ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Sunday, June 17, 2012

Rain, rain go away

                                 
ఆంగ్లేయులు  మన దేశాన్ని పరిపాలించిన సమయంలో " Nursery Rhyme"  చిన్న పిల్లల పాఠాలలో కనిపించేది. ఆ rhyme ఇలా ప్రారంభమయ్యేది.
"Rain rain go away" . . . ఈ పాట వాళ్ళ వాతావరణానికి సరిగ్గా సరిపోయేది. వాన రావడం, ముసురు పట్టడం వాళ్ళకు చిరాకు. అంచేత వాళ్ళు 'పోవే పోవే వానా' అంటారు. మనవాళ్లు ఈ విషయాన్ని తరువాత గమనించి ఆ rhyme కొంత మార్చారు.  ఇలా ... "రైన్, రైన్, కం అగైన్" Rain rain come again

      మనం  నిత్యం వానలను ఆహ్వానించాలి. ఆహ్వానించినా అవి బెట్టు చేసి రాని సంధార్భాలే ఎక్కువ. అందుకే  మనం దేనినీ గుడ్డిగా అనుకరించ కూడదు. మన సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణమైన వాటినే ఆహ్వానించాలి, అది పాటైనా, మాటైనా... ఇది ఏ దేశానికి ఆ దేశమే ఆదర్శం. 

Friday, June 15, 2012

అక్షరాలు - శబ్దాలు



C కి 'క' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
        'C' కి ముందుగాని,వెనుక గాని "A,O,U,R" వచ్చినప్పుడు.
                  EX.......... CAP, COT, CUT, FACT, LUCK

C కి 'స' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
        'C' కి ముందుగాని,వెనుక గాని "E, I, Y"   వచ్చినప్పుడు.
                 EX...........CENT, CITY

C కి 'ష' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
         'C' కి ముందుగాని,వెనుక గాని "ea. ia" వచ్చినప్పుడు
                 EX..........OCEAN, SOCIAL

(వీటిలోను కొన్ని మినహా ఇంపులు వుంటాయి.మీరు మరీ అంత లోతు గ విశ్లేషణ చేయవద్దు)
                                                    

'G' కి 'జ ' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
        'G' కి ముందుగాని,వెనుక గాని "E, Y"  వచ్చినప్పుడు.
                  EX.......... GENTLE, GYMNASTICS

'G' కి 'గ ' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
        'G' కి ముందుగాని,వెనుక గాని "A,I,O,U,L,N,R" వచ్చినప్పుడు.
                 EX...........GATE, GIFT, GOLD, GUARD, GLORY, MAGNET, GREAT

                                                        

' T ' కి 'చ  ' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
        ' T ' కి ముందుగాని,వెనుక గాని "U"   వచ్చినప్పుడు.
                  EX.......... NATURE, FUTURE
' T ' కి 'ష  ' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
        ' T ' కి ముందుగాని,వెనుక గాని "IA,IO" వచ్చినప్పుడు.
                 EX...........INERTIA, NATION

                                                       

' S ' కి 'ష   ' ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
        'S ' కి ముందుగాని,వెనుక గాని "U"   వచ్చినప్పుడు.
                  EX.......... SURE, ASSURANCE 
' S ' కి 'జ ' (క్షమించండి ఇక్కడఉచ్చారణ 'జ' కాదు.దానికి సరైన అక్షరం అందుబాటులో లేదు) ఉచ్చారణ ఎప్పుడు వస్తుందో తెలుసా-
        ' S ' కి ముందుగాని,వెనుక గాని "I, Y" వచ్చినప్పుడు.
                 EX...........RISE, WISE, WAYS, LAWS

Wednesday, June 13, 2012

ముఖ్యమైన పది సూత్రాలు

  1. పదజాలం (vocabulary) ని రోజు రోజుకి  డెవలప్ చేసుకో--
  2. ఈత గురించి basics నేర్చుకున్నంత మాత్రాన ఈత రాదు.నీళ్ళలో ధైర్యం గా దూకి ఈదులాడితేనే ఈత వస్తుంది.ఇంగ్లిష్ అయినా అంతే-
  3. ఇంగ్లిష్ వార్తా పత్రికలు చదవడం- ఇంగ్లిష్ న్యూస్ వినడం-ఇంగ్లిష్ సినిమాలు చూడడం చేయాలి.
  4. భయము-బిడియము లేకుండా ఫ్రెండ్స్ తో తప్పు అయినా,ఒప్పు అయినా -ఇంగ్లిష్ లోనే మాట్లాడాలి.
  5. మనము చేసిన తప్పులను గమనించి మరలా ఆ తప్పులు చేయకుండా చూసుకోవాలి.
  6. ముఖ్యమైన phrases, idioms అర్థం చేసుకుని కంటస్థం చేయాలి.
  7. ప్రాధమిక అంశాలు నేర్చుకోకుండా ఇంగ్లిష్ నేర్చుకోవలనుకోవడం అవివేకం.
  8. నేర్చుకున్న ప్రతి అంశాన్ని ఉపయోగించాలి.
  9. ధృఢమైన నిర్ణయం తీసికో 
  10. ఇంగ్లిష్ తప్పక నేర్చుకోవాలనే positive thinking లోనే ఎప్పుడూ ఉండాలి. 

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates