ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Sunday, October 21, 2012

సర్! మాకు ఇంగ్లిష్ రాదా..? Part-2


మిత్రులారా

ఈ ప్రశ్న మీ హృదయంతరాలలో నిరంతరం రగులుతూనే ఉండాలి.తగు సమాధానం దొరికేంత వరకూ మీరు శోదిస్తూనే ఉండాలి.దొరికిన సమాధానం మీకు తృప్తిని కలిగిస్తే ఇకపై దాని అమలుకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలి.. ఆ ప్రణాళిక ఎలా ఉండాలంటే మీ సాధ్యసాధ్యలకు లోబడి ఉండాలి....


ఒక్కసారి కమిట్ ఐతే మీ మాట మీరే విననంతటి స్థాయిలో  ఉండాలి.మీ లక్ష్యాలను చిన్న చిన్న గా విభజించు కుంటూ పెద్ద స్థాయికి వెళ్ళాలి..

*మీ ప్రణాళిక ఒక Time Table లా ఉండకూడదు. అదే నండి.. 6.00 am To 7.00 am ఇంగ్లిష్ పేపర్ చదవాలి, 7.00 am To 8.00 am - ఇంగ్లిష్ గ్రామర్ చదవాలి..ఇలా వద్దండి..ఇది కేవలం స్కూల్స్ కి కాలేజస్ కి మాత్రమే పరిమితం..ఇలా ఎందుకు చెబుతున్నానంటే ..ఒకరోజు మీ ఇంటికి భందువులు వచ్చారనుకుందాం..వారితో పాటుగా ఉదయం 6-7 బయటకు వెళ్ళవలసి రావచ్చు..లేదా 7-8 మీకు స్పెషల్ క్లాసు ఉండవచ్చు..అలాంటప్పుడు ఏం జరుగు తుంది? ఆటోమాటిక్ గా ఈ రోజూ చేయవలసిన పని రేపటి 6-7 కి 7-8 కి వాయిదా వేయబడుతుంది... మిత్రులారా..ఇప్పటివరకు మనం సమయాన్ని వృధా చేసింది ఇలాగేగా..పైగా నా తప్పేమి ఉందని మన మనసుకు మనం సర్ది చెప్పుకుంటాం..

మీరు వినలేదా? PROCRASTINATION IS THE THIEF OF TIME...

*మరి మీ ప్రణాళిక ఎలా ఉండాలి..

మనకున్న 24 గంటలలో తప్పక చేయ వలసిన పనులకు కేటాయించవలసిన సమయాన్ని తీసి వేసి మిగిలిన సమయం ఆధారంగా ప్రణాళిక సిద్దం చేసుకోవాలి.

For Example

కళాశాల లేదా ఆఫీస్ లో గడపవలసిన సమయం(ఇది తప్పదు)........ 8 గంటలు
నిద్రకు కేటాయించ వలసిన సమయం (ఇది తప్పదు)......................  8 గంటలు
రెడీ అవటానికి పట్టే సమయం (దీనిని మీరు తగ్గించుకోవచ్చు)........... 1 గంట 
ఇతరములు (దీనిని మీరు తగ్గించుకోవచ్చు)..................................  1 గంట 
ఆఫీస్ పని లేదా అకడమిక్ సబ్జెక్ట్స్ చదువుట(దీనిని పెంచుకోవచ్చు). 3 గంటలు
TV/Computer..................................................................... 1 గంట
                                                                                           ---------------
                                                               మొత్తం .......            22 గంటలు 
                                                                                            --------------

24-22  = 02  కాబట్టి ఒక రోజులో రెండు గంటలు ఇంగ్లిష్ కి కేటాయించవచ్చు...ఆదివారాలు..శలవు దినాలలో ఈ 2 కి 8 గంటలు Add అవుతాయి..అప్పుడు మొత్తం 10 గంటలు..ఖంగారు వద్దు..ఈ 10 గంటలలో మీ ఇష్టానికి 4 గంటలు ఉపయోగించుకొని మిగిలిన 6 గంటలు ఇంగ్లిష్ కి కేటాయించండి..ఇలా మీరు working days లో 2 గంటలు (రోజులో మీకు ఎప్పుడు వీలయితే అప్పుడు) Holidays లో 6 గంటలు..(మీ అవకాశాన్ని బట్టి సమయం విభజించుకోండి) నేను 3 వ పార్టు లో చెప్పినట్లుగా సాధన చేయండి.... అప్పుడు మీకు ఇంగ్లిష్ మాత్రమే  కాదు....  ఏదైనా సుసాధ్యమే..( రీ పబ్లిష్)


                                                                                                 
క్షమించాలి..సమయం కుదరక మీకు పూర్తి  LESSON ని అందించలేక పోతున్నాను..మీకు నిజంగా ఉపయోగ పడేది PART-3.. మాత్రమే..........

పార్ట్-3 ని త్వరలో మీముందుకు తీసుకు రాగలను....అప్పటివరకు క్షంతవ్యుడను....
                                                                                     విజయీభవ.......మీ....ప్రతాప్

                                                   

Thursday, October 18, 2012

సర్! మాకు ఇంగ్లిష్ రాదా?(part-1)




ఈ ప్రశ్న మీరు ఎవరిని అడుగుతున్నారు?

దీనికి ఒకొక్కరు ఒకొక్క రకంగా సమాధానం చెబుతారు..

