భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్
ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించిన సమయంలో " Nursery Rhyme" చిన్న పిల్లల పాఠాలలో కనిపించేది. ఆ rhyme ఇలా ప్రారంభమయ్యేది.
"Rain rain go away" . . . ఈ పాట వాళ్ళ వాతావరణానికి సరిగ్గా సరిపోయేది. వాన రావడం, ముసురు పట్టడం వాళ్ళకు చిరాకు. అంచేత వాళ్ళు 'పోవే పోవే వానా' అంటారు. మనవాళ్లు ఈ విషయాన్ని తరువాత గమనించి ఆ rhyme కొంత మార్చారు. ఇలా ... "రైన్, రైన్, కం అగైన్" Rain rain come again
మనం నిత్యం వానలను ఆహ్వానించాలి. ఆహ్వానించినా అవి బెట్టు చేసి రాని సంధార్భాలే ఎక్కువ. అందుకే మనం దేనినీ గుడ్డిగా అనుకరించ కూడదు. మన సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణమైన వాటినే ఆహ్వానించాలి, అది పాటైనా, మాటైనా... ఇది ఏ దేశానికి ఆ దేశమే ఆదర్శం.
0 comments:
Post a Comment