మిత్రులారా... మనము అనేక రకాల దొంగలను చూసాము. వారు దొంగిలించే వస్తు విలువలను బట్టి 'గజ దొంగ' 'చిల్లర దొంగ' , పిచ్చి దొంగ, సరదా దొంగ..... పని నుండి తప్పించుకుని తిరిగే వారిని 'పని దొంగ' ఇలా అంటాము కదా... మరి సమయాన్ని దొంగిలించే దొంగని ఏమంటామో తెలుసా? వాడి పేరే "Procrastination" అదే వాయిదా జబ్బు... రేపు చేద్దాము, ఎల్లుండి చేద్దాము.... మరో విచిత్రమేమంటే అందరు దొంగలూ బయట వుంటారు.. కానీ ఈ దొంగ మనలోనే వుంటాడు. ముఖ్యముగా మీలోనే వున్నాడు. అందుకే కదా... జరిగినదేదో జరిగిపోయింది... మరలా మనము ఇంగ్లిష్ భాష నేర్చుకోవడం "క్రొత్తగా మొదలెడదాం" అని " The First Lesson" పేరుతో రెండు Lessons వ్రాస్తే అలా పై పై న చూసి వీటిని తరువాత practice చేద్దాములే అని అలా వదిలేశారు... వద్దు మిత్రమా... అలా మనము just చదువుకుంటూ పోతే మనకు english మాత్రమే కాదు.. ఏదీ రాదు.. ఏ కొద్ది నేర్చుకున్నా application అవసరము... దీనిని మీరు గుర్తిస్తే 3 వ lesson కి వెళదాము. అప్పటివరకూ సెలవు. నమస్తే...
ముందుమాట
భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్



0 comments:
Post a Comment