ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Sunday, July 29, 2012

TWICE Vs DOUBLE

ఆంగ్ల భాషలో Once (ఒక పర్యాయము) Twice (రెండు పర్యాయములు) Thrice (మూడుసార్లు) Six Times (ఆరుసార్లు) మొదలగు పదాలు ఎన్ని పర్యాయాలో తెలుపుటకు ఉపయోగిస్తారు. ఇవి Adverbs
For Ex.. I visited Delhi twice.
            They missed to score goals four times            
            Our teacher beat me thrice. 
అలాగే రెండు రెట్లు, మూడు రెట్లు అంటూ వుంటాము కదా
"my investment has increased ninefold".
వీటి మొత్తాన్ని గుణకములు (Multiples) అనవచ్చు.
వాటిని చూద్దాం.
ఒకసారి................................ .Once
ఒకటి.......................................Single
రెండుసార్లు..........................Twice 
రెండు రెట్లు..........................Double
మూడుసార్లు.......................Thrice 
మూడురెట్లు........................Triple 
నాలుగుసార్లు.......................Four times 
నాలుగు రెట్లు.......................Four fold 
అయిదు సార్లు......................Five times 
అయిదు రెట్లు.......................Five fold 
ఆరుసార్లు............................Six times 
ఆరు రెట్లు............................Six fold 
ఏడు సార్లు.......................... Six times 
ఏడు రెట్లు........................... Seven fold 
ఎనిమిది సార్లు......................Eight times 
ఎనిమిది రెట్లు.......................eight fold 
తొమ్మిది సార్లు......................nine times 
తొమ్మిది రెట్లు...................... nine fold 
పది సార్లు...........................Ten times 
పది రెట్లు............................Ten fold 

Friday, July 27, 2012

STRUCTURES (Neither-Nor / Either - or)


రెండు వస్తువులలో లేదా ఇద్దరు వ్యక్తులలో ఏదైనా ఎంచుకునే విషయంలో ఈ రెండూ ఉపయోగిస్తారు.


1) Either...Or ని రెండు వస్తువులు / వ్యక్తులు ఉన్నప్పుడు ఏదో ఒక దానిని ఎంచుకునేటప్పుడు వాడతారు.

Ex:- I can speak either Hindi or Telugu (నేను హిందీ గాని, తెలుగు గాని మాటలాడగలను)
        అంటే ఏదో ఒకటి మాత్రమే మాటలాడగలనని అర్ధం.

      I can either start today or stay at home (నేను ఈ రోజు బయలుదేరుతాను లేదా ఇంటివద్దనే ఉంటాను)

2) Neither...Nor ని రెండు వస్తువులు / వ్యక్తులు ఉన్నప్పుడు ఏదీ జరగక పోవడాన్ని సూచిస్తుంది.

Ex:- I can speak neither Hindi nor Telugu (నాకు హిందీ గాని, తెలుగు గానీ మాటలాడటం రాదు)
       అంటే రెండూ మాటలాడటం రాదు.

TIP: either/neither - మొదటి వస్తువు/వ్యక్తి కి ముందు, or/nor రెండవ వస్తువు/వ్యక్తి కి ముందు వాడాలి.


ఈ క్రింది వాక్యములను కోరిన విధముగా కలిపి వ్రాయండి.


  1.  I have no pen. I have no pencil ( neither-nor)
  2. He has no lands. He has no money  ( neither-nor) 
  3. She cannot read. She cannot write  ( neither-nor) 
  4. It is not white. It is not yellow  ( neither-nor) 
  5. He is not mad. He is not drunk  ( neither-nor) 
  6. You can use a pen. You can use a pencil (either-or) 
  7. You can come in. You can go out (either-or)
  8. He is ill. He is careless  (either-or)
  9. You can go by bus. You can go by train  (either-or)
  10. He is a fool. He is a mad man  (either-or)


ANSWERS


  1. I have neither a pen nor a pencil
  2. He has neither lands nor money.
  3. She can neither read nor write.
  4. It is neither white nor yellow.
  5. He is neither mad nor drunk.
  6. You can use either a pen or a pencil.
  7. You can either come in or go out.
  8. He is either ill or careless.
  9. You can go either by bus or by train.
  10. He is either a fool or a mad man.

Wednesday, July 25, 2012

"అందంగా పోల్చడానికి"




  • ఎర్రగా అందంగా ఉంటే.....She is as fair as a rose అంటూ గులాబీతో పోలుస్తాం....
  • ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని అంతరిక్షంతో పొలుస్తూ .. The place is as empty as space అంటాం.
  • ఎవరైనా పులిలా కోపంగా ఉంటే..He is as fierce as a tiger అంటాం.
  • పట్టుదలతో ఒక దాన్నే అంటిపెట్టుకొని ఉంటే.. She is as firm as a rock అంటాం..
  • గాలిలా నీవు నీ ఇష్టం వచ్చినట్లు ఉండలేవు అంటే..You are not as free as air/the wind అంటాం.
  • పక్షి తో కూడా పోలుస్తూ ..She is as free as a bird .. అంటాం.
  • రక రకాల రంగులతో ఉన్నదాన్ని సీతాకోక చిలుకతో పొలుస్తూ ..It is a colorful s a butterfly  అంటాం.
  • మృదు స్వభావంతో ఉంటే..He is as gentle as a lamb అంటూ..గోర్రేపిల్లతో పోలుస్తాం.
  • పావురంలా హాని చేయకున్దావుంటే She is as gentle as a dove  అంటాం.
  • తళతళ మెరుస్తున్న దాన్ని బంగారంతో పోలుస్తూ..It is as good as gold  అంటాం.
  • చావులా భయంకరంగా,విషాదంగా ఉన్నప్పుడు It is as grim as death  అంటాం.
  • అయిష్టాన్ని నరకంతో పోలుస్తూ ..It is as hateful as hell  అంటాం.
  • అప్పుడే వేయించిన మిర్చీలు  వేడి వేడి గా ఉంటె..Mirchies are as hot as fire తో  పోలుస్తాం 
  • పసిపాపలు అమాయకత్వానికి ప్రతీకలు.ఎవరైనా అమాయకంగా ఉంటె..He is as innocent as a child అంటాం.
  • కష్టపడే వ్యక్తిని చీమతో పోలుస్తూ ..He is as industrious as an ant అంటాం.
  • నత్త లాంటి సోమరిపోతు ఉంటె -He is as lazy as a lobster/snail అంటాం.
  • తేలికగా ఉన్నదాన్ని ఈకతో పోలుస్తూ..It is as light as a feather అంటాం.
  • సహనాన్ని భూదేవితో పోలుస్తూ..She is as patient as the Earth అంటాం.
  • నెమలికి గర్వం ఎక్కువ..అందుకే..She is as proud as a peacock అంటాం.
  • మెరుపులా త్వరగా వచ్చింది అంటే..It is as quick as lightening అంటాం.
  • రేజర్ లా వాడిగా ఉంటె..It is as sharp as a razor  అంటాం.
  • బాతు లా చిల్లరగా ఉంటె..He is as silly as a goose అంటాం.
  • బాణంలా నిటారుగా పోతుంటే..It goes as straight as an arrow అంటాం.
  • తేనెలా తియ్యగా ఉంటె-It is as sweet as honey అంటాం.
  • పిరికి తనాన్ని కుందేలుతో పోలుస్తూ..He is as timid as a hare అంటాం.
  • కలలు అనిశ్చితం...అందుకే..It is as vague as a dream అంటాం
  • నిజమైన స్నేహితులు ఎప్పుడు సుస్వాగతం పలుకుతారు...అందుకే- It is as welcome as a friend అంటాం.
ఇలా వ్యక్తి ..సమయ సందర్భాలను చూసి, ఎదుటివాళ్ళ వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకొని పై పోలిక పదబంధాలు వాడితే మన ఆంగ్లం ఇడియమాటిక్ గా, అలంకార   ప్రాయంగా ఉంటుంది..ఇవి "ఉద్యోగ సమాచారం"వారి స్పోకెన్ ఇంగ్లిష్ సిరీస్ బుక్స్ నుండి గ్రహించబడినవి..మరచి పోకండి..వీటిని మీరు చదివి వదిలేస్తే ఉపయోగం లేదు..వీటిని ఉపయోగించండి..అప్పుడే మీకు గుర్తు వుంటాయి..సెలవా మరి ...మీ ప్రతాప్..

Wednesday, July 11, 2012

ఆగ్లం నేర్చుకోండి.పేదవాడి ఆకలి తీర్చండి.



                 ఆకలి చావు . . . ఈ మాట వినగానే ఒళ్ళు జలదరిస్తుంది.ఏమి చేయలేమ? పరిస్తితిని మార్చలేమా?. . . అన్న ఆలోచనతో మనసు బరువెక్కుతుంది.

కానీ అలా భాధపదనక్కరలేదు. ఇంటర్నెట్ ముందు కూర్చొని freerice.com website open చేసి మీకు ఓపిక ఉన్నంత సేపు కూర్చుని సాధ్యమైనంత అన్నం పోగెయ్యండి.దానంతట అదే ఆకలి కడుపులకు చేరి పోతుంది.ఇదేలాగో చూద్దాం.
                  మన బ్లాగ్ ఉద్దేశ్యం మెల్ల మెల్లగా మంచి ఇంగ్లిష్ నేర్చుకోవడం. దానిలో భాగంగా మనం పదజాలం నేర్చుకోవాలి-వాక్య నిర్మాణాలు (grammar) తెలుసుకుంటూ ఉండాలి. అది ఒక ఆటలాగా సాగితే ఎంత బాగుంటుంది.! అదీను . . . ఈ కారణం గా పేదవాడి ఆకలి కూడా తీర్చగలుగుతున్నాను  అనే తృప్తి ఉంటె ఇంకెంత బాగుంటుంది.
    
 ఏమిటి ఈ ఆట?

         ఈ వెబ్సైటు హోం పేజి ఓపెన్ చేయగానే ఓ ఆంగ్లపదం, దాని క్రింద మరో నాలుగు పదాలు కనిపిస్తాయి.పై పదానికి సమానార్ధం వచ్చే పదం మీద క్లిక్ చేయగానే (అది రైట్ అయితే పది బియ్యపు గింజలు ఒక దగ్గర చేరతాయి.తప్పు ఐతే మరో సరి ప్రయత్నం చేసి సాధ్యమైనన్ని ఎక్కువ బియ్యం పోగెయ్యండి.అలాగే మిగతా subjects కూడా..ఇక మీ ఓపిక - తీరిక..

     ఎవరు చెల్లిస్తారు?

            ప్రశ్నలకు జవాబు ఎంపిక చేసినప్పుడు ఆ వెబ్ పేజి అడుగున స్పేస్ పొందే ప్రకటన కర్తలు అబియ్యపు గింజలకు అవసరమయ్యే డబ్బు చెల్లిస్తారు.ఆంగ్ల పద జాలాన్ని నేర్వడం, ఆకలి తీర్చడం ఒకేసారి రెండు లాభాలు కల్పిస్తోన్న ఈ సైట్ లో ఆపిల్ , తోషిబా వంటి వాటితో పాటు  ఎన్నెన్నో కంపినీలు ముందుకొచ్చాయి.

            ఆలోచన వెనుక. . . . . .

         జాన్ బ్రిన్ అమెరిక దేశీయుడు.వెబ్ సైట్ ల రూపకర్త. ఓ ఆన్ లైన్ గేమ్ తయారు చేయాలనుకున్నాడు.ఏదో ఆషా మాషి గేమ్ లా కాకుండా  దానికో ప్రయోజనం ఉంటె బాగుంటుంది అనుకున్నాడు.దాని ఫలితమే ఈ సైట్ రూపకల్పన.

                ఈ గేమ్ ఆడి చూడండి. పేదవాడి ఆకలి తీరుతుంది. మన జ్ఞాన దాహం కూడా తీరుతుంది. దీని లింక్ కోసం(పైన )   చూడండి.
                                                                      

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates