ముందుమాట
భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్
ఈరోజు ఒక నమూనా (వీటినే Stentence Patterns లేదా Structures అంటారు.) ద్వారా ఇంగ్లిష్ ఎలా నేర్చుకోవచ్చో చూద్దాం.
Structure: This/These/That/Those+Be+Noun
ఇలా structures ద్వారా ఇంగ్లిష్ నేర్చుకోవడం ఒక పద్దతి. ఇవి షుమారుగా 275 వున్నాయి. కాకపోతే ఈ Pattern లో 10 వాక్యాలు వ్రాసుకుని కంఠస్థం చేసినంత మాత్రాన ఇంగ్లిష్ రాకపోవచ్చు. అలాగని గ్రామర్ మొత్తం ముందుగా నేర్చుకుని ఆ పై ఇలాంటి structures పై ఆధార పడదామంటే అదీ సరైన పద్దతి కాదేమో.. ఎందుకంటే అకడమిక్ గా ఇంగ్లిష్ లో 90 శాతం మార్కులు వచ్చినవారు.. ఎం. ..ఏ లు, ఎం.కామ్.లు పాసైన వారు కూడా (నేను కూడా)ఇంగ్లీష్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు.so గ్రామర్ వచ్చినంత మాత్రాన ఇంగ్లిష్ రాదు. కాకపోతే ఎంత అవసరమో అంతవరకు గ్రామర్ నేర్చుకోవాలే తప్ప కేవలం దానికోసమే సమయం వెచ్చించ కూడదు. అసలు spoken english వేరు written english వేరు .. మన విద్యావిధానం written english కే ఎక్కువ importance ఇస్తున్నట్లుంటుంది. ఇది కధలు,కావ్యాలు వ్రాయడానికి ఉపయోగపడుతుందే గాని మాటలడటానికి కాదు(ఇది నా అభిప్రాయం మాత్రమే) మాటలాడటం అనేది మాటలాడితేనే వస్తుందనేది నా అనుభవం. సరే అసలు విషయానికి వద్దాం. పై structure చూద్దాం. దానిప్రకారం కొన్ని వాక్యాలు చూద్దాం.
This + is + a pen
That + is + an umbrella
These + are + pens
Those + are + pens
ఇప్పుడు మనము (అసలు ఇప్పటి వరకు మనకు గ్రామర్ ఏమీ రాదనుకుందాం) ఈ ఒక్క structure కి సంబంధించినతవరకు మాత్రమే గ్రామర్ నేర్చుకుంటామ్. మరో structure లేదా మరో వాక్య నిర్మాణంలో మొదటి structure పరంగా నేర్చుకున్న గ్రామర్ కాక అదనంగా ఒకటి,రెండు అంశాలకు సంభంధించిన గ్రామర్ మాత్రమే తెలుసుకోవలసి వస్తుంది. ఇలా మనము చిన్న చిన్న గా .. practical గా అవసరమైనంత మాత్రమే నేర్చుకుంటూ , నేర్చుకున్న దానిని ఉపయోగించడం ద్వారా మనసులో నిక్షిప్తం చేసుకుంటూ ముందుకు వెళదాం.
మిగిలిన పార్ట్ కోసం 'Read More' క్లిక్ చేయండి. లేదా మన మరో బ్లాగ్
http://englishmadeeasy.webnode.com/lesson-07/ లోనికి ప్రవేశించండి . నమస్తే
గుంటూరు జిల్లా Common Examination Board నిర్వహణలో జరిగిన SSC ఇంగ్లిష్ మీడియం విద్యార్ధుల ఇంగ్లిష్ పరీక్ష Key కోసం దిగువున క్లిక్ చేయండి. నమస్తే-
మార్చ్ 2013లో జరగబోవు 10 వ తరగతి పరీక్షల దృష్ట్యా విద్యార్ధులు(ఇంగ్లిష్ మీడియం) ఇంగ్లిష్ పరీక్ష సులభముగా వ్రాసేనిమిత్తం ఈ ప్రిపరేషన్ ప్లాన్ తయారుచేయబడినది. దీనికోసం దిగువున క్లిక్ చేయండి.
మనము ఇంగ్లిష్ లో వాక్యాలు వ్రాయడం వేరు..మాటలాడటం వేరు. వ్రాసేటప్పుడు గ్రామర్ గుర్తుకు తెచ్చుకునే అవకాశం ఉంటుంది గాని మాట్లాడేటప్పుడు గ్రామర్ రూల్స్ మనం పాటిస్తున్నమా లేదా..ఒకవేళ తప్పు మాట్లాడుతున్నమేమో అని అలోచిన్చినంతకాలం..మనకు ఇంగ్లిష్ రాదు.తప్పు అయినా ఒప్పు అయినా మనము మాట్లాడాలి..అంతే.. Read more:
మనము ఈ Lesson లో Essential Vocabulary క్రింద అత్యంత ముఖ్యమైన 1000 పదాలు నేర్చుకుందాం.వీటిని మీరు అలా చూసి ఇలా వదలటం కాదు..మీకు గుర్తు వుండే వరకు By heart చేయవలసిందే...గమనించారుగా.. ఇవి sub-folders గా వుంచాను. ఒక 50 వచ్చాక మరో 50 కి వెళ్ళాలి సుమా!
పూర్తి LESSON కోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.
ఆకలి చావు . . . ఈ మాట వినగానే ఒళ్ళు జలదరిస్తుంది.ఏమి చేయలేమ? పరిస్తితిని మార్చలేమా?. . . అన్న ఆలోచనతో మనసు బరువెక్కుతుంది.
కానీ అలా భాధపదనక్కరలేదు. ఇంటర్నెట్ ముందు కూర్చొని freerice.com website open చేసి మీకు ఓపిక ఉన్నంత సేపు కూర్చుని సాధ్యమైనంత అన్నం పోగెయ్యండి.దానంతట అదే ఆకలి కడుపులకు చేరి పోతుంది.ఇదేలాగో చూద్దాం.
మన బ్లాగ్ ఉద్దేశ్యం మెల్ల మెల్లగా మంచి ఇంగ్లిష్ నేర్చుకోవడం. దానిలో భాగంగా మనం పదజాలం నేర్చుకోవాలి-వాక్య నిర్మాణాలు (grammar) తెలుసుకుంటూ ఉండాలి. అది ఒక ఆటలాగా సాగితే ఎంత బాగుంటుంది.! అదీను . . . ఈ కారణం గా పేదవాడి ఆకలి కూడా తీర్చగలుగుతున్నాను అనే తృప్తి ఉంటె ఇంకెంత బాగుంటుంది.
ఏమిటి ఈ ఆట?
ఈ వెబ్సైటు హోం పేజి ఓపెన్ చేయగానే ఓ ఆంగ్లపదం, దాని క్రింద మరో నాలుగు పదాలు కనిపిస్తాయి.పై పదానికి సమానార్ధం వచ్చే పదం మీద క్లిక్ చేయగానే (అది రైట్ అయితే పది బియ్యపు గింజలు ఒక దగ్గర చేరతాయి.తప్పు ఐతే మరో సరి ప్రయత్నం చేసి సాధ్యమైనన్ని ఎక్కువ బియ్యం పోగెయ్యండి.అలాగే మిగతా subjects కూడా..ఇక మీ ఓపిక - తీరిక..
ఎవరు చెల్లిస్తారు?
ప్రశ్నలకు జవాబు ఎంపిక చేసినప్పుడు ఆ వెబ్ పేజి అడుగున స్పేస్ పొందే ప్రకటన కర్తలు అబియ్యపు గింజలకు అవసరమయ్యే డబ్బు చెల్లిస్తారు.ఆంగ్ల పద జాలాన్ని నేర్వడం, ఆకలి తీర్చడం ఒకేసారి రెండు లాభాలు కల్పిస్తోన్న ఈ సైట్ లో ఆపిల్ , తోషిబా వంటి వాటితో పాటు ఎన్నెన్నో కంపినీలు ముందుకొచ్చాయి.
ఆలోచన వెనుక. . . . . .
జాన్ బ్రిన్ అమెరిక దేశీయుడు.వెబ్ సైట్ ల రూపకర్త. ఓ ఆన్ లైన్ గేమ్ తయారు చేయాలనుకున్నాడు.ఏదో ఆషా మాషి గేమ్ లా కాకుండా దానికో ప్రయోజనం ఉంటె బాగుంటుంది అనుకున్నాడు.దాని ఫలితమే ఈ సైట్ రూపకల్పన.
ఈ గేమ్ ఆడి చూడండి. పేదవాడి ఆకలి తీరుతుంది. మన జ్ఞాన దాహం కూడా తీరుతుంది. దీని లింక్ కోసం(పైన ) ప్రక్కన చూడండి.
(ఈనాడు పేపర్ సౌజన్యంతో)
10 వ తరగతి మూడవ యూనిట్ ఇంగ్లిష్ మీడియం ఇంగ్లిష్ key కొరకు దయచేసి దిగువ Link ని క్లిక్ చేయండి
Popular Posts
-
ENGLISH SENTENCES వాక్యములు ప్రధానంగా నాలుగు రకాలని చెప్పవచ్చు. 1)ASSERTIVE--------------...
-
ORDER OF WORDS తెలుగులో కర్త-కర్మ-క్రియ వరుసగా వస్తాయి......S+O+V ఇంగ్లీష్ లో కర్త-క్రియ-కర్మ వరుసగా వస్తాయి......S+V+O రాముడు రావణున...
-
మనం మన భావాలను Active Voice లో చెప్పాలా/Passive Voice లో చెప్పాలా/ మీకు AV వచ్చు ..అలాగే PV వచ్చు... మీరు ఎందులో చెప్పినా తప్ప...
-
THE HOUND OF THE BASKERVILLES SUPPLEMENTARY READER-1 - S.S.C - ENGLISH (EM) (ఈ పోస్ట్ HTML కోడ్ లో ఉన్నందున ఇక్కడ pri...
-
మిత్రులారా... మాటలాడే సమయంలో తప్పులు దొర్లుతాయేమో అనే భావన మరిన్ని తప్పులు చేయడానికి కారణము అవుతుంది తప్ప దానివల్ల వేరే ప్రయోజనం లేదు.ఈ రోజ...
-
***Sung By Smt.Abigail, Z.P.High School,Pedapalakaluru, Guntur District (A.P)***{For S.S.C (TM) Students} Bangle sel...
-
కొంతమంది మిత్రులు మెయిల్ పంపారు. ఏమనంటే -" సర్ ఈరోజే మీ బ్లాగ్ చూడటం జరిగింది. కానీ అందులో lessons చాలానే ఉన్నట్లుగా ఉన్న...
-
-
-
ఈరోజు మనము classroom నిర్వహణ గురించి తెలుసుకుందాం .