ముందుమాట
భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్
1) Modal Verb తరువాత ప్రధాన క్రియ గాని, సహాయక క్రియ గాని తప్పకుండ వెర్బ్ మొదటి రూపం (V1) అవుతుంది.
ఉదాహరణకు- will go
will have eaten
2) ఇవి gerunds గా ఉండవు.
3) Participles గా వుండవు.
4) వీటికి ing రూపము ఉండదు.
5) to+infinitives గా ఉండవు.
6) ఏకవచన,బహు వచన భేదాలుండవు.
7) Person భేదాలుండవు.(పాత గ్రామర్ రూల్స్ లో shall కి will కి పాటించేవారు)
8) సకర్మ,అకర్మ భేదాలుండవు.
0 comments:
Post a Comment