ముందుమాట
భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్
డియర్ ఫ్రెండ్స్
ఎక్కువ మాటలు అనవసరం.చెప్పాల్సింది సింపుల్ గా మనసుకు హత్తుకునేలా చెప్తూ 'ENGLISH' లోని అసలు మర్మాలు చెప్పడమే ఈ బ్లాగ్ ఉద్దేశ్యం.
ముందు ఇది తెలుసుకోండి, ఇంగ్లీష్ గ్రామర్ వచ్చినంతనే ENGLISH లో మాట్లాడలేరు. ENGLISH మాట్లాడే వారందరికి గ్రామర్ వచ్చని అర్ధం కాదు.
అసలు నీకు TELUGU గ్రామర్ ఎంత వచ్చని నీవు తెలుగు అంత అనర్ఘళంగా మాట్లాడుతున్నావు? నీవు చిన్నప్పుడు మాట్లాడుతూ చేసే తప్పులను
సరి చేసి అమ్మ,నాన్న,ఇరుగు-పొరుగు, నీకు తెలియకుండానే 'తెలుగు' బేసిక్స్ చెప్తున్నారన్నమాట.
ఆపై నీకు నువ్వే నీ పరిసరాలనుండి, నీ అవసరాల నుండి ఎన్నోన్నో పదాలను- ఆపై వాక్యాలను నేర్చి ఈ దశకు వచ్చావు. అందుకే ముందుగా నేను చెప్పే ప్రాధమిక అంశాలను మనసు పెట్టి తెలుసుకో.{ ఇవి అన్ని నీవు గ్రామర్ పుస్తకాలలో చదివినవే కావచ్చు-చదవని వారూ ఉండవచ్చు కదా. అదీ గాక 'బేసిక్స్' ఎప్పుడూ ముక్కున పెట్టుకుని వదిలేవి కావు. బేసిక్స్ లో PERFECTION లేనప్పుడు ఒక భాష నే కాదు, మరేమీ సాధించలేము.} ఆపై "కృషితో నాస్తి దుర్భిక్షం" అన్న ఆర్యోక్తి ని నమ్మి పట్టుదలతో ముందుకు సాగిపో-
ఎందుకు? ఏమిటి? ఎలా? అని బాబు మోహన్ లా ప్రశ్నించకుండా ముందుగా నేను తెలియ జేయబోయే మినిమం కాన్సెప్ట్స్ ని అవగాహన చేసుకుంటూ, అవసరమైనవాటిని కంటస్థం చేస్తూ - ప్రతి రోజు 10 పదాలైన నేర్చుకుంటూ ముందుకు సాగిపో.......ALL THE BEST
Popular Posts
-
PARTS OF SPEECH The words which we use are divided into various classes according to their...
-
మనం మన భావాలను Active Voice లో చెప్పాలా/Passive Voice లో చెప్పాలా/ మీకు AV వచ్చు ..అలాగే PV వచ్చు... మీరు ఎందులో చెప్పినా తప్ప...
-
-
THE HOUND OF THE BASKERVILLES SUPPLEMENTARY READER-1 - S.S.C - ENGLISH (EM) (ఈ పోస్ట్ HTML కోడ్ లో ఉన్నందున ఇక్కడ pri...
-
ఈరోజు మనము classroom నిర్వహణ గురించి తెలుసుకుందాం .
-
ORDER OF WORDS తెలుగులో కర్త-కర్మ-క్రియ వరుసగా వస్తాయి......S+O+V ఇంగ్లీష్ లో కర్త-క్రియ-కర్మ వరుసగా వస్తాయి......S+V+O రాముడు రావణున...
-
మిత్రులారా... మాటలాడే సమయంలో తప్పులు దొర్లుతాయేమో అనే భావన మరిన్ని తప్పులు చేయడానికి కారణము అవుతుంది తప్ప దానివల్ల వేరే ప్రయోజనం లేదు.ఈ రోజ...
-
Artery....................ధమని Bald head………... బట్ట తల Bandy legged.......దొడ్డి కాళ్ళు Bile...................
-
నమస్కారములు- ఇప్పటి వరకు మనం రెండు అంశాలను స్పృశి యించాము. 1......
-
***Sung By Smt.Abigail, Z.P.High School,Pedapalakaluru, Guntur District (A.P)***{For S.S.C (TM) Students} Bangle sel...
2 comments:
nice introduction brother
i'm following u sir from now onwards..
Post a Comment