పూర్వం ఇంగ్లిష్ భాషకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. ఇంగ్లిష్ భాష పుట్టు పూర్వోత్తరాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇంగ్లిష్ భాష ఇండో-యురోపియన్ భాషల కుటుంబానికి చెందింది. ఈ కుటుంబంలో ఉండే అనేక శాఖల్లో ఒకటైన జర్మానిక్ భాషల (ఇంగ్లిష్, జర్మన్, స్వీడిష్ మొదలైనవి) శాఖకు చెందినదే ఇంగ్లిష్. క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటికి జర్మానిక్ భాష మూడు వేర్వేరు గ్రూపులుగా విడిపోయింది.
అవి ఈస్ట్ జర్మానిక్, నార్త్ జర్మానిక్, వెస్ట్ జర్మానిక్. ఆధునిక జర్మన్, డచ్, ఫ్లెమిష్, ఫ్రిషియన్, ఇంగ్లిష్ భాషలు వెస్ట్ జర్మానిక్ గ్రూప్‌కి చెందినవి. జూట్ లాండ్, దక్షిణ డెన్మార్క్ ప్రాంతాల నుంచి వచ్చిన చొరబాటు దారులు (సాక్సన్స్, జూట్స్, ఆంగ్లీస్) క్రీస్తు శకం 5, 6 శతాబ్దాల్లో బ్రిటిష్ ప్రాంతాల్లో స్థిర పడడం ప్రారంభించారు. వీరందరూ కలిసి ప్రస్తుతం ఇంగ్లండ్‌గా గుర్తింపు పొందుతున్న ప్రాంతం నుంచి సెల్టిక్ భాష మాట్లాడే స్థానికులను స్కాట్‌లాండ్, వేల్స్, ఐర్లాండ్ ప్రాంతాలకు తరిమివేశారు. ఆంగ్లీస్ అనే వారు ఇంగ్లాండ్ అనే ప్రాంతం నుంచి వచ్చారు. వీరి ద్వారానే ఇంగ్లాండ్, ఇంగ్లిష్ అనే పేర్లు వచ్చాయి. అప్పుడు వీరు మాట్లాడే భాషను ఓల్డ్ ఇంగ్లిష్ అనేవారు.
ఆ తర్వాత వైకింగులు క్రీ.శ.850 ప్రాంతంలో ఇంగ్లండ్ పై దాడి చేసి విజయం సాధించి అక్కడే స్థిర పడిన తర్వాత ఇంగ్లిష్ అనేక మార్పులకు గురైంది. 1066లో డ్యూక్ ఆఫ్ నార్మాండి విలియమ్ ఇంగ్లండ్‌ని, ఆంగ్లో-సాక్సన్లను జయించాడు. ఆ తర్వాత ఇంగ్లిష్‌లో మరిన్ని మార్పులు జరిగాయి. 1100-1500 వరకు వాడిన ఇంగ్లిష్‌ని మిడిల్ ఇంగ్లిష్ అంటారు. సాంస్కృతిక పునరుజ్జీవనం తర్వాత ఇంగ్లిష్‌లో మరిన్ని మార్పులు ఏర్పడ్డాయి. 1500 -1800 మధ్య కాలాన్ని ఆధునిక ఇంగ్లిష్ భాషకు తొలి దశగా భావిస్తారు. 1800 తర్వాత నుంచి ఇంగ్లిష్ ఆధునికంగా మారింది. అనేక దేశాలకు విస్తరించింది.

2 comments:
ధన్యవాదాలు ప్రత్రాప్ గారు , 6 సంవత్శరాలుగా ప్రయత్నిస్తున్న ఇంగ్లిష్ మాట్లాడాలని , మిత్రులతో ఇంగ్లీషులో చాట్ బాగానే చేస్తాను . కాని మాట్లడలేక పోతున్నా. మీ బ్లాగ్ నాకు ఎంతో స్పూర్తిని ఇచ్చింది. మరోసారి ధన్యవాదములు.
సంతోషం రాము గారు.ఈసారి మీ ప్రయత్నం తప్పక ఫలిస్తుంది.
Post a Comment