ఒకరంటారు..అబ్బో అది చాల తేలిక..కేవలం మూడు  నెలలోనే నేను నేర్చుకోగలిగాను..(ఇది అబద్దమే అయినా మరి మీరు అడిగినప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా)... అంతేనా..స్పోకెన్ ఇంగ్లిష్ సి.డి లు కొనుక్కో..... రోజూ  ఇంగ్లిష్ పేపర్ చదువు..ఇంగ్లిష్ సినిమాలు చూడు..ఇలా..వుంటుంది..

మరొకరు..ఇలా చెబుతారు...

అయ్యా....ఆయనెవరో..2 నెలలోనే ఇంగ్లిష్ అని బోర్డ్ పెడితే అక్కడకు..వెళ్లి 2000 వదిలిన్చుకున్నాను..ఈయనెవరో  1 నెలలోనే "ఇంగ్లిష్ ధైర్యం గా మాటలాడండి" అని  బోర్డ్ పెడితే ఇక్కడకు వచ్చాను.. సంవత్సరం క్రితం  భయంకరంగా ఒక పుస్తకం గురించి బాగా పబ్లిసిటీ ఇస్తే "24 గంటలలో ఇంగ్లిష్ నేర్చుకోండి" అనే ఈ పుస్తకం కొని సంవత్సరం నుండి (అంటే 24 ఇంటు 360) ప్రయత్నిస్తూనే ఉన్నాను.పిచ్చెక్కి పోతుంది తమ్ముడు..నాకైతే ఇంగ్లిష్ రాలేదు..

ఇలా ఇంగ్లిష్ వచ్చినవాడిని అడిగితె...ఒక సమాధానం..
ఇంగ్లిష్ రాని వాడిని అడిగితె ఒక సమాధానం..
నా లాంటి వచ్చీ, రాని వాడిని అడిగితె..మరో సమాధానం...

ఇలా మీరు అడుగుతూ పోయినంత కాలం..వచ్చిన సమాధానాలలో ఏది ఆచరణీయం అని ఆలోచిస్తూ సమయం గడిపినంతకాలం..ఒక భాషమాత్రమే కాదు..మనకేమీ రాదు..ఒక సెమినార్ ఇవ్వలేము..స్టేజి పైకి ఎక్కి పది నిముషాలు మాటలాడలేము...ఈ సమాజానికి పనికి వచ్చే ఒక్క మంచి పనిని చేయాలని ఉన్నా..చేయగల అవకాశాలున్నా..చేయలేము......అయ్యయ్యో  ..నేనెప్పుడు..ఇంతే , ఉన్నట్టు ఉండి వేరే టాపిక్ లోకి వెళ్ళిపోతాను..... అసలు విషయం ఇంగ్లిష్ గురించి కదా..

ఇంగ్లిష్ ఎలా వస్తుందో చూద్దాం..

ఈత ఎలా వేయాలో నేను చెబుతాను...కాళ్ళు,చేతులు ఆడించాలనో, నీటిని మన రెండు చేతులతో మన ఉదర భాగం క్రిందకు నెడుతూ మనం పైకి తేలేలా  ప్రయత్నిన్చాలనో.. ..ఇలా చాలానే చెబుతాను..మీరు చక్కగా వింటారు..అయినా మీకు ఈత వస్తుందా..రాదు కదా..

మరీ ఎప్పుడు వస్తుంది?

* ముందు నీటిలోకి దిగాలి...
*లోతు లేని ప్రాంతంలో ప్రయత్నించాలి..
*ఆపై మెడలోతు నీటిలో మరో వ్యక్తిని ఆసరాగా చేసుకొని ప్రయత్నిస్తూ ఉండాలి..
అప్పుడు మాత్రమే కదా ఈత వస్తుంది...
సరే మరో విషయం చూద్దాం..

ఇప్పటికే మీరు సైకిల్ త్రోక్కడం నేర్చుకుని ఉంటారు..ఒక్కసారి ప్లాష్ బాక్ లోకి వెళ్ళండి..
అసలక్కడ థీరీ క్లాసే ఉండదు..డైరెక్ట్ గా ప్రాక్తికల్సే ..ఒక్కసారైనా పడకుండా..కనీసం ఖంగారైనా  పడ కుండా నీవు సైకిల్ నేర్చుకోగాలిగావా?.. కాకపోతే ..అక్కడ, అన్నయ్యో, అక్కయ్యో, నాన్నో..ఆసరాగా ఉండి ఉంటారు......ఇక్కడ ----- అలాంటి ఆసరా ఓ టీచర్ ద్వారా దొరుకుతుంది..ఆ ఆసరాతో మీకై మీరే ప్రయత్నించి ముందుకు వెళ్లాలే  తప్ప..కటినమైన మీ ప్రయత్నం  లేకుండా ..మీరేమి సాధించలేరు..ఇలా ఎన్నైనా చెప్పవచ్చు గానీ..అసలు విషయం మరుగున పడుతుంది.......

 ఆ అసలు విషయాలు..నా  నుండి మీకు లభించే ఆసరా (ఎలా చదివితే ఇంగ్లిష్ వస్తుంది? అనే విషయాలు)
నా తదుపరి పోస్ట్ లో చూడండి.. 2,3 రోజులలో పార్ట్-2 వ్రాయగలను.. అప్పటివరకు..సెలవు..(రీ పబ్లిష్)
మీ ప్రతాప్ మాస్టర్..శుభాశీస్సులు..

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates