ముందుమాట
భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్
మనము ఒక తెలుగు వాక్యాన్ని ఇంగ్లిష్ లోనికి మార్చాలనుకున్నాము. అదేమంటే.. వారు ఒక చిన్నారిని దత్తత తీసుకుందామనుకున్నారు... They wanted to అడాప్ట్ a child. వాక్యనిర్మాణము కరక్టే. కానీ 'ఆడాప్ట్' స్పెల్లింగ్ ఏమిటి? మనకు ఎక్కడో చదివిన గుర్తు.... ADAPT, ADEPT, ADOPT ఈ3 33మూడు spellings లో ఏది రాద్దాం అనే సమస్య వస్తుంది. మాటలాడే సమయంలో ఫర్లేదు గాని వ్రాసినప్పుడు మనకు సమస్య. ఎందుకంటే ఈ మూడింటికి వేరు వేరు అర్దాలు వున్నాయి. ఇంగ్లీష్ తో మనకు ఇదే సమస్య. అలా అర్ధాలు వేరువేరు గా లేకపోతే ఏదో ఒకటి వ్రాసేవారము.. అక్షర దోషమని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఒకదాని బదులు మరోటి వ్రాస్తే అర్ధదోషం వస్తుంది. so .. మనము ఈ విషయంలో జాగ్రత్తగా వుండాలి.ఇలా మనల్ని ఇబ్బంది పెట్టేవి ఇంగ్లిష్ లో చాలానే వున్నాయి. వాటిలో కొన్ని చూద్దాము.
Adapt................. తగిన విధముగా మార్చడము.
Adopt..................దత్తత తీసుకొను
Adept.................. నైపుణ్యము,నేర్పరితనము..
Adivise................(సలహా) క్రియా పదంగా ఉపయోగించాలి
Adivice................(సలహా) వ్యాకరణ పరంగా నామవాచకం అవుతుంది.
Altar.................... ప్రార్ధనా స్థలంలో వుండే దైవ పీఠం.
Alter.................... మార్పు
All ready............... సర్వ సన్నద్దంగా ఉండటం.
Already................. అప్పటికల్లా
Antic....................ఇతరులకు నవ్వు తెప్పెంచే విధంగా ప్రవర్తించడం.
Antique................పురాతన వస్తువు.
Artist.................... ఏదైనా కళలో నైపుణ్యం వున్న వ్యక్తి.
Artiste...................ఏదైనా కళను ఇతరులకు అందించి money తీసుకునే వ్యక్తి
Baby.....................పిల్లవాడు/పాప
Bobby...................అవివేకి
Bald......................బట్టతల
Bold......................ధైర్యము
Ball.......................బంతి
Bawl.....................అరుపు
Bass......................lowest male voice
Boss.................... అధికారి
Bowdy.................అమర్యాదగా ప్రవర్తించు
Body..................మనిషి/జంతు శరీరము
Bellow................గర్జించు
Below..................తక్కువ స్థాయి, దిగువ
Beside................. ప్రక్క ప్రక్కనే
Besides................అందనంగా
Boarder............... వేరేయింట్లో ఉండి చదువుకునేవాడు.
Border................. సరిహద్దు
Boon....................వరము
Bone.....................ఎముక
Bough....................చెట్టు కొమ్మ
Bow......................విల్లు
Brake...................వాహనమును ఆపు సాధనము
Break................... ముక్కలుచేయు, అధిగమించు
Site.......................స్థలము
Sight....................దృశ్యము
College.................కళాశాల
Collage.................కొన్ని వస్తువుల సమూహము
Complement..........ఒక దానితో సరిపడేది
Compliment............ఇతరులను మెచ్చుకోవడం
Confirm................ ఒక విషయము నిజమేనని దృవీకరించడం
Conform................నియమావళికి అనుగుణంగా నడచుకోవడం
READ MORE
(సశేషం)
ఆకలి చావు . . . ఈ మాట వినగానే ఒళ్ళు జలదరిస్తుంది.ఏమి చేయలేమ? పరిస్తితిని మార్చలేమా?. . . అన్న ఆలోచనతో మనసు బరువెక్కుతుంది.
కానీ అలా భాధపదనక్కరలేదు. ఇంటర్నెట్ ముందు కూర్చొని freerice.com website open చేసి మీకు ఓపిక ఉన్నంత సేపు కూర్చుని సాధ్యమైనంత అన్నం పోగెయ్యండి.దానంతట అదే ఆకలి కడుపులకు చేరి పోతుంది.ఇదేలాగో చూద్దాం.
మన బ్లాగ్ ఉద్దేశ్యం మెల్ల మెల్లగా మంచి ఇంగ్లిష్ నేర్చుకోవడం. దానిలో భాగంగా మనం పదజాలం నేర్చుకోవాలి-వాక్య నిర్మాణాలు (grammar) తెలుసుకుంటూ ఉండాలి. అది ఒక ఆటలాగా సాగితే ఎంత బాగుంటుంది.! అదీను . . . ఈ కారణం గా పేదవాడి ఆకలి కూడా తీర్చగలుగుతున్నాను అనే తృప్తి ఉంటె ఇంకెంత బాగుంటుంది.
ఏమిటి ఈ ఆట?
ఈ వెబ్సైటు హోం పేజి ఓపెన్ చేయగానే ఓ ఆంగ్లపదం, దాని క్రింద మరో నాలుగు పదాలు కనిపిస్తాయి.పై పదానికి సమానార్ధం వచ్చే పదం మీద క్లిక్ చేయగానే (అది రైట్ అయితే పది బియ్యపు గింజలు ఒక దగ్గర చేరతాయి.తప్పు ఐతే మరో సరి ప్రయత్నం చేసి సాధ్యమైనన్ని ఎక్కువ బియ్యం పోగెయ్యండి.అలాగే మిగతా subjects కూడా..ఇక మీ ఓపిక - తీరిక..
ఎవరు చెల్లిస్తారు?
ప్రశ్నలకు జవాబు ఎంపిక చేసినప్పుడు ఆ వెబ్ పేజి అడుగున స్పేస్ పొందే ప్రకటన కర్తలు అబియ్యపు గింజలకు అవసరమయ్యే డబ్బు చెల్లిస్తారు.ఆంగ్ల పద జాలాన్ని నేర్వడం, ఆకలి తీర్చడం ఒకేసారి రెండు లాభాలు కల్పిస్తోన్న ఈ సైట్ లో ఆపిల్ , తోషిబా వంటి వాటితో పాటు ఎన్నెన్నో కంపినీలు ముందుకొచ్చాయి.
ఆలోచన వెనుక. . . . . .
జాన్ బ్రిన్ అమెరిక దేశీయుడు.వెబ్ సైట్ ల రూపకర్త. ఓ ఆన్ లైన్ గేమ్ తయారు చేయాలనుకున్నాడు.ఏదో ఆషా మాషి గేమ్ లా కాకుండా దానికో ప్రయోజనం ఉంటె బాగుంటుంది అనుకున్నాడు.దాని ఫలితమే ఈ సైట్ రూపకల్పన.
ఈ గేమ్ ఆడి చూడండి. పేదవాడి ఆకలి తీరుతుంది. మన జ్ఞాన దాహం కూడా తీరుతుంది. దీని లింక్ కోసం(దిగువ) చూడండి.
CLICK HERE
ప్రియ విద్యార్ధులకు
10 వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నాయి. మన ఇంగ్లిష్ సరే..మీకు వలసినవి చాలానే వున్నాయి.
సోషల్ కూడా చాలా ఎక్కువ సిలబస్ వుందికదా..అంచేత మా సోషల్ మాస్టర్ గారైన k.శ్రీనివాసరావు గారిని అడిగితే వారు ఏకంగా paper-1 కి paper-2 కి రివిజన్ లెసన్ చెప్పారు. మీ సౌకర్యార్ధం దానిని షూట్ చేసి ఇక్కడ వుంచుతున్నాను. ఈ 8 పార్టులను ఒక్కసారి చూస్తే 10 వ తరగతి తెలుగు మరియు ఇంగ్లిష్ మీడియం విద్యార్ధులకు చక్కగా ఉపయోగ పడుతుందనే నేను ఆశిస్తున్నాను. అంతే కాదు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విధ్యార్ధులు కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. మీ ప్రతాప్..
Popular Posts
-
ENGLISH SENTENCES వాక్యములు ప్రధానంగా నాలుగు రకాలని చెప్పవచ్చు. 1)ASSERTIVE--------------...
-
ORDER OF WORDS తెలుగులో కర్త-కర్మ-క్రియ వరుసగా వస్తాయి......S+O+V ఇంగ్లీష్ లో కర్త-క్రియ-కర్మ వరుసగా వస్తాయి......S+V+O రాముడు రావణున...
-
మనం మన భావాలను Active Voice లో చెప్పాలా/Passive Voice లో చెప్పాలా/ మీకు AV వచ్చు ..అలాగే PV వచ్చు... మీరు ఎందులో చెప్పినా తప్ప...
-
THE HOUND OF THE BASKERVILLES SUPPLEMENTARY READER-1 - S.S.C - ENGLISH (EM) (ఈ పోస్ట్ HTML కోడ్ లో ఉన్నందున ఇక్కడ pri...
-
మిత్రులారా... మాటలాడే సమయంలో తప్పులు దొర్లుతాయేమో అనే భావన మరిన్ని తప్పులు చేయడానికి కారణము అవుతుంది తప్ప దానివల్ల వేరే ప్రయోజనం లేదు.ఈ రోజ...
-
***Sung By Smt.Abigail, Z.P.High School,Pedapalakaluru, Guntur District (A.P)***{For S.S.C (TM) Students} Bangle sel...
-
కొంతమంది మిత్రులు మెయిల్ పంపారు. ఏమనంటే -" సర్ ఈరోజే మీ బ్లాగ్ చూడటం జరిగింది. కానీ అందులో lessons చాలానే ఉన్నట్లుగా ఉన్న...
-
-
-
ఈరోజు మనము classroom నిర్వహణ గురించి తెలుసుకుందాం .