మనము ఒక తెలుగు వాక్యాన్ని ఇంగ్లిష్ లోనికి మార్చాలనుకున్నాము. అదేమంటే.. వారు ఒక చిన్నారిని దత్తత తీసుకుందామనుకున్నారు... They wanted to అడాప్ట్ a child. వాక్యనిర్మాణము కరక్టే. కానీ 'ఆడాప్ట్' స్పెల్లింగ్ ఏమిటి? మనకు ఎక్కడో చదివిన గుర్తు.... ADAPT, ADEPT, ADOPT ఈ3 33మూడు spellings లో ఏది రాద్దాం అనే సమస్య వస్తుంది. మాటలాడే సమయంలో ఫర్లేదు గాని వ్రాసినప్పుడు మనకు సమస్య. ఎందుకంటే ఈ మూడింటికి వేరు వేరు అర్దాలు వున్నాయి. ఇంగ్లీష్ తో మనకు ఇదే సమస్య. అలా అర్ధాలు వేరువేరు గా లేకపోతే ఏదో ఒకటి వ్రాసేవారము.. అక్షర దోషమని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఒకదాని బదులు మరోటి వ్రాస్తే అర్ధదోషం వస్తుంది. so .. మనము ఈ విషయంలో జాగ్రత్తగా వుండాలి.ఇలా మనల్ని ఇబ్బంది పెట్టేవి ఇంగ్లిష్ లో చాలానే వున్నాయి. వాటిలో కొన్ని చూద్దాము.
Adapt................. తగిన విధముగా మార్చడము.
Adopt..................దత్తత తీసుకొను
Adept.................. నైపుణ్యము,నేర్పరితనము..
Adivise................(సలహా) క్రియా పదంగా ఉపయోగించాలి
Adivice................(సలహా) వ్యాకరణ పరంగా నామవాచకం అవుతుంది.
Altar.................... ప్రార్ధనా స్థలంలో వుండే దైవ పీఠం.
Alter.................... మార్పు
All ready............... సర్వ సన్నద్దంగా ఉండటం.
Already................. అప్పటికల్లా
Antic....................ఇతరులకు నవ్వు తెప్పెంచే విధంగా ప్రవర్తించడం.
Antique................పురాతన వస్తువు.
Artist.................... ఏదైనా కళలో నైపుణ్యం వున్న వ్యక్తి.
Artiste...................ఏదైనా కళను ఇతరులకు అందించి money తీసుకునే వ్యక్తి
Baby.....................పిల్లవాడు/పాప
Bobby...................అవివేకి
Bald......................బట్టతల
Bold......................ధైర్యము
Ball.......................బంతి
Bawl.....................అరుపు
Bass......................lowest male voice
Boss.................... అధికారి
Bowdy.................అమర్యాదగా ప్రవర్తించు
Body..................మనిషి/జంతు శరీరము
Bellow................గర్జించు
Below..................తక్కువ స్థాయి, దిగువ
Beside................. ప్రక్క ప్రక్కనే
Besides................అందనంగా
Boarder............... వేరేయింట్లో ఉండి చదువుకునేవాడు.
Border................. సరిహద్దు
Boon....................వరము
Bone.....................ఎముక
Bough....................చెట్టు కొమ్మ
Bow......................విల్లు
Brake...................వాహనమును ఆపు సాధనము
Break................... ముక్కలుచేయు, అధిగమించు
Site.......................స్థలము
Sight....................దృశ్యము
College.................కళాశాల
Collage.................కొన్ని వస్తువుల సమూహము
Complement..........ఒక దానితో సరిపడేది
Compliment............ఇతరులను మెచ్చుకోవడం
Confirm................ ఒక విషయము నిజమేనని దృవీకరించడం
Conform................నియమావళికి అనుగుణంగా నడచుకోవడం
READ MORE
(సశేషం)
0 comments:
Post a Comment