మనం మన భావాలను Active Voice లో చెప్పాలా/Passive Voice లో చెప్పాలా/
మీకు AV వచ్చు ..అలాగే PV వచ్చు... మీరు ఎందులో చెప్పినా తప్పులేదు. ఐతే సందర్భాన్ని బట్టి కర్త(subject)కు ప్రాధాన్యత ఇస్తే AV లో చెప్పండి.కర్మ(object) కు ప్రాధాన్యమిస్తే PV లో చెప్పండి.
అర్థం కాలేదా?
ఉదాహరణకు...కొన్ని వాక్యాలు AV లో చెప్పడం కుదరదు..
అదెలా.....లా...లా.....లా
కుర్చీ విరిగింది...chair was broken (PV)
వాచీ ఆగిపోఇంది...watch was stopped (PV)
మరి కొన్ని వాక్యాలు తెలుగులో (AV) ఇంగ్లీష్ లో (PV) ఐతే బాగుంటుంది.
అదెలా.....లా...లా.....లా
*మాఇంట్లో దొంగలు పడ్డారు (AV) (తెలుగు లో బాగుంటుంది)
*They burgled my house (AV)(ఇంగ్లీష్ లో బాగుండదు)
*మా ఇల్లు దోచుకోబడింది (PV) (తెలుగు లో బాగోదు)
*My house was burgled(PV) (ఇంగ్లీష్ లో బాగుంటుంది)
సహజముగా news papers లో, రేడియో ,టి.వి.వార్తలలో, Announcements లో , Advertisements లో అనుదిన సంభాషనలందు( Everyday conversations) Passive Voice ఉపయోగిస్తారు. సందర్భాన్ని బట్టి ఏది అవసరమో అదే వాడాలి..అందుకే ప్రతి దానిలోని మెలకువలన్ని తెలుసుకోవాలి. నిజజీవితంలో AV Vs PV గురించి రేపు తెలుసుకుందాం. (సశేషం)
అనేక క్రియలు అసలు ఏమేమి చెబుతాయి?
చర్యలను బట్టి క్రియ వాక్యంలో ఏమిచేబుతుందో గమనించండి.
1) వస్తువు గాని,వ్యక్తీ గాని ఏమిచేయునో తెలుపుతుంది.
(come,take,act,play,eat..ఇలా అనేక రకాలు)
*Chiranjeevi acted in many films
* She sings a song
2) వస్తువుకు గాని,వ్యక్తికీ గాని ఏమి జరిగిందో తెలుపుతుంది. (Be+V3)
Be= is,am,are,was,were,be,been,being
ఇదే passive Voice
*He was arrested
*Letters were posted
*Shop was closed
3) వస్తువుకు గాని,వ్యక్తికీ గాని 'కలిగియుండి ' అనే భావనని తెలుపుతుంది.
(Have,Has,Had)
*She has knowledge
*They had Rs.15 lakhs
*I have a computer
4) ఒక వస్తువు,వ్యక్తీ యొక్క స్తితి ని గాని, గుణాన్ని గాని, చెబుతుంది.అలాగే చేసే పనిని కూడా చెబుతుంది. (నిజానికి ఇది ఒకటవ రూలుకు సామీప్యం)
(is,am,are,was,were,will be, shall be)
*The kids are on the bed
*Chiranjeevi is a popular hero
*Rama is a good boy
*Sita is reading
(సశేషం)
చర్యలను బట్టి క్రియ వాక్యంలో ఏమిచేబుతుందో గమనించండి.
1) వస్తువు గాని,వ్యక్తీ గాని ఏమిచేయునో తెలుపుతుంది.
(come,take,act,play,eat..ఇలా అనేక రకాలు)
*Chiranjeevi acted in many films
* She sings a song
2) వస్తువుకు గాని,వ్యక్తికీ గాని ఏమి జరిగిందో తెలుపుతుంది. (Be+V3)
Be= is,am,are,was,were,be,been,being
ఇదే passive Voice
*He was arrested
*Letters were posted
*Shop was closed
3) వస్తువుకు గాని,వ్యక్తికీ గాని 'కలిగియుండి ' అనే భావనని తెలుపుతుంది.
(Have,Has,Had)
*She has knowledge
*They had Rs.15 lakhs
*I have a computer
4) ఒక వస్తువు,వ్యక్తీ యొక్క స్తితి ని గాని, గుణాన్ని గాని, చెబుతుంది.అలాగే చేసే పనిని కూడా చెబుతుంది. (నిజానికి ఇది ఒకటవ రూలుకు సామీప్యం)
(is,am,are,was,were,will be, shall be)
*The kids are on the bed
*Chiranjeevi is a popular hero
*Rama is a good boy
*Sita is reading
(సశేషం)
Active voice- Passive తేడ..
I sent a letter (AV)...నేను లెటర్ పంపాను.
A letter was sent by me(PV)....నాచేత లెటర్ పంపబడింది.
పైన మనం AV ని PV గా మార్చాం. అర్ధ భేదం లేదు..నిజ జీవితం లో కూడా మనం ఇలాగె మాట్లాడితే అక్కడ కూడా అర్ధ భేదం ఉండదు.కాని మనము active voice ని passive voice గా మార్చో...లేక passive voice ని active voice గా మార్చో ఇంగ్లిష్ మాట్లాడం.అక్కడ సందర్భాన్ని బట్టి దేనికదే విడి విడిగా ఏది బాగుంటదని అనుకుంటామో అదే మాట్లాడతాము.ఇక్కడ Be+V3 =Passive voice గా మనము గుర్తు పెట్టుకోవాలన్తే.చదువుకొనే రోజులలోని గ్రామర్ ని మనసులో పెట్టుకొనే అర్ధభేధం వుదడనే భావననుండి మనము బయట పడాలి.అక్కడ వరకూ అది రైటే.కాని మనము మాట్లాడే విధానము వేరు.ఇక్కడ దేనికదే విడివిడి గా భావించాలి.
I sent = నేను పంపాను
I was sent = నన్ను పంపారు. (ఇక్కడ అర్ధం విభేదించింది కదా)
కాని పై వాక్యాలు ఈ వాక్యాలు ఒక్కటి కాదు. పై వాక్యాలు AV నుండి PV కి మార్చాము.ఇక్కడ మాత్రం దేనికదే విడి విడి గా వున్నది.AV నుండి PV కి మార్పు కాదని గమనించండి.
MORE EXAMPLES
- He liked: అతను ఇష్టపడ్డాడు...He was liked: అతనిని ఇష్ట పడ్డారు.
- He arrested: అతను అరెస్ట్ చేసాడు..He was arrested..అతనిని అరెస్ట్ చేసారు.
- He selected..అతను సెలక్ట్ చేసాడు..He was selected ..అతనిని సెలక్ట్ చేసారు.
- I told.. నేను చెప్పను.....I was told..నాకు చెప్పారు
- Rama saw..రాముడు చూసాడు..Rama was seen..రాముడ్ని చూసారు.