుంది.అలాగే చేసే పనిని కూడా చెబుతుంది. (నిజానికి ఇది ఒకటవ రూలుకు సామీప్యం)


(is,am,are,was,were,will be, shall be)


                                                           *The kids are on the bed
     *Chiranjeevi is a popular hero
     *Rama is a good boy
     *Sita is reading  


 (సశేషం)
         

Thursday, October 9, 2014

నిజజీవితంలో Voice - పార్ట్- 3




మనం మన భావాలను Active Voice లో చెప్పాలా/Passive Voice లో చెప్పాలా/

మీకు AV వచ్చు ..అలాగే PV వచ్చు... మీరు ఎందులో చెప్పినా తప్పులేదు. ఐతే సందర్భాన్ని బట్టి కర్త(subject)కు ప్రాధాన్యత ఇస్తే AV లో చెప్పండి.కర్మ(object) కు ప్రాధాన్యమిస్తే PV  లో చెప్పండి.

అర్థం కాలేదా?

ఉదాహరణకు...కొన్ని వాక్యాలు AV లో చెప్పడం కుదరదు..
అదెలా.....లా...లా.....లా

          కుర్చీ విరిగింది...chair was broken (PV)
         వాచీ ఆగిపోఇంది...watch was stopped (PV)

మరి కొన్ని వాక్యాలు తెలుగులో (AV) ఇంగ్లీష్ లో (PV) ఐతే బాగుంటుంది.
అదెలా.....లా...లా.....లా

*మాఇంట్లో దొంగలు పడ్డారు (AV) (తెలుగు లో బాగుంటుంది)
*They burgled my house (AV)(ఇంగ్లీష్ లో బాగుండదు)

*మా ఇల్లు దోచుకోబడింది (PV) (తెలుగు లో బాగోదు)
*My house was burgled(PV) (ఇంగ్లీష్ లో బాగుంటుంది)

సహజముగా news papers లో, రేడియో ,టి.వి.వార్తలలో, Announcements లో , Advertisements లో అనుదిన సంభాషనలందు( Everyday conversations) Passive Voice ఉపయోగిస్తారు. సందర్భాన్ని బట్టి ఏది అవసరమో అదే వాడాలి..అందుకే ప్రతి దానిలోని మెలకువలన్ని తెలుసుకోవాలి. నిజజీవితంలో AV Vs PV  గురించి రేపు తెలుసుకుందాం. (సశేషం)

Tuesday, October 7, 2014

నిజజీవితంలో Voice.. పార్ట్ -2




మిత్రులారా!

మనము spoken english పరంగా ఉపయోగించే వాయిస్ గురించి చర్చించాలంటే మనము చదువుకునే సమయం లో నేర్చుకున్న ప్రాధమిక అంశాలను గుర్తుకు తెచ్చుకోవలసిందే..OK.. ఆ ప్రయత్నం చేద్దాం.
                           ###########################################

      ఒక కర్త (subject) వాక్యంలో పనిని చేయుచున్నదా..? లేక ఆ పనియొక్క ఫలితాన్ని పొందుతున్నదా..? అనే విషయాన్ని తెలిపే రూపమును voice అంటారు. voice రెండు రకములు.

1) Active Voice
2) Passive Voice

         * Rama kicked the ball (AV)
         * The ball was kicked by Rama (PV)

Note:- Intransitive verb కు Passive Voice ఉండదు.

Objects  గల క్రియలను  transitive verbs అని.. Objects లేని క్రియలను Intransitive verbs అని అంటారు.

INTRANSITIVE VERBS

           1) Sita came
           2) The horse runs.

                       ఈ పై వాక్యాలకు 'కర్మ'లేదు. అనగా came,runs అను క్రియలయోక్క ఫలితమును అనుభవించు వారు ఎవ్వరు లేరు.
                        క్రియ ముందు whom, what అని వుంచి ప్రశ్నించిన వచ్చు సమాధానము Object కదా..( గతం లోనే చెప్పుకున్నాం)
                        పై వాక్యాలను అనుసరించి దేనిని వచ్చెను, వేనిని వచ్చెను,... దేనిని పరిగెత్తేను, వేనిని పరిగెత్తేను? అని ప్రశ్నించిన సమాధానము రాలేదు కదా..ఇవి ...కర్మ లేని వాక్యాలు.
(Intransitive verbs) ... వీటికి passive voice వుండదు.

ACTIVE VOICE నుండి PASSIVE VOICE లోనికి ఎలా మార్చాలో నేర్చుకోవడం పరీక్షలకు సంభందిన్చినదే గాని..SPOKEN ENGLISH లో పనికి రాదు.

ఇంతకీ మనము ACTIVE VOICE  మాట్లాడాలా? లేక PASSIVE VOICE మాట్లాడాలా..?
మరి రేపటివరకు వేచి వుండండి...ప్రస్తుతానికి శలవు...మీ ప్రతాప్...

Monday, October 6, 2014

నిజజీవితంలో Voice ..Part-01





మిత్రులారా ... ఒక్క విషయం గమనించండి. మనం చదువుకునే టైం లో నేర్చుకున్న active voice, passive voice నిజజీవితంలో ఎలా ఉపయోగిస్తున్నాము? మనం నేర్చుకున్నాం..Rama killed Ravana...(AV) Ravana was killed by Rama (PV).. అంటే AV నుండి PV కి మార్చటం కొన్ని రూల్స్ ఆధారంగా చేయడం నేరుచుకున్నాం. ఇంతవరకు బాగానే ఉన్నది... కానీ ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి spoken english పరంగా మనము ఎవరితోనైనా మాట్లాడాలంటే active వాయిస్ లో  మాట్లాడతామా? లేక passive voice లో మాట్లాడతామా?....... PV లో మాట్లాడాలని అనుకున్నాం అనుకోండి..ఆ particular sentence ని AV లో ఉహించుకొని దానిని రూల్స్ ప్రకారం PV లోకి మార్చి .. అప్పుడు మాట్లాడతామా? అంతవరకు ..ఆ ఎదుటిమనిషి ఉంటాడా?.... అసలు ఈ వాయిస్ గందరగోళం ఏమిటి?.... మనము పరీక్షల దృష్ట్యా నేర్చుకున్న AV...PV  లో అర్ధ భేదం ఉండదు..కానీ నిజజీవితం లో  అర్ధం విభేదిస్తుంది...అదెలాగా<  He arrested (AV)= అతను అరెస్ట్ చేసాడు...He was arrested(PV) = అతనిని అరెస్ట్ చేసారు...........గమనించారా!....సరే ఈ విషయాలన్నీ మనం రేపటి పోస్ట్ లో చర్చిద్దాం..మరి ..మన బ్లాగ్ ని ఫాలో అవుతూ వుండండి. వుంటాను ..నమస్తే....

Saturday, October 4, 2014

WHO,WHAT,WHICH తో PASSIVE VOICE


WHO,WHAT,WHICH తో PASSIVE VOICE 




డియర్ స్టూడెంట్స్,
క్రితం పోస్టులో మనము  WHEN,WHERE,WHY,HOW లతో passive voice లు తయారుచేశాము కదా....

ఇప్పుడు who, what, which ల తో చూద్దాం.

Who, What, Which  లను  Interrogative Pronouns అంటారు.
వీనితో ప్రారంభమగు ప్రశ్నలను Passive లోనికి మార్చునప్పుడు Passive Voice లో verb ని Subject (Interrogative Pronouns) కి తరువాత మాత్రమే వుంచుతాము.

Interrogative: Who rang the bell?
Assertive:      The bell was rung by whom.

* కానీ who తో ప్రారంభం అగు ప్రశ్నలను Passive లోనికి మార్చునప్పుడు అనూచానంగా వున్న నియమం ప్రకారం by whom ని subject చేసి దాని తరువాత verb వుంచుతాము. కాబట్టి .....
By whom was the bell rung?
------------------------------------------------------------------------

II) Who taught you English? (AV)
    You were taught English by whom.
     Were you taught English by whom?
    By whom were you taught English?  (PV)

III) What do you want?
     You (do) want what
      What is wanted by you?

IV) What are  you doing?
      You are doing what.
       What is being done by  you?
================================================

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates