ముందుమాట
భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్
ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించిన సమయంలో " Nursery Rhyme" చిన్న పిల్లల పాఠాలలో కనిపించేది. ఆ rhyme ఇలా ప్రారంభమయ్యేది.
"Rain rain go away" . . . ఈ పాట వాళ్ళ వాతావరణానికి సరిగ్గా సరిపోయేది. వాన రావడం, ముసురు పట్టడం వాళ్ళకు చిరాకు. అంచేత వాళ్ళు 'పోవే పోవే వానా' అంటారు. మనవాళ్లు ఈ విషయాన్ని తరువాత గమనించి ఆ rhyme కొంత మార్చారు. ఇలా ... "రైన్, రైన్, కం అగైన్" Rain rain come again
మనం నిత్యం వానలను ఆహ్వానించాలి. ఆహ్వానించినా అవి బెట్టు చేసి రాని సంధార్భాలే ఎక్కువ. అందుకే మనం దేనినీ గుడ్డిగా అనుకరించ కూడదు. మన సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణమైన వాటినే ఆహ్వానించాలి, అది పాటైనా, మాటైనా... ఇది ఏ దేశానికి ఆ దేశమే ఆదర్శం.
C కి 'క' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
'C' కి ముందుగాని,వెనుక గాని "A,O,U,R" వచ్చినప్పుడు.
EX.......... CAP, COT, CUT, FACT, LUCK
C కి 'స' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
'C' కి ముందుగాని,వెనుక గాని "E, I, Y" వచ్చినప్పుడు.
EX...........CENT, CITY
C కి 'ష' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
'C' కి ముందుగాని,వెనుక గాని "ea. ia" వచ్చినప్పుడు
EX..........OCEAN, SOCIAL
(వీటిలోను కొన్ని మినహా ఇంపులు వుంటాయి.మీరు మరీ అంత లోతు గ విశ్లేషణ చేయవద్దు)
'G' కి 'జ ' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
'G' కి ముందుగాని,వెనుక గాని "E, Y" వచ్చినప్పుడు.
EX.......... GENTLE, GYMNASTICS
'G' కి 'గ ' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
'G' కి ముందుగాని,వెనుక గాని "A,I,O,U,L,N,R" వచ్చినప్పుడు.
EX...........GATE, GIFT, GOLD, GUARD, GLORY, MAGNET, GREAT
' T ' కి 'చ ' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
' T ' కి ముందుగాని,వెనుక గాని "U" వచ్చినప్పుడు.
EX.......... NATURE, FUTURE
' T ' కి 'ష ' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
' T ' కి ముందుగాని,వెనుక గాని "IA,IO" వచ్చినప్పుడు.
EX...........INERTIA, NATION
' S ' కి 'ష ' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
'S ' కి ముందుగాని,వెనుక గాని "U" వచ్చినప్పుడు.
EX.......... SURE, ASSURANCE
' S ' కి 'జ ' (క్షమించండి ఇక్కడఉచ్చారణ 'జ' కాదు.దానికి సరైన అక్షరం అందుబాటులో లేదు) ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
' S ' కి ముందుగాని,వెనుక గాని "I, Y" వచ్చినప్పుడు.
EX...........RISE, WISE, WAYS, LAWS
- పదజాలం (vocabulary) ని రోజు రోజుకి డెవలప్ చేసుకో--
- ఈత గురించి basics నేర్చుకున్నంత మాత్రాన ఈత రాదు.నీళ్ళలో ధైర్యం గా దూకి ఈదులాడితేనే ఈత వస్తుంది.ఇంగ్లిష్ అయినా అంతే-
- ఇంగ్లిష్ వార్తా పత్రికలు చదవడం- ఇంగ్లిష్ న్యూస్ వినడం-ఇంగ్లిష్ సినిమాలు చూడడం చేయాలి.
- భయము-బిడియము లేకుండా ఫ్రెండ్స్ తో తప్పు అయినా,ఒప్పు అయినా -ఇంగ్లిష్ లోనే మాట్లాడాలి.
- మనము చేసిన తప్పులను గమనించి మరలా ఆ తప్పులు చేయకుండా చూసుకోవాలి.
- ముఖ్యమైన phrases, idioms అర్థం చేసుకుని కంటస్థం చేయాలి.
- ప్రాధమిక అంశాలు నేర్చుకోకుండా ఇంగ్లిష్ నేర్చుకోవలనుకోవడం అవివేకం.
- నేర్చుకున్న ప్రతి అంశాన్ని ఉపయోగించాలి.
- ధృఢమైన నిర్ణయం తీసికో
- ఇంగ్లిష్ తప్పక నేర్చుకోవాలనే positive thinking లోనే ఎప్పుడూ ఉండాలి.
Popular Posts
-
PARTS OF SPEECH The words which we use are divided into various classes according to their...
-
మనం మన భావాలను Active Voice లో చెప్పాలా/Passive Voice లో చెప్పాలా/ మీకు AV వచ్చు ..అలాగే PV వచ్చు... మీరు ఎందులో చెప్పినా తప్ప...
-
ఈరోజు మనము classroom నిర్వహణ గురించి తెలుసుకుందాం .
-
ORDER OF WORDS తెలుగులో కర్త-కర్మ-క్రియ వరుసగా వస్తాయి......S+O+V ఇంగ్లీష్ లో కర్త-క్రియ-కర్మ వరుసగా వస్తాయి......S+V+O రాముడు రావణున...
-
THE HOUND OF THE BASKERVILLES SUPPLEMENTARY READER-1 - S.S.C - ENGLISH (EM) (ఈ పోస్ట్ HTML కోడ్ లో ఉన్నందున ఇక్కడ pri...
-
మిత్రులారా... మాటలాడే సమయంలో తప్పులు దొర్లుతాయేమో అనే భావన మరిన్ని తప్పులు చేయడానికి కారణము అవుతుంది తప్ప దానివల్ల వేరే ప్రయోజనం లేదు.ఈ రోజ...
-
ENGLISH SENTENCES వాక్యములు ప్రధానంగా నాలుగు రకాలని చెప్పవచ్చు. 1)ASSERTIVE--------------...
-
కొంతమంది మిత్రులు మెయిల్ పంపారు. ఏమనంటే -" సర్ ఈరోజే మీ బ్లాగ్ చూడటం జరిగింది. కానీ అందులో lessons చాలానే ఉన్నట్లుగా ఉన్న...
-
***Sung By Smt.Abigail, Z.P.High School,Pedapalakaluru, Guntur District (A.P)***{For S.S.C (TM) Students} Bangle sel...
-