ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Thursday, November 20, 2014

HOMONYMS



మిత్రులారా మీతో మాటలాడి (పోస్ట్ వ్రాసి) చాలా రోజులైనది.క్షంతవ్యుడనని చెబుతూ Lesson లోనికి వెళదాము.

     Live ని మనం ..'లివ్' అని చదువుదామా?
                                    లేక  'లైవ్' అని చదువుదామా?

రెండూ రైటే   

 Live (లివ్) = నివసించు (verb)
    Live (లైవ్) = ప్రాణముతో ఉన్న (adj)

Live (verb)... Where do you live?
                             We used to live in London.
                                   Both her children still live at home

Live(adj)....  We saw a real live rattlesnake
                           The number of live births (=babies born alive)
                                  Live coverage of the world Cup......
గమనించారుగదా.......
             కొన్ని పదాలకు రెండేసి ఉచ్చారణలు ఉండి రెండేసి అర్ధాలు వస్తాయి. కొన్ని పదాల spelling లో కొద్ది మార్పు ఉండి ఉచ్చారణలో బహు కొద్ది మార్పు ఉంటుంది. ఇలాంటి పదాలను Homonyms అంటారు.

మరో ఉదాహరణ చూద్దాం.

Convict ని మనము verb గా వాక్య నిర్మాణము చేబడితే దానిని మనం కన్విక్ట్ గా ఉచ్చరించాలి..నేరానికి శిక్ష విధించు అనే అర్ధంలో..He was convicted of fraud.

అదే Convict ని మనము Noun గా వాక్య నిర్మాణము చేబడితే దానిని మనము కాన్విక్ట్ గా ఉచ్చరించాలి... నేరానికి శిక్ష అనుభవించు వ్యక్తి అనే అర్ధంలో ...A person who has been found guilty of a crime and sent to prison.
homographs మరియు homophones కలసి HOMONYMS అవుతాయి..
  • Homographs are words that are spelled the same but have different meanings.
  • Homophones are words that sound the same when you pronounce them, but have different meanings.
Homonyms List కోసం దిగువ ఇవ్వబడిన Link క్లిక్ చేయండి.
http://homeworktips.about.com/od/englishhomework/a/homonyms.htm

వీడియో కోసం http://videos4spokenenglish.blogspot.com/ లింక్ క్లిక్ చేయండి.



Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates