ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Friday, July 27, 2012

STRUCTURES (Neither-Nor / Either - or)


రెండు వస్తువులలో లేదా ఇద్దరు వ్యక్తులలో ఏదైనా ఎంచుకునే విషయంలో ఈ రెండూ ఉపయోగిస్తారు.


1) Either...Or ని రెండు వస్తువులు / వ్యక్తులు ఉన్నప్పుడు ఏదో ఒక దానిని ఎంచుకునేటప్పుడు వాడతారు.

Ex:- I can speak either Hindi or Telugu (నేను హిందీ గాని, తెలుగు గాని మాటలాడగలను)
        అంటే ఏదో ఒకటి మాత్రమే మాటలాడగలనని అర్ధం.

      I can either start today or stay at home (నేను ఈ రోజు బయలుదేరుతాను లేదా ఇంటివద్దనే ఉంటాను)

2) Neither...Nor ని రెండు వస్తువులు / వ్యక్తులు ఉన్నప్పుడు ఏదీ జరగక పోవడాన్ని సూచిస్తుంది.

Ex:- I can speak neither Hindi nor Telugu (నాకు హిందీ గాని, తెలుగు గానీ మాటలాడటం రాదు)
       అంటే రెండూ మాటలాడటం రాదు.

TIP: either/neither - మొదటి వస్తువు/వ్యక్తి కి ముందు, or/nor రెండవ వస్తువు/వ్యక్తి కి ముందు వాడాలి.


ఈ క్రింది వాక్యములను కోరిన విధముగా కలిపి వ్రాయండి.


  1.  I have no pen. I have no pencil ( neither-nor)
  2. He has no lands. He has no money  ( neither-nor) 
  3. She cannot read. She cannot write  ( neither-nor) 
  4. It is not white. It is not yellow  ( neither-nor) 
  5. He is not mad. He is not drunk  ( neither-nor) 
  6. You can use a pen. You can use a pencil (either-or) 
  7. You can come in. You can go out (either-or)
  8. He is ill. He is careless  (either-or)
  9. You can go by bus. You can go by train  (either-or)
  10. He is a fool. He is a mad man  (either-or)


ANSWERS


  1. I have neither a pen nor a pencil
  2. He has neither lands nor money.
  3. She can neither read nor write.
  4. It is neither white nor yellow.
  5. He is neither mad nor drunk.
  6. You can use either a pen or a pencil.
  7. You can either come in or go out.
  8. He is either ill or careless.
  9. You can go either by bus or by train.
  10. He is either a fool or a mad man.

0 comments:

Post a Comment

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates