రామాయణ గ్రంధం ఆమూలాగ్రమే అక్కరలేదు..ఏ కొంత భాగం చదివినా ఎలా బ్రతకాలో, ఎలా బ్రతక కూడదో చెబుతుంది..ఎలా మాట్లాడాలో, ఎలా మాటలాడకూడదో చెబుతుంది..ఈరోజు మనము చర్చించుకునే "కమ్యూనికేషన్ స్కిల్స్" పర్సనాలిటీ డెవలప్మెంట్" అసలు ఇందులో దొరకనిది ఏది? రాముడు దేవుడో కాదో ప్రక్కన పెట్టి వారిని మనము ఆదర్శ పురుషునిగా అంగీకరించవలసిందే. వారి మహోన్నత వ్యక్తిత్వానికి చెయ్యెత్తి నమస్కరించ వలసిందే..తెలుగు కుటుంబాలకు వినమ్రంగా "శ్రీ రామ నవమి" శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. నమస్తే- మీ ప్రతాప్
ముందుమాట
భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్



1 comments:
Pedipull is actually a pole inside of a shape of a
"T" bolted towards the wall or to the ground.
Feel free to surf to my web-site; bowflex for sale
Post a Comment